Jump to content

సిరివెన్నెల సీతారామశాస్త్రి

వికీపీడియా నుండి
(చేంబోలు సీతారామశాస్త్రి నుండి దారిమార్పు చెందింది)

సిరివెన్నెల సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన చేంబోలు సీతారామశాస్త్రి తెలుగు సినీ గీతరచయిత. విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో 1955 మే 20వ తేదీన శ్రీ డా.సి.వి.యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి గార్లకు జన్మించారు. తన ఉత్తమ విమర్శకురాలిగా తన భార్య 'పద్మావతి'ని పేర్కొనే సీతారామశాస్త్రి తన గురువుగా శ్రీ 'వై. సత్యారావు' అని చెబుతారు.[1]2019లో భారత ప్రభుత్వంచే ప్రదానంచేసే పౌరపురస్కారం పద్మశ్రీ లభించింది.

సీతారామశాస్త్రి
జననంచేంబోలు సీతారామశాస్త్రి
(1955-05-20)1955 మే 20
అనకాపల్లి,
విశాఖపట్నంజిల్లా,ఆంధ్రప్రదేశ్
మరణం2021 నవంబరు 30(2021-11-30) (వయసు 66)
నివాస ప్రాంతంహైదరాబాద్,తెలంగాణ
ఇతర పేర్లుసిరివెన్నెల సీతారామశాస్త్రి
వృత్తికవి,
రచయిత,
గాయకుడు,
, నటుడు
మతంబ్రాహ్మణ హిందూ
భార్య / భర్తపద్మావతి
పిల్లలుయెగేశ్వర్ శర్మ, రాజా చెంబోలు
తండ్రిడా.సి.వి.యోగి
తల్లిసుబ్బలక్ష్మి

బాల్యం

[మార్చు]

శాస్త్రి విద్యాభ్యాసం పదవ తరగతి వరకు అనకాపల్లిలో జరిగింది. కాకినాడలో ఇంటర్మీడియట్ పూర్తిచేసారు.ఆంధ్ర విశ్వకళా పరిషత్లో బి.ఎ పూర్తి చేసి ఎం.ఏ చేస్తుండగా తెలుగు చలనచిత్ర దర్శకుడు కె.విశ్వనాథ్ జననీ జన్మభూమి సినిమాకు[1] పాటలు రాసే అవకాశం కల్పించారు. సిరివెన్నెల సినిమాకు రాసిన విధాత తలపున పాట తో బహుళ ప్రాచుర్యం పొందారు 'సిరివెన్నెల' సీతారామశాస్త్రిగా ఆయన పేరు దర్శనమిచ్చింది.

కుటుంబం

[మార్చు]

సిరివెన్నెల సీతారామశాస్త్రి కు భార్య పద్మావతి, ఇద్దరు కుమారులు యెగేశ్వర్ శర్మ, రాజా చెంబోలు ఉన్నారు.[2]

సినిమా పాటల రచయితగా

[మార్చు]

విధాత తలఁపున ప్రభవించినది... అంటూ ఆయన రాసిన మొదటి పాటే తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ఆయనకు స్థానం సంపాదించి పెట్టంది. భావగర్భితమైన ఈ పాట రాయడానికి తనకు వారంరోజులు పట్టినట్లు సిరివెన్నెల ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ధన మాయను ఎంత చిన్న చిన్న పదాలలో పొదగగలరో దైవ మాయని కూడా అంతే సులువుగా విడమరచి చెప్పగల ప్రజ్ఞాశలి సిరివెన్నెల. సినీ వినీలాకాశంలో ఎన్ని తారలున్నా చల్లని జాబిలి వెలుగులు పంచుతూ తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఎప్పుడో ఏర్పరచుకున్న సిరివెన్నెల లలిత గీతాలు రాయడంలో కూడా ఉపద్రష్ఠులు. అసలు ఇది అని ప్రత్యేకంగా చెప్పకుండా తెలుగులో ప్రజనీకానీకి తెలిసిన/తెలియని సాహిత్య ప్రక్రియలన్నింటినీ పలకరించేసారు సిరివెన్నెల.

గోవాలోని పనాజీలో 2017లో ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, సిరివెన్నెల సీతారామ శాస్త్రికి సంస్కృతికి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డును అందజేశారు.

ఆయన కలం నుంచి జాలువారిన అనేక వేల పాటలలో మచ్చుకు కొన్ని గుర్తు చేసుకుంటే:

మరణం

[మార్చు]

సిరివెన్నెల సీతారామ శాస్త్రి అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2021 నవంబరు 30న మరణించాడు.[3]

సినిమాల జాబితా (గేయ రచయితగా)

[మార్చు]
-
సంవత్సరం చిత్రం దర్శకుడు సంగీత దర్శకుడు పాటలు
1986 సిరివెన్నెల కె. విశ్వనాథ్ కె.వి. మహదేవన్
1986 లేడీస్ టైలర్ వంశీ ఇళయరాజా
  • గోపీలోలా, ఎక్కడ ఎక్కడ
1987 గౌతమి క్రాంతి కుమార్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
1987 శ్రుతిలయలు కె. విశ్వనాథ్ కె.వి. మహదేవన్
1987 స్వయంకృషి కె. విశ్వనాథ్ రమేష్ నాయుడు
  • పారాహుషార్
1987 మహర్షి వంశీ ఇళయరాజా
  • సాహసం నా పథం
1988 రుద్రవీణ కె. బాలచందర్ ఇళయరాజా
  • నమ్మకు నమ్మకు ఈ రేయిని
  • లలిత ప్రియ కమలం
  • తరలిరాద తనే వసంతం
  • చుట్టుపక్కల చూడరా
  • నీతోనే ఆగేనా సంగీతం
  • రండి రండి రండి
1988 ఆడదే ఆధారం విసు
1988 ఇల్లు ఇల్లాలు పిల్లలు విసు
1988 కళ్ళు ఎస్పీబీ
  • తెల్లారింది లెగండో
1988 పెళ్ళి చేసి చూడు రేలంగి నరసింహారావు హంసలేఖ
1988 శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ వంశీ ఇళయరాజా
1988 స్వర్ణ కమలం కె. విశ్వనాథ్ ఇళయరాజా
  • అన్ని పాటలు
1989 జయమ్ము నిశ్చయమ్మురా జంధ్యాల రాజ్-కోటి
1989 స్వరకల్పన వంశీ అమర్
1989 సూత్రధారులు కె. విశ్వనాథ్ కె.వి.మహదేవన్
1990 అన్న-తమ్ముడు కృష్ణ రాజ్-కోటి
1990 అల్లుడుగారు కె. రాఘవేంద్రరావు కె.వి. మహదేవన్

(to be confirmed)

1990 శివ రామ్ గోపాల్ వర్మ ఇళయరాజా
  • బోటనీ పాఠముంది
1990 బొబ్బిలిరాజా బి. గోపాల్ ఇళయరాజా
  • అన్ని పాటలు
1990 చెవిలో పువ్వు ఇ.వి.వి.సత్యనారాయణ చక్రవర్తి
1991 ఆదిత్య 369 సింగీతం శ్రీనివాసరావు ఇళయరాజా
  • జాణవులే నెరజాణవులే
1991 కలికాలం ముత్యాల సుబ్బయ్య not known

(to be confirmed) source:cinegoer.com

1991 కూలీ నెం.1 కె. రాఘవేంద్రరావు ఇళయరాజా
  • కొత్త కొత్తగా ఉన్నది
1991 రౌడీ అల్లుడు కె. రాఘవేంద్రరావు బప్పిలహరి
  • చిలుకా క్షేమమా
1991 క్షణక్షణం ఎం. ఎం. కీరవాణి
  • జాము రాతిరి జాబిలమ్మ
  • కో అంటే కోటి
  • అమ్మాయి ముద్దు ఇవ్వందే
  • అందనంత ఎత్తా తారాతీరం
1991 అసెంబ్లీ రౌడీ బి. గోపాల్ కె.వి.మహదేవన్
1991 ఏప్రిల్ 1 విడుదల వంశీ ఇళయరాజా
  • మాటంటే మాటేనంటా
1992 ఆపద్బాంధవుడు కె. విశ్వనాథ్ ఎం. ఎం. కీరవాణి
  • అన్ని పాటలు
1992 పట్టుదల ఇళయరాజా
  • ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
1992 పరువు ప్రతిష్ఠ రాజ్-కోటి
  • ఒప్పుకోకురా ఓటమినెప్పుడూ
1992 స్వాతి కిరణం కె. విశ్వనాథ్ కె.వి.మహదేవన్
  • ప్రణతి ప్రణతి
  • శివాని భవాని
  • జాలిగా జాబిలమ్మ
1993 అల్లరి ప్రియుడు కె. రాఘవేంద్రరావు ఎం. ఎం. కీరవాణి
  • అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు
1993 మనీ శివనాగేశ్వరరావు శ్రీ
  • వారేవా ఏమి ఫేసు
1993 మేజర్ చంద్రకాంత్ కె. రాఘవేంద్రరావు ఎం. ఎం. కీరవాణి
1993 గాయం రామ్ గోపాల్ వర్మ శ్రీ
  • నిగ్గదీసి అడుగు
  • సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని
1993 రక్షణ ఉప్పలపాటి నారాయణరావు ఎం. ఎం. కీరవాణి
  • గుప్పు గుప్పు గుప్పుమన్నదంట
1993 నిప్పురవ్వ ఎ.కోదండరామిరెడ్డి బప్పిలహరి, రాజ్-కోటి, ఎ.ఆర్.రెహమాన్
1993 అంతం రామ్ గోపాల్ వర్మ ఆర్ డి బర్మన్, ఎం. ఎం. కీరవాణి , మణిశర్మ
  • ఓ మైనా
  • నీ నవ్వు చెప్పింది నాతో
1994 గోవిందా గోవిందా రామ్‌గోపాల్‌వర్మ రాజ్-కోటి
  • అమ్మ బ్రహ్మదేవుడో
1994 నంబర్ వన్ ఎస్.వి.కృష్ణారెడ్డి ఎస్.వి.కృష్ణారెడ్డి
1994 శుభలగ్నం ఎస్.వి.కృష్ణారెడ్డి ఎస్.వి.కృష్ణారెడ్డి
  • చిలక ఏ తోడు లేక
1994 భైరవద్వీపం సింగీతం శ్రీనివాసరావు మాధవపెద్ది సురేష్

(to be confirmed) source:ghantasala.info

  • ఘాటైన ప్రేమ ఘటన
1994 ముద్దులప్రియుడు కె.రాఘవేంద్రరావు ఎం. ఎం. కీరవాణి
1994 యమలీల ఎస్.వి.కృష్ణారెడ్డి ఎస్.వి.కృష్ణారెడ్డి
1994 ప్రియరాగాలు ఎం. ఎం. కీరవాణి
1994 మనీ మనీ శివనాగేశ్వరరావు శ్రీ
1995 క్రిమినల్ మహేష్ భట్ ఎం. ఎం. కీరవాణి
  • తెలుసా మనసా
1995 గులాబి కృష్ణవంశీ శశిప్రీతమ్
  • క్లాస్‌రూమ్‌లో తపస్సు చేయుట
1995 శుభసంకల్పం కె.విశ్వనాథ్ ఎం. ఎం. కీరవాణి
  • హైలెస్సో హైలెస్స
  • హరి పాదాన
1995 సిసింద్రీ రాజ్
1995 పెదరాయుడు రవిరాజా పినిశెట్టి కోటి
1995 సొగసు చూడతరమా గుణశేఖర్ రమణి భరద్వాజ్
1995 అనగనగా ఒకరోజు రామ్ గోపాల్ వర్మ శ్రీ
1996 లవ్‌బర్డ్స్ (డబ్బింగ్) పి వాసు ఏఆర్‌ రెహమాన్
  • మనసున మనసుగ
1996 మావిచిగురు ఎస్.వి.కృష్ణారెడ్డి ఎస్.వి.కృష్ణారెడ్డి
  • మావిచిగురు తిని
  • మాట ఇవ్వమ్మా చెల్లి
1996 పవిత్ర బంధం
  • అపురూపమైనదమ్మ ఆడజన్మ
1996 మైనా ఉప్పలపాటి నారాయణరావు ఎం. ఎం. కీరవాణి
1996 లిటిల్ సోల్జర్స్ గుణ్ణం గంగరాజు శ్రీ
  • సరేలే ఊరుకో
1996 వజ్రం ఎస్.వి.కృష్ణారెడ్డి ఎస్.వి.కృష్ణారెడ్డి
1996 నిన్నే పెళ్ళాడతా కృష్ణవంశీ సందీప్ చౌతా
  • ఎటో వెళ్ళిపోయింది
  • గ్రీకువీరుడు
  • కన్నులో నీ రూపమే
  • ఇంకా ఏదో
  • నాతోరా
1996 శ్రీకారం
1996 అక్కుమ్ బక్కుమ్
1996 సంప్రదాయం ఎస్.వి.కృష్ణారెడ్డి ఎస్.వి.కృష్ణారెడ్డి
1996 రాముడొచ్చాడు ఎ.కోదండరామిరెడ్డి కోటి
1996 శ్రీ కృష్ణార్జున విజయం సింగీతం శ్రీనివాసరావు మాధవపెద్ది సురేష్
1997 వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్ వంశీ కీరవాణి
  • ఎక్కడికి ఈ పరుగు
1997 పెళ్ళి కోడి రామకృష్ణ ఎస్.ఎ.రాజ్‌కుమార్
  • జాబిలమ్మ నీకు అంత కోపమా
1997 ఆరోప్రాణం వీరు కె. వీరు కె.
1997 పెళ్ళి చేసుకుందాం ముత్యాల సుబ్బయ్య కోటి
  • నువ్వేమి చేసావు నేరం
  • ఎన్నో ఎన్నో
1997 గోకులంలో సీత ముత్యాల సుబ్బయ్య కోటి
  • పొద్దే లేని లోకం నీది
  • గోకుల కృష్ణ
1997 తారకరాముడు కోటి
  • అన్ని పాటలు
1997 దేవుడు శిర్పి
1997 శుభముహూర్తం కీరవాణి
1997 వీడెవడండీ బాబూ ఇ.వి.వి శిర్పి
1997 ప్రేమించుకుందాం రా మహేష్
  • మేఘాలే తాకింది
  • అలా చూడు ప్రేమలోకం
1997 ఆహ్వానం ఎస్.వి.కృష్ణారెడ్డి ఎస్.వి.కృష్ణారెడ్డి
  • దేవతలారా రండి
  • మనసా మాటాడమ్మా
  • పందిరి వేసిన ఆకాశానికి
1997 చిన్నబ్బాయి కె. విశ్వనాథ్ ఇళయరాజా
  • తెలుసుకో తెలుసుకో
  • విన్నపాలు వినమని
  • నిన్న చూసిన ఉదయం
  • అడగకండి
  • అంతా రండోయ్
  • నవ్వులో పుట్టాను
1998 సింధూరం కృష్ణవంశీ శ్రీ
  • ఓ చెలీ
  • అర్థ శతాబ్దపు
  • ఊరికే ఉండదే
  • ఒలేలే ఒలేలే
1998 పవిత్ర ప్రేమ ముత్యాల సుబ్బయ్య కోటి
  • గుగుమ్మ గుగుమ్మ
  • చైత్రమా రా రా
  • చినుకులే ఒక్కటై
  • ఓ దైవమా
1998 ఆవిడా మా ఆవిడే ఇ.వి.వి శ్రీ
  • అన్ని పాటలు
1998 గణేష్ మణిశర్మ
  • సిరిసిరిమువ్వలు
1997 ప్రేమతో (డబ్బింగ్) మణిరత్నం ఎ.ఆర్.రెహమాన్
  • అన్ని పాటలు
1998 సూర్యవంశం ఎస్ ఎ రాజ్ కుమార్
  • చుక్కలన్ని
  • కిలకిల నవ్వే
1998 ఊయల ఎస్.వి.కృష్ణారెడ్డి ఎస్.వి.కృష్ణారెడ్డి
  • జరిగినదంతా నిజమని
1998 శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి వై.వి.ఎస్.చౌదరి ఎం. ఎం. కీరవాణి
  • అన్ని పాటలు
1998 ఆహా వందేమాతరం శ్రీనివాస్
  • అన్ని పాటలు
1998 అంతఃపురం కృష్ణవంశీ ఇళయరాజా
  • సూరీడు పువ్వా
  • అసలేం గుర్తుకురాదు
  • కళ్యాణం కానుంది
1999 రాజా ఎస్ ఎ రాజ్ కుమార్
  • ఏదో ఒక రాగం
1999 మా బాలాజీ కోడి రామకృష్ణ వందేమాతరం శ్రీనివాస్
1999 సీతారామరాజు వై.వి.ఎస్. చౌదరి కీరవాణి
  • అన్ని పాటలు
1999 శీను మణిశర్మ
  • అల్లో నేరేడు కళ్ళదానా
1999 మనసులో మాట ఎస్.వి.కృష్ణారెడ్డి ఎస్.వి.కృష్ణారెడ్డి
  • ఏ రాగముంది
1999 నా హృదయంలో నిదురించే చెలి శ్రీ
1999 ప్రేమకథ రామ్‌గోపాల్‌వర్మ సందీప్ చౌతా
  • కొక్కొరొకో
  • దేవుడు కరుణిస్తాడని
1999 ప్రేమంటే ఇదేరా రమణ గోగుల
  • మనసే ఎదురు తిరిగి
2000 ఆజాద్ తిరుపతిస్వామి మణిశర్మ
2000 చిరునవ్వుతో మణిశర్మ
  • సంతోషం సగం బలం
  • నిన్నలా మొన్నలా లేదురా
2000 నువ్వే కావాలి విజయ్ భాస్కర్ కోటి
  • ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే
  • అనగనగా ఆకాశం ఉంది
  • కళ్ళలోకి కళ్ళు పెట్టి
2000 ఒకేమాట కోటి (to be confirmed)
  • కోలో కోలో కొయిలాలో
2000 జయం మనదేరా వందేమాతరం శ్రీనివాస్
  • మెరిసేటి జాబిలి నువ్వే
2000 చూసొద్దాం రండి రాజా వన్నెంరెడ్డి ఎం. ఎం. కీరవాణి
  • చిన్ననాటి
2000 సర్దుకుపోదాం రండి ఎస్.వి.కృష్ణారెడ్డి ఎస్.వి.కృష్ణారెడ్డి
  • ఉన్నా
2000 శ్రీ శ్రీమతి సత్యభామ ఎస్.వి.కృష్ణారెడ్డి ఎస్.వి.కృష్ణారెడ్డి
  • రామ చిలుక
  • రామ చిలుక (2)
2000 నిన్నే ప్రేమిస్తా షిండే ఎస్.ఎ. రాజ్‌కుమార్
  • కోయిల పాట బాగుందా
  • కోయిల పాట బాగుందీ
2000 అంతా మన మంచికే వీరు కె.
2000 నువ్వు వస్తావని వి.ఆర్. ప్రతాప్ ఎస్.ఎ. రాజ్‌కుమార్
  • పాటల పల్లకి పై ఊరేగే చిరుగాలీ
2000 మురారి కృష్ణవంశీ మణిశర్మ
  • ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
  • చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసెయ్
  • భామా భామా బంగారూ
  • అలనాటి రామచంద్రుడికన్నింటా సాటి
2000 రాయలసీమ రామన్న చౌదరి సురేష్ కృష్ణ మణిశర్మ
  • చమక్ చమక్‌మను
1992 లాఠీ ఎం. ఎం. కీరవాణి
2001 ఆనందం శ్రీను వైట్ల దేవి శ్రీ ప్రసాద్
  • ఆనందం
  • కనులు తెరిచినా
  • ఎవరైనా ఎపుడైనా
  • ఎవరైనా ఎపుడైనా (2)
2001 మనసంతా నువ్వే వి ఎన్ ఆదిత్య ఆర్ పి పట్నాయక్
  • మనసంతా నువ్వే
2001 నువ్వు నాకు నచ్చావ్ కోటి
  • ఆకాశం దిగి వచ్చి
  • నా చూపే నిను
  • ఒక్కసారి చెప్పలేవా
  • ఓ నవ్వు చాలు
  • ఉన్నమాట చెప్పనీవు
2001 ప్రేమతో రా మణిశర్మ
  • ప్రేమయ్యిందో ఏమో
2001 అమ్మాయి కోసం ముప్పలనేని శివ వందేమాతరం శ్రీనివాస్
  • బిఏలు చదివినా
2001 వేచి ఉంటా ఆకాష్
2001 బావ నచ్చాడు కె.ఎస్. రవికుమార్ ఎం. ఎం. కీరవాణి
  • చందమామ చందమామ
2001 ఎదురులేని మనిషి ఎస్.ఎ. రాజ్‌కుమార్
  • ఏమైందమ్మా ఈనాడు
  • ఏనాడైనా అనుకున్నానా
2001 వాసు కరుణాకరన్ హారిస్ జయరాజ్
  • నమ్మవే అమ్మాయి
2002 ఒక్కడు గుణశేఖర్ మణిశర్మ
  • అన్ని పాటలు
2002 ఓ చినదాన విద్యాసాగర్
  • తన చిరునామా
2002 సంతోషం దశరథ్ ఆర్ పి పట్నాయక్
  • నే తొలిసారిగా కలగన్నదీ
  • నువ్వంటే నాకిష్టమని
2002 అల్లరి రవిబాబు పాల్ జె.
  • నర నరం ఉలిక్కిపడేట్టు
2002 మనసుంటే చాలు శివశంకర్
2002 లాహిరి లాహిరి లాహిరిలో వై.వి.ఎస్. చౌదరి ఎం. ఎం. కీరవాణి
  • అ ఆ ఇ ఈ
2003 డాడీ సురేష్ కృష్ణ ఎస్ ఎ రాజ్‌కుమార్
  • నా ప్రాణమా సుస్వాగతం
  • గుమ్మాడి గుమ్మాడీ
2003 వసంతం ఎస్ ఎ రాజ్‌కుమార్
  • గాలీ చిరుగాలీ
2003 ఎలా చెప్పను కోటి
  • అన్ని పాటలు
2003 మన్మథుడు విజయ భాస్కర్ దేవి శ్రీ ప్రసాద్
  • నేను నేనులా లేనే
  • నా మనసునే
  • డోంట్ మ్యారీ
  • గుండెల్లో ఏముందో
  • చెలియా చెలియా
2003 సింహాద్రి రాజమౌళి ఎం. ఎం. కీరవాణి
  • అమ్మయినా నాన్నయినా
2004 గుడుంబా శంకర్ మణిశర్మ
  • చిట్టి నడుమునే చూస్తున్నా
2004 వర్షం శోభన్ దేవి శ్రీ ప్రసాద్
  • అన్ని పాటలు
2004 శ్రీ ఆంజనేయం కృష్ణవంశీ మణిశర్మ
  • ఊరేగి రావయ్య
  • రామ రామ
  • పూల ఘుమ ఘుమ
  • అవ్వాయి తువ్వాయి
  • తికమక మకతిక
2004 ఆర్య సుకుమార్ దేవి శ్రీ ప్రసాద్
  • నువ్వుంటే
2005 నువ్వొస్తానంటే నేనొద్దంటానా ప్రభుదేవా దేవి శ్రీ ప్రసాద్
  • అన్ని పాటలు
2005 చక్రం కృష్ణవంశీ చక్రి
  • జగమంత కుటుంబం
  • ఒకే ఒక మాట
  • రంగేళి హోలీ
  • కొంచెం కారంగా
2005 సంక్రాంతి ఎస్ ఎ రాజ్‌కుమార్
  • ఆశ ఆశగా
2006 హ్యాపీ కరుణాకరన్ యువన్ శంకర్ రాజా
  • నీ కోసం
2006 శివ 2006 (డబ్బింగ్) రామ్ గోపాల్ వర్మ ఇళయరాజా
2007 బొమ్మరిల్లు భాస్కర్ దేవి శ్రీ ప్రసాద్
  • నమ్మక తప్పని నిజమైనా
2007 ఆట వి.ఎన్. ఆదిత్య దేవి శ్రీ ప్రసాద్
  • ఆట ఆట
  • నిన్ను చూస్తుంటే
  • హోయన
2007 చిరుత పూరీ జగన్నాథ్ మణిశర్మ
  • ఏక్‌బార్ ఏక్‌బార్
2007 క్లాస్‌మేట్స్ విజయ్ భాస్కర్ కోటి
  • గుండె చాటుగా
2007 ఒక్కడున్నాడు చంద్రశేఖర్ యేలేటి ఎం. ఎం. కీరవాణి
  • అడుగడుగునా పడిపోయినా
2007 ఆడవారి మాటలకు అర్థాలే వేరులే యువన్ శంకర్ రాజా
  • అల్లంత దూరాల ఆ తారక
2007 అతిథి మణిశర్మ
  • సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో
2008 విశాఖ ఎక్స్‌ప్రెస్ వర ముళ్ళపూడి విజయ్ కూరాకుల
2008 వాన ఎమ్.ఎస్. రాజు కమలాకర్
  • ఆకాశ గంగా
  • ఎదుట నిలిచింది
  • డోలారే
  • సిరిమల్లె వాన
2008 పరుగు భాస్కర్ మణిశర్మ
  • పరుగులు తీయకే పసిదానా
  • హృదయం ఓర్చుకోలేనిదీ
2008 హరే రామ్ మిక్కీ జె. మేయర్
  • అన్ని పాటలు
2008 గమ్యం ఇ.ఎస్. మూర్తి
  • ఎంతవరకు ఎందుకొరకు
  • సమయమా
2008 జల్సా త్రివిక్రమ్ దేవి శ్రీ ప్రసాద్
  • సరీగమా పదనీస్సా
  • My Heart is Beating అదోలా
  • ఛలోరే ఛలోరే ఛల్
  • You & I
2008 కంత్రి మణిశర్మ
  • అమ్మహో అనిపించేలా
2008 రెడీ శ్రీను వైట్ల దేవి శ్రీ ప్రసాద్
  • గెట్ రెడీ
  • నా పెదవులు నువ్వైతే
2008 అష్టా చమ్మా ఇంద్రగంటి కళ్యాణి మాలిక్
2008 కొత్త బంగారు లోకం మిక్కీ జె. మేయర్
  • ఒకే అనేశా
  • నేననీ నీవనీ
  • నీ ప్రశ్నలు నీవే
2009 శశిరేఖా పరిణయం కృష్ణవంశీ మణిశర్మ
  • ఏదో ఏదో
  • ఇలా ఎంతసేపు
  • నిన్నే నిన్నే
2009 మహాత్మ కృష్ణవంశీ విజయ్ ఆంటోని
  • ఏం జరుగుతోంది
  • ఇందిరమ్మ ఇంటి పేరు
  • తల ఎత్తి
  • దైలామో దైలామో
2009 కిక్ సురేందర్ రెడ్డి థమన్
  • అన్ని పాటలు
2014 అలా ఎలా? అనీష్ కృష్ణ భీమ్స్ సెసిరోలియో
2018 దేవదాస్ శ్రీరామ్ అదిత్య మణిశర్మ
  • వారు వీరు
  • ఏమో ఏమో
  • మనసేదో వెతుకుతూ ఉంది
2020 అల వైకుంఠపురములో త్రివిక్రమ్ థమన్
  • సామజవరగమన
2021 శ్యామ్‌ సింగరాయ్‌ రాహుల్‌ సాంకృత్యన్‌ మిక్కీ జె. మేయర్
  • రెండు పాట‌లు [4]

నటుడిగా

[మార్చు]

ప్రముఖ తెలుగు, హిందీ చలనచిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన గాయం తెలుగు సినిమాలో నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని... అని పాట పాడే ప్రభావశీలమయిన పాత్రలో తను వ్రాసి నటించగా,[1] తను వ్రాసిన పాటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది[1] పురస్కారం లభించటం విశేషం.



పురస్కారాలు

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :

దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు, ఉత్తమ గేయరచయితగా :

కళాసాగర్ పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :

  • 1986 - సిరివెన్నెల- విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం
  • 1992 - అంకురం - ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటోవైపు
  • 1994 - శుభలగ్నం - చిలకా ఏ తోడులేక ఎటేపమ్మా ఒంటరి నడక
  • 1995 - పెళ్ళి సందడి - హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమా ప్రేమా

మనస్విని పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :

కిన్నెర పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :

  • 1998 - మనసులో మాట - ఏరాగముంది మేలుకుని ఉండి లేవనంటుందా మనసుని పిలవగా

భరతముని పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :

  • 1992 - సిరివెన్నెల- విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం
  • 1996 - పవిత్రబంధం - అపురూపమైనదమ్మ ఆడజన్మ - ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ
  • 1999 - భారతరత్న - మేరా భారత్ కో సలాం! ప్యారా భారత్ కో ప్రణాం!

అఫ్జా పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :

  • 1999 - భారతరత్న - పారా హుషార్ భాయీ భద్రం సుమా సిపాయీ
  • 2000 - నువ్వు వస్తావని - పాటల పల్లకివై ఊరేగే చిరుగాలీ కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి

వంశీ బర్ఖిలీ పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :

  • 2000 - నువ్వే కావాలి సినిమా గేయ రచయితగా :
  • కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండెకోత పోల్చుకొందుకు
  • అనగనగా ఆకాశం వుంది - ఆకాశంలో మేఘం ఉంది
  • ఎక్కడ వున్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలీ ఇదేం అల్లరి

రసమయి పురస్కారం, ఉత్తమ గేయ రచయితగా :

  • 1988 - కళ్ళు - తెల్లారింది లెగండోయ్ కొక్క్కొరొక్కొ, మంచాలింక దింగండోయ్ కొక్క్కొరొక్కొ

బుల్లి తెర పురస్కారం, ఉత్తమ గేయ రచయితగా :

  • 1999 - తులసి దళం, టి.వి. సీరియల్ - హాయిగా వుంది, నిదురపో

సాక్షి ఎక్సలెన్స్ పురస్కారాలు

  • 2021 - లైఫ్‌ టైమ్‌ ఎఛివ్‌మెంట్‌ అవార్డు (మరణానంతరం)[9]

సైమా అవార్డులు: ఉత్తమ గీత రచయిత

  • 2015: "ఇటు ఇటు ఇటు" (కంచె)

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 హిందూ దిన పత్రిక వెబ్సైట్ నుండి Poet who loves to churn the mind Archived 2008-03-07 at the Wayback Machine సీతారామశాస్త్రి గురించి వ్యాసంజూన్ 11,2008న సేకరించబడినది.
  2. 10TV (30 November 2021). "సిరివెన్నెల కుమారులిద్దరూ సినీ పరిశ్రమలోనే.. | Sirivennela Family" (in telugu). Archived from the original on 30 November 2021. Retrieved 30 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. "Popular Telugu lyricist Sirivennela Sitaramasastri is No More, Died of Lung Cancer". Moviezupp. 2021-11-30. Retrieved 2021-11-30.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. 10TV (30 November 2021). "సిరివెన్నెల రాసిన చివరి రెండు పాటలు ఇవే.. | Sirivennela" (in telugu). Archived from the original on 30 November 2021. Retrieved 30 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  5. "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 25 June 2020.
  6. మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
  7. సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
  8. నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
  9. "Tollywood Heroes, Director Speech at Sakshi Excellence Awards 2021 - Sakshi". web.archive.org. 2022-11-03. Archived from the original on 2022-11-03. Retrieved 2022-11-03.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)