Jump to content

షిర్డీ (2007 సినిమా)

వికీపీడియా నుండి
షిర్డీ
(2007 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం విపిన్
నిర్మాణం జి.సురేష్, జి.లలిత
తారాగణం కృష్ణ,
రాధిక
సంగీతం లలిత్ సురేష్
నిర్మాణ సంస్థ శ్రీ షిర్డీసాయి క్రియేషన్స్
విడుదల తేదీ 7 సెప్టెంబర్ 2007
భాష తెలుగు

షిర్డీ విపిన్ దర్శకత్వంలో శ్రీ షిర్డీసాయి క్రియేషన్స్ బ్యానర్‌పై జి.సురేష్, జి.లలితలు నిర్మించిన భక్తిరస ప్రధానమైన తెలుగు సినిమా. ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, రాధిక, సురభి లీలా పాపారావు తదితరులు నటించారు. 2007, సెప్టెంబర్ 7వ తేదీన ఈ సినిమా విడుదల అయ్యింది.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విపిన్
  • మాటలు: విపిన్, ఆదిత్య
  • సంగీతం: లలిత్ సురేష్, శ్రీనివాస్
  • ఛాయాగ్రహణం: వి.శ్రీనివాసరెడ్డి
  • కూర్పు: వి.నాగిరెడ్డి

కృష్ణ, కిరణ్ ఇద్దరూ అన్నదమ్ములు. తల్లి కిరణ్ చిన్నతనంలోనే మరణించడంతో కృష్ణ, అతని భార్య రాధిక కిరణ్‌ని తమ స్వంత బిడ్డలా పెంచుకుంటారు. కృష్ణ సాయిబాబా భక్తుడు. కిరణ్ హేతువాది. దేవుళ్ళను నమ్మడు. కాని కిరణ్ భార్య శాంత (మానస) సాయిబాబా భక్తురాలు. వాళ్ళ అన్నయ్య, ఆఫీసులో మేనేజింగ్ డైరెక్టర్ (మల్లికారునరావు) ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కిరణ్‌కి బాబాపై నమ్మకం కలగలేదు. ఒకసారి బాబా విగ్రహం కిరణ్ చేతులలో ధ్వంసమౌతుంది. కృష్ణ ఇది అపశకునంగా భావిస్తాడు. వారి ఇంట్లో ఏదో అనర్థం జరుగుతుందని శంకిస్తాడు. అతడు అనుకున్నట్లే ఆ యింట్లో అనర్థం జరుగుతుంది. శాంత మెట్లపై నుండి జారిపడి ఆసుపత్రి పాలౌతుంది. అక్కడ డాక్టర్లు ఆమెకు బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు దానిని నయం చేయలేమని చెబుతారు. కానీ కృష్ణ చేసిన పూజల వల్ల శాంతకు వ్యాధి నయం అవుతుంది. ఈ అద్భుతాన్ని చూసిన కిరణ్ బాబా అందరి కంటే శక్తిమంతుడు అని నమ్ముతాడు. బాబా గురించి తెలుపమని కిరణ్ కృష్ణను అడిగినప్పుడు అతడు షిరిడీ సాయి సచ్చరిత్ర అనే పుస్తకాన్ని ఇచ్చి చదవంటాడు. అక్కడి నుండి దర్శకుడు సాయిబాబా జీవితచరిత్రను తెరపై చూపెడతాడు.[2]

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటలను లలిత్ సురేష్ బాణీలు సమకూర్చాడు.[3]

క్ర.సం. పాట గాయనీ గాయకులు రచన
1 బాబా సాయిబాబా సురేష్ ధవళ సత్యం
2 కొమ్మ మీద కోయిలమ్మ సింధు బాలభాస్కర్
3 లోకమనే పూలతోటలో సింధు మురళి
4 మనసే ఓ ఆలయమై మనో మురళి
5 నీ కనులే దీపాలై పార్థసారథి, సింధు బాలభాస్కర్
6 సాయినాథా మనో మురళి
7 సుందరమైనది గాయత్రి, లలిత్ సురేష్, కృష్ణప్రసాద్ బాలభాస్కర్

విశేషాలు

[మార్చు]
  • షిర్డీ సాయిబాబాగా 3000కు పైగా నాటక ప్రదర్శనలు ఇచ్చిన సురభి లీలాపాపారావు ఈ సినిమాలో షిర్డీ సాయిబాబాగా నటించాడు.
  • కృష్ణ, సుమన్, సత్యనారాయణ వంటి ప్రముఖ నటీనటులు నటించినా ఈ సినిమా విజయవంతం కాలేదు.

మూలం

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Shirdi". indiancine.ma. Retrieved 26 November 2021.
  2. వెబ్ మాస్టర్. "Shidi Review". ఫిల్మీబీట్. Retrieved 26 November 2021.
  3. వెబ్ మాస్టర్. "SHIRDI (2007) SONGS". MovieGQ. Retrieved 27 November 2021.

బయటి లింకులు

[మార్చు]