వంగవీటి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వంగవీటి
Vangaveetimovie.jpg
కాపు కాసే శక్తి
దర్శకత్వంరామ్ గోపాల్ వర్మ
రచనచైతన్య ప్రసాద్
రాధాకృష్ణ
స్క్రీన్‌ప్లేరామ్ గోపాల్ వర్మ
కథరామ్ గోపాల్ వర్మ
నిర్మాతదాసరి కిరణ్ కుమార్
నటవర్గంసందీప్ కుమార్
వంశీ నక్కంటి
వంశీ చాగంటి
నైనా గంగూలీ
కౌటిల్య
శ్రీతేజ్
Narrated byరామ్ గోపాల్ వర్మ
ఛాయాగ్రహణంరాహుల్ శ్రీవాత్సవ
కె. దిలీప్ వర్మ
సూర్య చౌదరి
కూర్పురాతోలు సిద్దార్థ
సంగీతంరవి శంకర్
నిర్మాణ
సంస్థ
బాడ్ - కౌ ఫిలింస్
పంపిణీదారులురామదూత క్రియేషన్స్
AKS గ్లోబల్ మీడియా ఎల్.ఎల్.సి
విడుదల తేదీలు
23 డిసెంబరు 2016[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

వంగవీటి 2016 తెలుగు సినిమా. దీనికి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించాడు. [2][3]. ఈ సినిమా డిసెంబరు 23న విడుదలైనది. విజయవాడలో ప్రముఖ రాజకీయనాయకుడు వంగవీటి మోహనరంగా, ఆయన సోదరుడు వంగవీటి రాధామోహన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం నిర్మితమైనది.[2]

కథ[మార్చు]

చ‌ల‌సాని వెంక‌ట‌ర‌త్నం విప్ల‌వ పార్టీకి చెందిన నాయ‌కుడు. విజయవాడలో పేరు మోసిన రౌడీ. త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన వారికి త‌న‌కు వీలైనంత స‌హాయం చేస్తుంటాడు. త‌న మాట విన‌నివారికి త‌న క‌త్తితో బ‌దులిచ్చే వ్య‌క్తి. అలాంటి వెంక‌ట‌ర‌త్నం పేరు చెబితే అంద‌రూ భ‌య‌పడుతుంటారు. కానీ ఒక్క వ్య‌క్తి. అత‌నే రాధా. అంద‌రూ అత‌న్ని బ‌స్టాండ్ రాధా అని పిలుస్తుంటారు. రాదా గురించి తెలుసుకుని తన బృందంలో చేర్చుకుంటాడు వెంక‌ట‌ర‌త్నం. అయితే రాధా ప‌లుకుబ‌డి పెరిగిపోతుండ‌టంతో చెప్పుడు మాట‌లు విని రాధాను అవ‌మానిస్తాడు. దాంతో రాధా అత‌ని మ‌నుషులు వెంక‌ట‌ర‌త్నంను చంపేస్తారు. రాధా పెద్ద రౌడీగా పేరు తెచ్చుకుంటాడు. నగరంలో అత‌ని పేరు ప్రాబ‌ల్యంలోకి వ‌స్తున్న‌ప్పుడు దేవినేని గాంధీ, నెహ్రు, ముర‌ళి అనే కళాశాల విద్యార్థులు రాధా వ‌ద్ద‌కు చేరుతారు. రాధా పేరు నగరంలో ప్ర‌బ‌ల‌మైపోతున్న స‌మ‌యంలో ఓ సెటిల్‌మెంట్ గొడ‌వ‌లో రాధాను కొంద‌రు చంపేస్తారు. దాంతో వంగ‌వీటి మోహ‌న‌రంగా ప్రవేశం ఆరంభమౌతుంది. రాధాపై అభిమానంతో దేవినేని సోదరులు కూడా మోహ‌న్‌రంగాకే మద్దతు ఇస్తారు. అయితే చెప్పుడు మాట‌లు విన‌డం, చిన్న చిన్న స‌మ‌స్య‌లు పెరిగి పెద్ద‌ద‌వ‌డంతో వంగ‌వీటి మోహ‌న‌రంగాకు, దేవినేని బ్ర‌ద‌ర్స్‌కు మ‌ధ్య గొడ‌వ జ‌రుగుతుంది. త‌మ‌కు వ్య‌తిరేకంగా గాంధీ స్టూడెంట్ యూనియ‌న్‌ను రెచ్చ‌గొడుతున్నాడ‌ని తెలుసుకున్న మోహ‌న‌రంగా అత‌న్ని హెచ్చరించినా విన‌క‌పోవ‌డంతో, గాంధీని త‌న మ‌నుషుల‌తో చంపించేస్తాడు రంగా. దాంతో దేవినేని కుటుంబానికి, వంగ‌వీటి కుటుంబానికి దూరం పెరిగిపోతుంది. దేవినేని ముర‌ళి త‌న అన్న‌ను చంపిన వారిని చంపేస్తుంటాడు. మోహ‌న‌రంగా హెచ్చరికను పట్టించుకోకుండా అత‌న్ని కూడా చంపేస్తాని అన‌డంతో మోహ‌న‌రంగ, దేవినేని ముర‌ళిని కూడా చంపేస్తాడు. అప్ప‌టికే దేవినేని నెహ్రు రాజ‌కీయాల్లో ఉండ‌టం, వంగ‌వీటి పార్టీ అధికారంలో లేక‌పోవ‌డంతో అద‌ను చూసి వంగ‌వీటి మోహ‌న‌రంగ‌ను చంపేస్తారు అస‌లు ఇంత‌కు మోహ‌న‌రంగ‌ను చంపిందెవ‌రు? అంత‌కు ముందు విజ‌య‌వాడ‌లో జ‌రిగిన ప‌రిస్థితులేంటి? అనే విష‌యాలు మిగిలిన కథలో భాగం.[4]

తారాగణం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

 • నిర్మాణ సంస్థః రామ‌దూత క్రియేష‌న్స్‌
 • సంగీతంః ర‌విశంక‌ర్‌
 • చాయాగ్ర‌హ‌ణంః రాహుల్ శ్రీవాత్స‌వ్‌, కె.దిలీప్ వ‌ర్మ‌, సూర్య చౌద‌రి
 • కూర్పుః సిద్ధార్థ్ రాతోలు
 • ర‌చనః చైత‌న్య‌ప్ర‌సాద్‌, రాధాకృష్ణ‌
 • ద‌ర్శ‌క‌త్వంః రామ్‌గోపాల్ వ‌ర్మ‌
 • నిర్మాతః దాసరి కిర‌ణ్‌కుమార్‌

మూలాలు[మార్చు]

 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-12-20. Retrieved 2016-12-21.
 2. 2.0 2.1 "Vangaveeti trailer out: Ram Gopal Varmas crime drama looks raw and gritty".
 3. Admin, Press Ks (2 October 2016). "RGV Vangaveeti Movie Trailer Released Today 5Pm - Press News Release". Archived from the original on 29 నవంబర్ 2016. Retrieved 21 డిసెంబర్ 2016. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (help)
 4. "సినిమా రివ్యూ: వంగవీటి". ఆంధ్రజ్యోతి. 2016-12-23. Retrieved 2016-12-27.

బయటి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=వంగవీటి&oldid=3550685" నుండి వెలికితీశారు