ఆవిడే శ్యామల
ఆవిడే శ్యామల | |
---|---|
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
రచన | శ్రీనివాసన్ (మూలకథ), శ్రీనివాస చక్రవర్తి (కథా విస్తరణ), డి. నారాయణ వర్మ (మాటలు), కోడి రామకృష్ణ (చిత్రానువాదం) |
నిర్మాత | ఆర్. సీతారామరాజు |
తారాగణం | ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ |
ఛాయాగ్రహణం | శంకర్ కంతేటి |
సంగీతం | మాధవపెద్ది సురేష్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1999 |
భాష | తెలుగు |
ఆవిడే శ్యామల 1999 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రల్లో నటించారు.[1] ఇది చింతవిష్టయాయా శ్యామల అనే మలయాళ సినిమాకు పునర్నిర్మాణం. మాధవపెద్ది సురేష్ చంద్ర ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ఆర్. సీతారామరాజు పవనపుత్ర ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు. కుటుంబం గురించి పట్టించుకోకుండా బలాదూర్ తిరుగుతున్న భర్తను భరిస్తూ శ్యామల అనే భార్య పడ్డ కష్టాలే ఈ సినిమా కథ.
కథ
[మార్చు]ప్రకాష్ రావు ఉపాధ్యాయుడిగా పనిచేస్తుంటాడు. అందరు ఉపాధ్యాయుల్లాగా కాకుండా పిల్లలకు డబ్బు గురించి చెబుతుంటాడు. అతను స్వతహాగా రకరకాలుగా వ్యాపారం చేసి డబ్బు బాగా సంపాదించాలనే కోరిక ఉన్నవాడు. తండ్రి అతనికి తెలియకుండానే పెళ్ళి ఏర్పాట్లు చేసేస్తాడు. శ్యామల అనే మహిళతో బలవంతంగా పెళ్ళి చేసేస్తాడు. ఒక కూతురు కూడా పుడుతుంది. ప్రకాష్ రావును గురించి అందరూ విమర్శిస్తున్నా శ్యామల మాత్రం అతన్ని వెనకేసుకొస్తుంటుంది. శ్యామల ఇంట్లో అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎలాగోలా సంసారం నెట్టుకొస్తుంటుంది. కానీ ప్రకాష్ రావు ప్రవర్తన మాత్రం మారదు. ఆ ఊరినుంచి నగరానికి వెళ్ళి రకరకాల వ్యాపారాలు ప్రయత్నిస్తుంటాడు. కానీ ఏవీ తన స్థాయికి తగ్గ వ్యాపారాలు కావు.
తారాగణం
[మార్చు]- శ్యామలగా రమ్యకృష్ణ
- ప్రకాష్ రావుగా ప్రకాష్ రాజ్
- తనికెళ్ళ భరణి
- ఎం. ఎస్. నారాయణ
- ఆలీ
- గుండు హనుమంతరావు
- ప్రకాష్ రావు తండ్రిగా సుత్తివేలు
- మల్లిఖార్జునరావు
- ఎస్. కె. బషీర్
- అల్ఫాన్సా
- డబ్బింగ్ జానకి
- బేబి కీర్తన
- గాదిరాజు సుబ్బారావు
- ప్రహ్లాదరాజు
- దాము
- రామ్మూర్తి
- రజిత
చిత్రీకరణ
[మార్చు]ఈ సినిమా నానక్ రాం గూడ లోని రామానాయుడు స్టూడియోస్ లో చిత్రీకరించబడింది.
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి మాధవపెద్ది సురేష్ సంగీత దర్శకత్వం వహించగా సిరివెన్నెల సీతారామశాస్త్రి, వెన్నెలకంటి, జొన్నవిత్తుల, సాహితి, డి. నారాయణవర్మ పాటలు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, జేసుదాసు, నాగూర్ బాబు, చిత్ర, నిత్యసంతోషిణి, రాధిక, బేబి దీపిక పాటలు పాడారు. పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విదుదలయ్యాయి.
1.ఓంకార రూపాన శబరిమల శిఖరాన, రచన: డి.నారాయణ వర్మ, గానం.కె జె ఏసుదాస్ బృందం
2 అదోలా ఉన్నారేమండి అప్పుడే వెళతారెంటండి , రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం.చిత్ర
3.అబ్బోకొత్త ఆవకాయ ముక్కల్లె ఉంది పిల్ల, రచన: సాహితి, గానం.నాగూర్ బాబు, రాధిక బృందం
4.ఓ గమ్యమున్న చరణం అది సవ్యమైన చరణం, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం కోరస్
5 . డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డిస్నీ , రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, నిత్యసంతోషిణి, బేబీ దీపిక.
మూలాలు
[మార్చు]- ↑ "ఆవిడే శ్యామల సినిమా సమీక్ష". teluguone.com. Archived from the original on 25 ఫిబ్రవరి 2020. Retrieved 19 October 2017.
2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.