ఇద్దరు మిత్రులు (1986 సినిమా)
స్వరూపం
ఇద్దరు మిత్రులు (1986 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.ఎల్.వి.ప్రసాద్ |
---|---|
తారాగణం | సుమన్, సుమలత, మాగంటి మురళీమోహన్ |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | జి.వెంకటరావు |
భాష | తెలుగు |
ఇద్దరు మిత్రులు 1986లో విడుదలైన తెలుగు చలన చిత్రం. జి.వి.ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై గాలి వెంకటరావు, అట్లూరి సీతారామారావు నిర్మించిన ఈ సినిమాకు బి.ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించాడు. సుమన్, సుమలత, మురళీ మోహన్ తారాగణంగా రూపొందిన ఈ సినిమాఉ చెళ్లపిళ్ల సత్యం సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- సుమన్
- మురళీ మోహన్
- సుమలత
- గొల్లపూడి మారుతీరావు
- జీవా
- రాళ్లపల్లి
- శ్రీలక్ష్మి
- అల్లు రామలింగయ్య
- చంద్రిక
- జయవాణి
- బేబీ అను
- అనూరాధ
- చిట్టిబాబు
- పొట్టి ప్రసాద్
- భీమరావు
- మిఠాయి చిట్టి
- టెలిఫోన్ సత్యనారాయణ
- భీమేశ్వరరావు
- సతీష్
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ, చిత్రానువాదం: బి.ఎల్.వి.ప్రసాద్
- సంభాషణలు: సత్యమూర్తి
- పాటలు: సి.నారాయణరెడ్డి, గోపి
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- సంగీతం: చెళపిళ్ళ సత్యం
- ఛాయాగ్రహణం: పి.సాయి ప్రసాద్
- కూర్పు: మురళీ - రామయ్య
- కళ: కృష్ణ
- పోరాటాలు: రాజు
- నృత్యాలు: తరుణ్
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బండారు భాస్కరరాజా
- నిర్మాత: గాలి వెంకటరావు, అట్లూరి సీతారమారావు
- దర్శకుడు: బి.ఎల్.వి.ప్రసాద్
- బ్యానర్: జి.వి.ఆర్.ప్రొడక్షన్స్
పాటల జాబితా
[మార్చు]1.హాయ్ బుల్లెమ్మ సరుకెత్తింది, రచన: మైలవరపు గోపి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
2.చిలకమ్మ తలపైన అలకమ్మ చేరింది, రచన: గోపి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
3.చిలకమ్మ తలపైన ఆలకమ్మ చేరింది, రచన: గోపి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
4.దీని దుంపతెగ పాడువయసు, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.పి సుశీల
మూలాలు
[మార్చు]- ↑ "Iddaru Mithrulu (1986)". Indiancine.ma. Retrieved 2020-08-17.
. 2.ఘంటసాల గళామృతము ,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.