కృష్ణమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కృష్ణమ్మ
దర్శకత్వంవి.వి.గోపాలకృష్ణ
కథవి.వి.గోపాలకృష్ణ
నిర్మాతకృష్ణ కొమ్మలపాటి
తారాగణంస‌త్య‌దేవ్‌
అథిరా రాజ్
కృష్ణ బూరుగుల‌
లక్ష్మణ్ మీసాల
ఛాయాగ్రహణంసన్నీ కూరపాటి
కూర్పుతమ్మిరాజు
సంగీతంకాల భైరవ
నిర్మాణ
సంస్థ
అరుణాచల క్రియేషన్స్
విడుదల తేదీs
2024 మే 10 (2024-05-10)(థియేటర్)
2024 మే 17 (2024-05-17)( అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు

కృష్ణమ్మ 2024లో విడుదలైన తెలుగు సినిమా. కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి నిర్మించిన ఈ సినిమాకు వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వం వహించాడు. స‌త్య‌దేవ్‌, అథిరా రాజ్, అర్చన, కృష్ణ బూరుగుల‌, లక్ష్మణ్ మీసాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నటుడు సాయి ధరమ్ తేజ్ 2022 ఆగష్టు 4న విడుదల చేయగా,[1] సినిమాను 2024 మే 10న థియేటర్లలో విడుదల చేసి మే 17 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2]

క‌థ[మార్చు]

భద్ర (సత్యదేవ్), కోటి (లక్ష్మణ్ మీసాల), శివ (కృష్ణ బూరుగుల) ముగ్గురు అనాధలుగా పెరుగుతారు. శివ మీనా (అతీరారాజ్‌)ని ప్రేమిస్తుంటాడు. మీనాను భ‌ద్ర కూడా సొంత చెల్లెలిగా భావిస్తుంటాడు. మీనా త‌ల్లి ఆప‌రేష‌న్‌కు చాలా డ‌బ్బు అవ‌స‌ర‌మ‌వుతుంది. ఆ డ‌బ్బు కోసం భ‌ద్ర‌, శివ‌, కోటి చివరిసారిగా భారీ ఎత్తున గంజాయి స్మగ్లింగ్ చేసి వచ్చిన డబ్బుతో ఆపరేషన్ చేయించాలని డిసైడ్ అయి స్మ‌గ్లింగ్ చేస్తూ పోలీసుల‌కు దొరికిపోతారు? అనుకోకుండా ఈ ముగ్గురు స్నేహితులు రేప్ అండ్ మ‌ర్డ‌ర్ కేసులో చిక్కుకుంటారు? ఈ హ‌త్య కేసులో భ‌ద్ర‌, శివ‌, కోటిల‌ను ఇరికించింది ఎవ‌రు? చేయ‌ని త‌ప్పును ఒప్పుకోమ‌ని పోలీసులు వారిని ఎలా చిత్ర‌హింస‌ల‌కు గురిచేశారు? త‌మ‌ను త‌ప్పుడు కేసులో ఇరికించిన వారిపై ఈ ముగ్గురు ఎలా ప్రతీకారం తీర్చుకున్నారు అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: అరుణాచల క్రియేషన్స్
  • నిర్మాత: కృష్ణ కొమ్మలపాటి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.గోపాలకృష్ణ
  • సంగీతం: కాల భైరవ
  • సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి
  • ఎడిటర్ : తమ్మిరాజు
  • ఆర్ట్ డైరెక్టర్ : రామ్ కుమార్
  • మాటలు : సురేష్ బాబా
  • పాటలు : అనంత్ శ్రీరామ్
  • ఫైట్స్ : పృథ్వి శేఖర్

మూలాలు[మార్చు]

  1. 10TV Telugu (4 August 2022). "కృష్ణమ్మ టీజర్.. వైలెంట్‌గా మారిన సత్యదేవ్!" (in Telugu). Archived from the original on 17 May 2024. Retrieved 17 May 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. EENADU (17 May 2024). "సైలెంట్‌గా ఓటీటీలోకి 'కృష్ణమ్మ'.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే". Archived from the original on 17 May 2024. Retrieved 17 May 2024.
  3. Sakshi (17 May 2024). "కృష్ణమ్మ' మూవీ రివ్యూ". Archived from the original on 17 May 2024. Retrieved 17 May 2024.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=కృష్ణమ్మ&oldid=4220137" నుండి వెలికితీశారు