దొంగ మొగుడు
దొంగ మొగుడు (1987 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ. కోదండరామిరెడ్డి |
---|---|
తారాగణం | చిరంజీవి, రాధిక శరత్‌కుమార్, భానుప్రియ, సుత్తి వేలు |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | మహేశ్వరి మూవీస్ |
భాష | తెలుగు |
దొంగ మొగుడు 1987 లో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో చిరంజీవి, మాధవి, రాధిక ముఖ్యపాత్రలు పోషించారు.ఈ సినిమా యండమూరి వీరేంద్రనాథ్ రచించిన నల్లంచు తెల్లచీర అనే నవల ఆధారంగా రూపొందించబడింది. చిరంజీవి ద్విపాత్రాఅభినయం చేసిన సినిమా ఇది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నమోదైంది.[1]
కథ[మార్చు]
రవితేజ ( చిరంజీవి ) ఒక వస్త్ర వ్యాపార సంస్థ ఉన్న పారిశ్రామికవేత్త. అతను వ్యాపారంలో విజయవంతమైన వ్యక్తి. కానీ అతని వ్యక్తిగత జీవితంలో మనశ్శాంతి లేదు. అతని భార్య (మాధవి), ఆమె తల్లి అతన్ని మానసికంగా హింసిస్తూంటారు. అతను తన అందమైన పర్సనల్ అసిస్టెంటు ప్రియంవదకు ( భానుప్రియ ) దగ్గరౌతాడు. ఇంతలో, అతని ప్రత్యర్థులు వ్యాపారంలో అతని విజయాలను తట్టుకోలేక, అతనిని మరో వ్యాపార ఒప్పందం పొందకుండా ఆపడానికి ప్రణాళిక వేస్తారు. ఈ సందర్భంలో అతను, చిన్నచితకా దొంగతనాలు చేసే నాగరాజు (చిరంజీవి) ను కలుస్తాడు. రవితేజను నాగరాజు రక్షిస్తాడు. వారిద్దరూ తమతమ స్థానాలను మార్పిడి చేసుకోవాలని రవితేజ ప్లాను వేస్తాడు. తద్వారా తన సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చని అతడి ఉద్దేశం. నాగరాజు అంగీకరించి, మాధవికి, ఆమె తల్లికి, రవితేజ శత్రువులకూ ఒక పాఠం నేర్పుతాడు. రవితేజ ఈ దొంగ జీవనశైలిలో తాను గడపాల్సిన వింత పరిస్థితిని ఎదుర్కొంటాడు. అతను చిన్న చిన్న దొంగతనాలు చేసే సీత ( రాధిక ) ను కలుస్తాడు. చివరికి, వారిద్దరూ తమ నిజమైన గుర్తింపులను వెల్లడిస్తారు. సినిమా సంతోషకరంగా ముగుస్తుంది.
తారాగణం[మార్చు]
- రవితేజగా చిరంజీవి
- ప్రియంవదగా భానుప్రియ
- మాధవి
- రావు గోపాలరావు
- గొల్లపూడి మారుతీరావు
- అల్లు రామలింగయ్య
- పి. జె. శర్మ
పాటలు[మార్చు]
పాటలను కొసరాజు రాఘవయ్య, సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచించగా, కె. చక్రవర్తి స్వరపరిచాడు.
# | పాట | గాయనీ గాయకులు |
---|---|---|
1 | "అద్దమరేయి మద్దెలా" | ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
2 | "ఈ చెంపకు" | ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
3 | "ఇడ్లీ పాపా" | ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
4 | "కోకమ్మా చెప్పమ్మా" | ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి |
5 | "నల్లంచు తెల్లచీర" | ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
6 | "నీ కోకకెంత" | ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి |