సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సిరివెన్నెల సీతారామశాస్త్రి (1955-2021)గా సుపరిచితుడైన చెంబోలు సీతారామశాస్త్రి ఒక తెలుగు సినిమా గేయరచయిత. ఇతడు 3000కు పైగా సినిమా పాటలను వ్రాశాడు. ఇతని సినిమా పాటలకు ఉత్తమ గేయ రచయితగా 11 నంది పురస్కారాలు, 4 ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు అనేక ఇతర అవార్డులు లభించాయి. 2019లో భారత ప్రభుత్వం ఇతడిని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది[1].

సినిమా పాటల జాబితా[మార్చు]

సీతారామశాస్త్రి 3000కు పైగా తెలుగు సినిమా పాటలు వ్రాశాడు. వాటి జాబితా సంవత్సరం వారీ ఈ క్రింది లంకెలలో చూడవచ్చు.

కాలక్రమంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటలు

1984 - 1986 - 1987 - 1988 - 1989 - 1990 - 1991 - 1992 - 1993 - 1994 - 1995 - 1996 - 1997 - 1998 - 1999 - 2000 - 2001 - 2002 - 2003 - 2004 - 2005 -
2006 - 2007 - 2008 - 2009 - 2010 - 2011 -2012 - 2013 - 2014 - 2015 - 2016 - 2017 - 2018 - 2019 - 2020 - 2021 - 2022


సిరివెన్నెల సీతారామశాస్త్రి

ఇతడు వ్రాసిన సినిమా పాటలలో ఇతనికి ఉత్తమ గేయ రచయితగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత నంది పురస్కారం తెచ్చిపెట్టిన పాటల వివరాలు ఈ క్రింది పట్టికలో.

సంవత్సరం సినిమా పాట సంగీత దర్శకుడు గాయకులు
1986 సిరివెన్నెల "విధాత తలపున ప్రభవించినది అనాది జీవనవేదం" [2] కె.వి.మహదేవన్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
1987 శ్రుతిలయలు "తెలవారదేమో స్వామీ తెలవారదేమో స్వామీ నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలుమంగకూ" కె.వి.మహదేవన్ కె. జె. ఏసుదాసు/పి.సుశీల
1988 స్వర్ణకమలం "అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా అమృతగానమిది పెదవులదా అమితానందపు ఎదసడిదా" [3] ఇళయరాజా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరామ్
1993 గాయం "సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ సుఖాన మనలేని వికాసమెందుకనీ" [4] శ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
1994 శుభలగ్నం "చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మా ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక" [5] ఎస్.వి.కృష్ణారెడ్డి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
1996 శ్రీకారం "మనసు కాస్త కలత పడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు కనుల నీరు తుడుచువారు ఎవరు లేరని చితి ఒడికి చేరకు" [6] ఇళయరాజా కె. జె. ఏసుదాసు
1997 సింధూరం "అర్ధశతాబ్దపు అఙ్ఞానాన్నే స్వతంత్రమందామా ? స్వర్ణోత్సవాలు చేద్దామా?" [7] శ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
1999 ప్రేమకథ "దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు" [8] సందీప్ చౌతా అనురాధ శ్రీరామ్, రాజేష్
2005 చక్రం "జగమంత కుటుంబం నాది… ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాదే.. సన్యాసం శూన్యం నావే" [9] చక్రి శ్రీ
2008 గమ్యం "ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు" [10] అనిల్, ఇ.ఎస్.మూర్తి రంజిత్
2013 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు "మరీ అంతగా మహా చింతగా మొహం ముడుచుకోకలా పనేం తోచక పారేశానుగా గడబిడ పడకు అలా" [11] మిక్కీ జె. మేయర్ శ్రీరామచంద్ర

మూలాలు[మార్చు]

 1. సనా షకీల్ (26 January 2019). "Here is the complete list of Padma awardees 2019". The New Indian Express. Retrieved 19 December 2021.
 2. కొల్లూరి భాస్కరరావు. "సిరివెన్నెల - 1986". ఘంటసాల గళామృతము. Retrieved 1 January 2022.
 3. నాగార్జున. "స్వర్ణకమలం". సిరివెన్నెల భావలహరి. Retrieved 1 January 2022.
 4. నాగార్జున. "గాయం". సిరివెన్నెల భావలహరి. Retrieved 1 January 2022.
 5. నాగార్జున. "శుభలగ్నం". సిరివెన్నెల భావలహరి. Retrieved 1 January 2022.
 6. వెబ్ మాస్టర్. "మనసు కాస్త కలత పడితే". 10to5. Retrieved 1 January 2022.
 7. నాగార్జున. "సింధూరం". సిరివెన్నెల భావలహరి. Retrieved 1 January 2022.
 8. వెబ్ మాస్టర్. "Prema Katha". లిరిక్స్ టేప్. Retrieved 1 January 2022.
 9. నాగార్జున. "చక్రం". సిరివెన్నెల భావలహరి. Retrieved 1 January 2022.
 10. నాగార్జున. "గమ్యం". సిరివెన్నెల భావలహరి. Retrieved 1 January 2022.
 11. వెబ్ మాస్టర్. "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు". లిరిక్స్ టేప్. Retrieved 1 January 2022.

బయటి వనరులు[మార్చు]

సిరివెన్నెల భావలహరి