సిద్దార్థ (2016 సినిమా)
Appearance
సిద్దార్థ | |
---|---|
దర్శకత్వం | దయానంద్ రెడ్డి |
నిర్మాత | దాసరి కిరణ్ కుమార్ |
తారాగణం | సాగర్ సాక్షి చౌదరి రాగిణి నంద్వాని |
ఛాయాగ్రహణం | ఎస్. గోపాలరెడ్డి |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | రామదూత క్రియేషన్స్ |
విడుదల తేదీ | 16 సెప్టెంబర్ 2016 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సిద్దార్థ 2016లో విడుదలైన తెలుగు సినిమా. రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి దయానంద్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సాగర్, సాక్షి చౌదరి, రాగిణి నంద్వాని హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా 2016 సెప్టెంబరు 16న విడుదలైంది.[1]
కథ
[మార్చు]ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న సూర్య (సాగర్) వాటికి దూరంగా మలేషియా వెళతాడు. అక్కడ సహస్ర (రాగిణి నంద్వాని) ప్రేమలో పడతాడు. తరువాత తన సమస్యలను సాల్వ్ చేసుకోడానికి ఇండియా వెళ్లి తన ప్రేమను వదులుకోవాల్సి పరిస్థితిలో చిక్కుకుంటాడు. అసలు సూర్య గతమేమిటి ? తన ప్రేమను ఆటను ఎందుకు వదులుకోవాల్సి వస్తుంది ? చివరికి అతని ప్రేమ ఏమైంది ? అనేదే మిగతా సినిమా కథ.
నటీనటులు
[మార్చు]- సాగర్ - సూర్య\సిద్దార్థ [2]
- సాక్షి చౌదరి
- రాగిణి నంద్వాని - సహస్ర [3]
- కోట శ్రీనివాసరావు
- సన
- అజయ్ - విక్రమ్
- నాగినీడు
- బెనర్జీ
- సుబ్బరాజు
- రణధీర్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కె.వి. దయానంద్ రెడ్డి [4]
- నిర్మాత : దాసరి కిరణ్ కుమార్
- సంగీతం : మణిశర్మ
- ఛాయాగ్రహణం: ఎస్. గోపాలరెడ్డి [5]
- ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
- పాటలు: అనంత్ శ్రీరామ్
మూలాలు
[మార్చు]- ↑ 123 Telugu (17 September 2016). "Siddhartha telugu movie review". 123telugu.com (in ఇంగ్లీష్). Archived from the original on 1 June 2021. Retrieved 1 June 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (4 July 2015). "'మొగలి రేకులు' సాగర్ హీరోగా 'సిద్ధార్థ'". Sakshi. Archived from the original on 29 July 2021. Retrieved 29 July 2021.
- ↑ Mana Telangana (10 September 2016). "బబ్లీగా... ఎమోషనల్‌గా కనపడతా". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News. Archived from the original on 1 June 2021. Retrieved 1 June 2021.
- ↑ iQlikmovies (31 August 2016). "New Director With Pawan Kalyan's Blessings". iQlikmovies. Archived from the original on 1 June 2021. Retrieved 1 June 2021.
- ↑ Andhravilas. "సిద్దార్థ సినిమా సెన్సార్ పూర్తి -Andhravilas-Latest Telugu Movie News, Movie Gossips-Tollywood headlines with videos, photo galleries". Andhravilas. Archived from the original on 1 June 2021. Retrieved 1 June 2021.