లక్ష్మణ్ మీసాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లక్ష్మణ్ మీసాల
Laxman Meesala.jpg
జననం (1984-08-12) 1984 ఆగస్టు 12 (వయస్సు: 34  సంవత్సరాలు)
రాణిపేట గ్రామం, పరలఖెముండి తాలూకా, గజపతి జిల్లా, ఒరిస్సా
నివాసంహైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
జాతీయతభారతీయుడు
జాతితెలుగు
వృత్తిరంగస్థల, సినిమా నటుడు
తల్లిదండ్రులుమీసాల రామారావు, నారాయణమ్మ

లక్ష్మణ్ మీసాల యువ రంగస్థల, సినిమా నటుడు.[1] అనేక పౌరాణిక, సాంఘిక నాటకాల్లో నటించిన లక్ష్మణ్ 'కో అంటే కోటి' సినిమా ద్వారా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించి, హితుడు, మనమంతా, వంగవీటి, ఘాజీ చిత్రాలలో నటించి గుర్తింపుపొందాడు.

రంగస్థల ప్రస్థానం[మార్చు]

2007లో హైదరాబాద్కి వచ్చిన లక్ష్మణ్, డి.యస్. దీక్షితులు దగ్గర నటనలో శిక్షణ పొంది అదే సంవత్సరం ప్రదర్శించిన అమ్మా నాకు బ్రతకాలని ఉంది నాటకంలో త్రిపాత్రాభినయంతో నాటకరంగంలోకి అడుగుపెట్టాడు. నేషనల్ స్కూల్ అఫ్ డ్రామా వారి ఆధ్వర్యంలో 2009లో హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో నెల రోజులపాటు జరిగిన రంగస్థల శిక్షణా శిబిరంలో పాల్గొని నటనలో మెళకువలు నేర్చుకోవడంతోపాటు, ఆ శిక్షణా శిబిరంలో తయారుచేసిన స్వప్న వసంతం నాటకంలో నటించాడు.

నటించినవి[మార్చు]

నాటకాలు:

 1. అమ్మా నాకు బ్రతకాలని ఉంది
 2. విష్ణుశర్మ ఇంగ్లీషు చదువులు
 3. కొమరం భీg
 4. శ్రమణకం
 5. ఆకాశదేవర
 6. అంబేద్కర్ రాజగృహ ప్రవేశం
 7. గో టు హెల్
 8. నీకూ నాకు మధ్య
 9. కాగితం పులి
 10. మహాత్మా జ్యోతిరావు పూలే
 11. సీత కల్యాణం
 12. శ్రీ మాధవ వర్మ
 13. యాదాద్రి మహాత్మ్యం
 14. పాండవోద్యోగం
 15. సత్యశోధన

నాటికలు:

 1. ఇల్లాలి ముచ్చట్లు (నాటిక) [2]
 2. షాడో లెస్ మాన్
 3. అమ్మకింక సెలవా
 4. ఈ పయనమెటు
 5. దావత్
 6. బాపు కలలుగన్న దేశం

సినీరంగ ప్రస్థానం[మార్చు]

నటించిన సినిమాలు[మార్చు]

 1. కో అంటే కోటి
 2. హితుడు
 3. నగరం నిద్రపోతున్న వేళ
 4. ప్రతినిధి
 5. పంచదార పచ్చిమిర్చి
 6. జీలకర్ర బెల్లం
 7. శమంతకమణి
 8. వంగవీటి
 9. ఘాజీ
 10. మనమంతా
 11. కొత్త కొత్తగా ఉన్నది
 12. తప్పటడుగు

బహుమతులు[మార్చు]

 1. ఉత్తమ హాస్యనటుడు - కోమరంభీం (నాటకం) - నంది నాటక పరిషత్తు - 2013
 2. ఉత్తమ హాస్యనటుడు - కోమరంభీం (నాటకం) - పరుచూరి రఘుబాబు నాటక పరిషత్తు - 2014 (పరుచూరిలో 2సార్లు ఉత్తమ హాస్యనటుడు)
 3. ఉత్తమ హాస్యనటుడు - ఇల్లాలి ముచ్చట్లు (నాటిక), 2016 (ప్రగతి కళామండలి, సత్తెనపల్లి) [3] (ఇల్లాలి ముచ్చట్లుకు 27సార్లు ఉత్తమ హాస్యనటుడు)
 4. ఉత్తమ నటుడు - దావత్ (నాటిక) - 2016 (సుమధుర కళానికేతన్ హాస్య నాటిక పరిషత్తు, విజయవాడ) [4]
 5. ఉత్తమ సహనటుడు - మాధవవర్మ (పద్యనాటకం) - రెండుసార్లు

మూలాలు[మార్చు]

 1. ఆంధ్రజ్యోతి. "కళా..పాప్‌కార్న్." Retrieved 12 August 2017.
 2. ఆంధ్రభూమి. "ఆదరణ కోల్పోతున్న నాటకరంగం". Retrieved 12 August 2017.
 3. ఈనాడు, సత్తెనపల్లి, May 3, 2016
 4. సుమధుర ఫలితాలు, నటకులమ్ మాసపత్రిక, ఆగష్టు 2016, పుట.4