నల్లంచు తెల్లచీర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నల్లంచు తెల్లచీర ప్రముఖ నవలాకారుడు, సినీరచయిత యండమూరి వీరేంద్రనాథ్ రాసిన నవల. యండమూరి వీరేంద్రనాథ్ ఊహించుకున్న ఒక కథను చిరంజీవి కథానాయకునిగా దొంగమొగుడు చలన చిత్ర కథగా మలిచారు.[1] అదే కథలోని పాత్రలతో ఆయన ఈ నవల రచించారు. ధారావాహికగా ప్రచురితమైన ఈ నవల గొప్ప ప్రాచుర్యం పొందింది.

రచన నేపథ్యం

[మార్చు]

నల్లంచు తెల్లచీర నవల ఆలోచన వెనుక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. మహేశ్వరీ మూవీస్ వారి చిత్రం కోసం కథాచర్చలు జరుగుతున్న సమయంలో యండమూరి వీరేంద్రనాథ్ ఉదయం రచయిత్రి, కాలమిస్టు మాలతీ చందూర్ ఇంటికి, సాయంత్రం మరో స్నేహితుని ఇంటికి విందుకు వెళ్ళారు. భోజనాల అనంతరం ఆ స్నేహితుడికీ, అతని భార్యకీ మధ్య జరిగిన వాదనలో ఈ కథకు మూలబీజం ఏర్పడింది. యండమూరి మిత్రుడు లాజిక్ ఆలోచించని ఆడవాళ్ల గురించి ఓ నవల వ్రాయమని వీరేంద్రనాథ్‌కు సూచించారు. తన భార్య గురించి చెప్తూ ఉదయం రాత్రి మిగిలిన అన్నం, రాత్రి ఉదయం మిగిలిన అన్నం తినడం వల్ల రోజుకు అర్థరూపాయి ఆదా చేసి తద్వారా సంవత్సరాంతంలో మూడువందల రూపాయలు ఆసుపత్రిలో బిల్లు చేయడం గురించి వివరించారు. ఆపైన జరిగిన వాగ్వాదంలోంచి యండమూరి వీరేంద్రనాథ్‌కు నల్లంచు తెల్లచీర కథ స్ఫురించింది. ఆ కథను పెంచి సినిమా వారికి వినిపించగా ఆమోదించారు. పైగా యండమూరి సినిమా కథలో మార్పులు చేయడంతో దొంగమొగుడు సినిమా తయారైంది.
ఆపైన యండమూరి తొలిగా తయారుచేసుకున్న కథతో నల్లంచు తెల్లచీర నవల రచించారు. ఈ నవలను హైదరాబాదులో ఆంధ్రజ్యోతి పత్రిక ప్రారంభించిన కొత్త ఎడిషన్‌లో రోజువారీ ధారావాహికగా ప్రచురించారు. నవల పుస్తకంగా ప్రచురణ అయ్యాకా పలుమార్లు పునర్ముద్రణ పొందింది.

ఇతివృత్తం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "'న‌ల్లంచు తెల్ల‌చీర‌' నేయ‌బోతున్న యండ‌మూరి". NTV (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-06-11. Archived from the original on 2022-02-18. Retrieved 2022-02-18.