సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ (పాట)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
"సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ"
సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ పాటలోని దృశ్యం
రచయితసిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతంశ్రీ
సాహిత్యంసిరివెన్నెల సీతారామశాస్త్రి
ప్రచురణగాయం (1993)
రచింపబడిన ప్రాంతంఆంధ్రప్రదేశ్
భాషతెలుగు
గాయకుడు/గాయనిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
చిత్రంలో ప్రదర్శించినవారురేవతి

సురాజ్యమవలేని పాట 1993లో విడుదలైన గాయం చిత్రంలోని పాట. ఈ పాట రాసినందుకు సిరివెన్నెల సీతారామశాస్త్రి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. శ్రీ సంగీతం అందించిన ఈ పాటను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పాడాడు.[1][2][3]

పాటలోని సాహిత్యం[మార్చు]

పల్లవి:

సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ
సుఖాన మనలేని వికాసమెందుకనీ
నిజాన్ని బలికోరే సమాజమెందుకనీ
అడుగుతోంది అదిగో ఎగిరే భరత పతాకం

చరణం 1:
ఆవేశంలో ప్రతి నిమిషం ఉరికే నిప్పుల జలపాతం
కత్తి కొనల ఈ వర్తమానమున బ్రతకదు శాంతి కపోతం
బంగరు భవితకు పునాది కాగల యువత ప్రతాపాలు
భస్మాసుర హస్తాలై ప్రగతికి సమాధి కడుతుంటే
శిరసు వంచెనదిగో ఎగిరే భరత పతాకం
చెరుగుతోంది ఆ తల్లి చరితను విశ్వవిజయాల విభవం || సురాజ్యమవలేని ||

పురస్కారాలు[మార్చు]

  1. సిరివెన్నెల సీతారామశాస్త్రి- ఉత్తమ గీత రచయితగా నంది పురస్కారాలు -1993

మూలాలు[మార్చు]

  1. "Gaayam Songs Download". Naa Songs. 2014-05-02. Retrieved 2020-12-22.
  2. SenSongs (2018-11-15). "Gaayam Songs Download |Jagapathi Babu's Gaayam Mp3 Songs". NaaSongs.Com.Co. Retrieved 2020-12-22.
  3. "Gaayam Mp3 Songs Free Download 1993 Telugu Movie". SenSongsMp3.Co.In. 2015-07-07. Archived from the original on 2021-03-05. Retrieved 2020-12-22.

వీడియో లింకులు[మార్చు]

  1. యూట్యూబ్ లో పాట వీడియో