Jump to content

ఝాన్సీ రాణి (సినిమా)

వికీపీడియా నుండి

స్వాతంత్ర్య సమరయోధురాలు ఝాన్సీ లక్ష్మీబాయి వ్యాసం కోసం ఇక్కడ చూడండి.

ఝాన్సీ రాణి
(1988 తెలుగు సినిమా)
దర్శకత్వం సత్యానంద్
తారాగణం రాజేంద్ర ప్రసాద్,
భానుప్రియ,
కాంతారావు
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్రీ రాజలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

ఝాన్సీరాణి ప్రముఖ రచయిత సత్యానంద్ రచన, దర్శకత్వంలో, రాజేంద్రప్రసాద్, భానుప్రియ ప్రధాన పాత్రల్లో నటించిన 1988 నాటి తెలుగు చలన చిత్రం. మల్లాది వెంకట కృష్ణమూర్తి నవల మిస్టర్ వి ఆధారంగా సినిమాను నిర్మించారు.[1] సినిమా ఆర్థికంగా, ప్రేక్షకాదరణపరంగా పరాజయం పాలైంది.

నిర్మాణం

[మార్చు]

మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన మిస్టర్ వి నవల ఝాన్సీరాణి సినిమాకు ఆధారం. సినిమారంగంలో స్క్రిప్ట్, డైలాగ్ రచయితగా ప్రఖ్యాతుడైన సత్యానంద్ సినిమాకు దర్శకత్వం వహించారు.[2]

పాటల జాబితా

[మార్చు]
  • ప్రణయానికి పుట్టినరోజు, రచన :వేటూరి సుందర రామమూర్తి ,గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ,పి సుశీల
  • అతివ కోపం అధ్ర , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , పి సుశీల
  • రేపో మాపో పెళ్ళంట, రచన: వేటూరి సుందర రామమూర్తి ,గానం.మనో, ఎస్ జానకి.

విడుదల, స్పందన

[మార్చు]

సినిమా పరాజయం పాలైంది. అప్పటికే హాస్య కథానాయకుడిగా పేరు పొందిన రాజేంద్రప్రసాద్ నెగిటివ్ పాత్ర చేయడంతో ప్రేక్షకులు తిరస్కరించారని దర్శక రచయిత సత్యానంద్ విశ్లేషించుకున్నారు.[2]

మూలాలు

[మార్చు]
  1. మల్లాది, వెంకట కృష్ణమూర్తి (2024). మిస్టర్ వి నవల ముందుమాట. ఆరట్లకట్ట, ఆంధ్రప్రదేశ్: గోదావరి ప్రచురణలు. p. 3. ISBN 9789393761767.
  2. 2.0 2.1 బుర్రా, నరసింహ. "మర్డర్ చేసేవాడు కూడా మర్యాదగానే కనిపిస్తాడు!". సాక్షి. జగతి పబ్లికేషన్స్. Retrieved 17 August 2017.