Jump to content

అనంత శ్రీరామ్

వికీపీడియా నుండి
(అనంత్ శ్రీరామ్ నుండి దారిమార్పు చెందింది)
అనంత శ్రీరామ్
జననం
చేగొండి అనంత శ్రీరామ్

(1984-04-08) 1984 ఏప్రిల్ 8 (వయసు 40)
ఇతర పేర్లుఅనంత శ్రీరామ్
వృత్తిసాహితీకారుడు
క్రియాశీల సంవత్సరాలు2005 - ఇప్పటివరకు

అనంత శ్రీరామ్ (జ. 1984 ఏప్రిల్ 8) సినీ గీత రచయిత. ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డిపట్ల. తల్లిదండ్రులు సీవీవీ సత్యనారాయణ, ఉమారాణి. ప్రాథమిక విద్య దొడ్డిపట్ల లోనూ, ఇంటర్మీడియట్ విజయవాడ లోనూ, ఇంజనీరింగ్ బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో చదివాడు. ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతుండగా పాటలపై మక్కువ పెరిగింది. ఇంజనీరింగ్ కన్నా పాటలే సంతృప్తినిస్తాయని భావించి దానిని ఆపేశాడు. ప్రముఖ రాజకీయ నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య అనంత్ కు వరుసకు పెదనాన్న అవుతాడు.

సినీ ప్రస్థానం

[మార్చు]

12ఏళ్ల వయస్సులోనే పాటలు రాయడం ప్రారంభించాడు. ఇతనికి గురువంటూ ఎవరూ లేరు. ఇతని నాన్నగారు వీరవెంకట సత్యనారాయణ మూర్తికి సాహితీవేత్తలతో ఉన్న పరిచయం వల్ల సినీ గేయ రచయిత కాగలిగాడు. మొదటిసారిగా "కాదంటే ఔననిలే" చిత్రంలో అవకాశం లభించింది. 2006లోనే హైదరాబాద్ వెళ్లాడు. అప్పటి నుంచి అక్కడే ఉండిపోయాడు. 2014 వరకు 195 చిత్రాలకు 558 పాటలను రాశాడు. అందరివాడు సినిమాతో ఇతనికి గుర్తింపు వచ్చింది. సిరివెన్నల సీతారామశాస్త్రి పాటలు అంటే ఇష్టపడతాడు.

సినిమాలు

[మార్చు]
  1. ఏ మాయ చేశావె (2010)
  2. కుర్రాడు (2009)
  3. ఓయ్ (2009)
  4. పిస్తా (2009)
  5. ఆ ఒక్కడు (2009): ఊరుకో మనసా
  6. మిత్రుడు (2009)
  7. ఆకాశమంత (2009)
  8. అరుంధతి (2009)
  9. సత్యమేవ జయతే (2009)
  10. శశిరేఖా పరిణయం (Jan 1st 2009)
  11. బలాదూర్ (2008)
  12. కొత్త బంగారు లోకం (2008)
  13. పరుగు (2008)
  14. కంత్రి (2008)
  15. చందమామ (2007)
  16. యమదొంగ (2007)
  17. మున్నా (2007)
  18. మాహారథి (2007)
  19. స్టాలిన్ (2006)
  20. బొమ్మరిల్లు (2006)
  21. అందరివాడు (2005)
  22. ఒక ఊరిలో ( 2005)
  23. జానకి రాముడు (2016)
  24. జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ (2018)- ఇలా చూడరా నాన్న, నాలో నిన్ను నేను
  25. నీ జతగా (2021)
  26. స్టాండప్‌ రాహుల్‌(2022)
  27. సీతా రామం (2022)
  28. మాతృదేవోభవ (2022)
  29. కృష్ణమ్మ (2024)

పురస్కారాలు

[మార్చు]
  1. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉగాది సందర్భంగా కళారత్న పురస్కారం[1][2]
  2. నంది పురస్కారం - 2012 నంది పురస్కారాలు: ఉత్తమ పాటల రచయిత (కోటి తారల్లోనా -ఎటో వెళ్ళిపోయింది మనసు)[3][4][5][6]
  3. 2013 సైమా అవార్డులు: ఉత్తమ గీత రచయిత - సీతమ్మ వాకిట్లో (సీతమ్మ వాకిట్ల సిరిమల్లె చెట్టు)

మూలాలు

[మార్చు]
  1. 39 మందికి ‘కళారత్న’ 29-03-2017 ఆంధ్రజ్యోతి[permanent dead link]
  2. "ఉగాది సందర్భంగా అవార్డులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం". andhrapradesh.suryaa.com. 2017-03-28. Archived from the original on 2022-02-16. Retrieved 2022-02-16.
  3. "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 29 June 2020.
  4. మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.
  5. సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.
  6. నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.