బంగారు పాదం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బంగారు పాదం
(2015 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎన్ హెచ్ ప్రసాద్
తారాగణం దయా కొడవటిగంటి,
జ్యోతిశ్రీ
సంగీతం జ్యోశ్యభట్ల
నిర్మాణ సంస్థ సుమలీల సినిమా
భాష తెలుగు

బంగారు పాదం 2015లో విడుదలైన ఒక తెలుగు చలనచిత్రం.[1]

దయా (దయా కొడవటిగంటి) ఒక వికలాంగుడు. హత్యా నేరం మీద జైలుకెళ్ళిన అతను, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ తన ఇంటికి వస్తాడు. కానీ తన కుటుంబం ఎక్కడుందో తెలియకపోవడంతో ఒంటరి జీవితం గడుపుతూ, మరో ఊరికి చేరుకుంటాడు. కొన్నాళ్ళు ఒకరిద్దరు మహిళలతో సావాసం చేసి, వారు కూడా తనని వదిలి వెళ్లిపోవడంతో రైతుకూలిగా మారతాడు. ఆ తర్వాత ఒక గెస్ట్ హౌస్ దగ్గర వాచ్ మాన్ గా పనిలో కుదురుతాడు. అక్కడే దయా దగ్గర బంగారు పాదం ఉందన్న విషయం కొందరికి తెలుస్తుంది. దానిని ఎలాగైనా కాజేయాలనుకుంటారు. తన బంగారు పాదాన్ని కాపాడుకొనే క్రమంలో దయా చనిపోతాడు..[2]

మూలాలు

[మార్చు]
  1. "Bangaru Padham (2015)". Indiancine.ma. Retrieved 2021-03-29.
  2. "సినీ జోష్ వెబ్ సైట్ లో చిత్ర విశేషాలు". Archived from the original on 2016-06-02. Retrieved 2017-08-21.