తెలవారదేమో స్వామీ (పాట)

వికీపీడియా నుండి
(తెలవారదేమో స్వామీ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

తెలవారదేమో స్వామీ అనే ఈ పాట 1987లో విడుదలైన శ్రుతిలయలు చిత్రంలోని సుప్రసిద్ధమైన పాట. ఈ పాట రాసినందుకు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. ఈ పాటను గానం చేసింది జేసుదాసు , సంగీతం అందించింది కె.వి. మహదేవన్.

తెలవారదేమో స్వామీ పాటలోని దృశ్యం.

పాట నేపథ్యం[మార్చు]

పాటలోని సాహిత్యం[మార్చు]

పల్లవి:

తెలవారదేమో స్వామీ తెలవారదేమో స్వామీ

నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలుమంగకూ

తెలవారదేమో స్వామీ

నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలుమంగకూ

తెలవారదేమో స్వామీ

చరణం 1:

చెలువమునేలగా చెంగట లేవని కలతకు నెలవై నిలచిన నెలతకు ||2||

కలల అలజడికి నిద్దుర కరవై ||2||

అలసిన దేవేరి.. అలసిన దేవేరి.. అలమేలుమంగకూ ||తెలవారదేమో స్వామీ||


చరణం 2:

మక్కువ మీరగా అక్కున జేరిచి అంగజుకేళిని పొంగుచు తేల్చగా ||2||

ఆ మత్తునే మది మరి మరి తలచగా .. మరి మరి తలచగా

అలసిన దేవేరి.. అలమేలు మంగకూ

తెలవారదేమో స్వామీ.. గా మ ప ని

తెలవారదేమో సా ని ద ప మ ప మ గ ని స గా మ

తెలవారదేమో స్వామీ

పా ని ద ప మ గ మ ప స ని ద ప మ గ మ

ప స ని రి స గ రి మ గ రి సా రి నీ స ||తెలవారదేమో స్వామీ||


ఓ స్వామీ, నీ దేవేరి అలమేలు మంగకు తెలవారలేదా (అంటే నిద్ర లేవలేదా)?

ఎందుకు నిద్ర లేవలేదూ? అలసింది కాబట్టి - అలసిన దేవేరి

ఎందుకు అలసిపోయింది? నువ్వు మక్కువ (ఇష్టం) మీరగ (ఎక్కువకాగా) అక్కున (కౌగిట) చేర్చి అంగజు కేళిని (మన్మథ కృఇడ, సంభోగంలో) పొంగుచు తేల్చగ (వివశురాలయే విధంగా అలరించావు).

సంభోగము ముగిసినా ఆవిడ మిగతా రాత్రి అంతా ఆ వివశత్వాన్ని మరిచి పోలేక మరీ మరీ తలుచుకుంటూ మెలకువగానే ఉండిపోయింది - దాంతో అలసిపోయింది. అంచేత పొద్దున ఆమెకింకా తెల్లవారినట్లు లేదు.


ఇది పదకవితాపితామహుని అద్భుత దివ్య శృంగార కీర్తన - "పలుకుతేనెల తల్లి పవళించెను" కి ఒక నీరసమైన అనుకరణ.

పురస్కారాలు[మార్చు]

  1. సిరివెన్నెల సీతారామశాస్త్రి - ఉత్తమ గీత రచయితగా నంది పురస్కారాలు - 1987.

మూలాలు[మార్చు]