Jump to content

ఏ 1 ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
(ఎ1 ఎక్స్‌ప్రెస్ నుండి దారిమార్పు చెందింది)
ఎ1 ఎక్స్‌ప్రెస్
ఎ1 ఎక్స్‌ప్రెస్ సినిమా పోస్టర్
దర్శకత్వండెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను
దీనిపై ఆధారితంనాట్పే తునై
నిర్మాతటి.జి. విశ్వ ప్రసాద్
అభిషేక్ అగర్వాల్
సందీప్ కిషన్
దయా పన్నెన్
తారాగణంసందీప్ కిషన్
లావణ్య త్రిపాఠి
మురళీ శర్మ
రావు రమేశ్
ఛాయాగ్రహణంకెవిన్‌ రాజ్‌‌
కూర్పుచోటా కె. ప్రసాద్
సంగీతంహిప్హాప్ తమిజా
నిర్మాణ
సంస్థలు
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌
వెంకటాద్రి టాకీస్
విడుదల తేదీs
5 మార్చి, 2021
సినిమా నిడివి
138 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

ఎ 1 ఎక్స్‌ప్రెస్, 2021 మార్చి 5న విడుదలైన తెలుగు స్పోర్ట్స్ కామెడీ సినిమా.[1] పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌, వెంకటాద్రి టాకీస్‌ బ్యానర్లలో టి.జి. విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెన్ నిర్మించిన ఈ సినిమాకు డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను దర్శకత్వం వహించాడు.[2] ఇందులో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, మురళీ శర్మ, రావు రమేష్ తదితరులు నటించగా, హిప్‌హాప్‌ తమిళ సంగీతం సమకూర్చాడు. 2019లో విడుదలైన నాట్పే తునై అనే తమిళ సినిమాకి రిమేక్ ఇది.[3] క్రీడలలో అవినీతి, పక్షపాత వైఖరి సంబంధించిన సమస్యల నేపథ్యంలో ఈ సినిమా రూపొందించబడింది.[4]

నటవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
Untitled

ధృవ, కృష్ణార్జున యుద్ధం సినిమాల తరువాత హిప్‌హాప్‌ తమిళ సంగీతం సమకూర్చిన మూడవ తెలుగు సినిమా ఇది. తమిళ సినిమా నాట్పే తునై లోని ట్యూనులనే ఈ సినిమాకి వాడుకున్నారు. రామజోగయ్య శాస్త్రి, కిట్టు విస్సాప్రగడ, సామ్రాట్ పాటలు రాసారు. రాహుల్ సిప్లిగంజ్ పాడిన "సింగిల్ కింగులం" అనే మొదటి పాట 2020 ఫిబ్రవరి 12న విడుదలైంది.[5] ఒక సంవత్సరం తరువాత, ఇన్నో జెంగా పాడిన "అమిగో" అనే మరో పాట 2021 ఫిబ్రవరి 10న విడుదలైంది. రోల్ రైడా, యోగి సేకర్ పాడిన మూడవ పాట "వీధికోకా జాతి" పాటల 2020 ఫిబ్రవరి 25న విడుదలైంది. నాల్గవ పాట "తెలవారుతుంటే" 2021 మార్చి 1న విడుదలైంది.

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "సింగిల్ కింగులం (రచన: సామ్రాట్)"  రాహుల్ సిప్లిగంజ్ 3:44
2. "అమిగో (రచన: రామజోగయ్య శాస్త్రి)"  ఇన్నో గెంగ 3:08
3. "వీధికొక జాతి (రచన: రామజోగయ్య శాస్త్రి, రోల్ రైడా)"  రోల్ రైడా, యోగి శేఖర్ 2:26
4. "తెలవారుతుంటే (రచన: కిట్టూ విస్సాప్రగడ)"  సుస్వరం అనిరుధ్ 3:06
5. "సీటు సిరగద (రచన: హిప్‌హాప్‌ తమిళ, వంశీ వికాస్)"  హిప్‌హాప్‌ తమిళ, ప్రణవ్ చాగంటి, మంగ్లీ 3:34
6. "పుట్టిభూమి (రచన: రామజోగయ్య శాస్త్రి)"  కాల భైరవ 3:03
7. "పోరాటమే (రచన: కృష్ణ చైతన్య)"  సంజిత్ హెగ్డె 3:39
8. "చరిత్రనే లిఖించరా (రచన: హిప్‌హాప్‌ తమిళ, కిట్టు విస్సాప్రగడ)"  హిప్‌హాప్‌ తమిళ, హేమచంద్ర 4:09
26:49

మూలాలు

[మార్చు]
  1. "Sundeep Kishan and Lavanya Tripathi starrer A1 Express to hit screens on March 5 - Times of India". The Times of India. Retrieved 2021-03-05.
  2. "Sundeep Kishan's A1 Express goes on floors; First Telugu film on Hockey backdrop". Times of India. 4 November 2018. Retrieved 2021-03-05.
  3. "Sundeep Kishan on whether A1 Express is a complete remake of Tamil film Natpe Thunai". www.zoomtventertainment.com. Retrieved 2021-03-05.
  4. "A1 Express trailer: The hockey drama raises an important question about corruption and nepotism in sports". Times of India. 2021-01-26. Retrieved 2021-03-05.
  5. "A1 Express | Single Kingulam Song Vertical Video | Sundeep Kishan, Lavanya Tripathi | Hiphop Tamizha". youtube.com. 12 February 2020. Retrieved 2021-03-05.{{cite web}}: CS1 maint: url-status (link)

బయటి లింకులు

[మార్చు]