రాజాచంద్ర (దర్శకుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాజాచంద్ర (01-05-1950. 30-101987)

జన్మ నామం:చెక్కా వేంకటేశ్వరరావు

ఇతర పేర్లు:రాజా చంద్ర

జన్మస్థలం:-ఇంకొల్లు, ప్రకాశం జిల్లా

పుట్టిన తేదీ:-01,మే1950

మరణం:30,అక్టోబర్1987

మొదటి భార్య:అంజనీ కుమారి

పిల్లలు:ఇద్దరు కుమార్తెలు,ఒక కుమారుడు

రెండవ భార్య:కృష్ణవేణి(నటి).

వృత్తి: దర్శకుడు

పనిచేసిన కాలం:1978నుండి 1987వరకు

కుటుంబ కథా చిత్రాలు రూపొందించడంలో ప్రతిభ ఉన్న సినిమా దర్శకులలో ఒకరైన రాజాచంద్ర ప్రకాశం జిల్లా ఇంకొల్లు లో 01మే1950లో జన్మించారు. ఇతని అసలు పేరు చెక్కా వేంకటేశ్వరరావు.వేంకటేశ్వరరావు పి.యు.సి ని విజయవాడ లయోలా కళాశాలలోను చదివారు. తరువాత చీరాల లో బి.ఏ వరకు చదివారు. కాలేజీలో చదువుకునే రోజులు నుంచి నాటకాలంటే ఆసక్తి ఉండేది.కొంతమంది మిత్రులతో కలిసి నాటకాల ట్రూప్ తయారు చేసి నాటకాలు ప్రదర్శించాలనే కోరిక ఉన్నప్పటికీ అభ్యుదయ భావాలు గల వేంకటేశ్వరరావు డిగ్రీ పూర్తి కాగానే అతని దృష్టి సినీరంగం వైపు మళ్లింది.1972లో మద్రాసు చేరుకుని ఒక మిత్రుని సహాయంతో నిర్మాత ఎమ్.ఎస్. రెడ్డిని కలుసుకొని దర్శకత్వ శాఖలో చేరాలనే తన కోరికను వ్యక్తపరిచారు. అదే సమయంలో శోభన్ బాబు హీరోగా నటిస్తున్న కోడెనాగు చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఎమ్.ఎస్‌.రెడ్డి గారు ఆ చిత్ర దర్శకుడు కె. ఎస్.ప్రకాశరావు వద్ద అప్పటికే సహాయ దర్శకులుగా కె.రాఘవేంద్రరావు,ఎమ్. ఎస్.కోటా రెడ్డి పని చేస్తున్నారు. వారి వద్ద సహాయకుడిగా అతని కెరీర్ ప్రారంభమైంది. ఆ తరువాత దాసరి నారాయణరావు గారి వద్ద సహాయకుడిగా తిరుపతి, బలిపీఠం, యవ్వనం కాటేసింది,పాడవోయి భారతీయుడా చిత్రాలకు పనిచేశారు వేంకటేశ్వరరావు ఇవన్నీ విభిన్నమైన చిత్రాలు కావడంతో అతనికి అనేక విషయాలు నేర్చుకునే అవకాశం కలిగింది.దాసరి ప్రతీ విషయం వివరంగా చెప్పేవారు అందుకే అతనిని ఒక గురువుగా కాకుండా ఒక దైవంలా భావించేవారు వేంకటేశ్వరరావు. ఇదెక్కడి న్యాయం చిత్ర నిర్మాణం జరుగుతున్న సమయంలోనే దర్శకుడుగా తొలి అవకాశం లభించింది.బొమ్మరిల్లు చిత్రంతో దర్శకుడుగా పరిచయం చేయడమే కాకుండా అతని పేరును *రాజా చంద్ర*గా మార్చారు దర్శక,నిర్మాత విజయబాపినీడు గారు. కలర్ చిత్రాలు రాజ్యమేలుతున్న తరుణంలో 1978లో విడుదలైన బొమ్మరిల్లు చిత్రం ఘన విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది.కోడె నాగు తరువాత బలిపీఠం చిత్రానికి రాజా చంద్ర పనిచేయడంతో శోభన్ బాబు గారితో సాన్నిహిత్యం ఏర్పడడంతో వీరిద్దరి కాంబినేషన్ లో ఐదు చిత్రాలు వచ్చాయి. బంధం, మహాలక్ష్మి, ముగ్గురు మిత్రులు, మిష్టర్ భరత్,జీవన పోరాటం ఇవన్నీ విజయం సాధించాయి.రాజా చంద్ర ను ప్రోత్సహించిన ప్రముఖ హీరోలలో మురళీమోహన్ ముందుంటారు.మురళీ మోహన్ సహజంగా నిర్మాత కూడా కావడంతో రాజాచంద్ర దర్శకత్వంలో మావూరి మహాశివుడు, రామాయణంలో పిడకల వేట,పిచ్చిపంతులు,దేవి శ్రీదేవి, వారాలబ్బాయి,కర్పూర దీపం, ఇదే నా సమాధానం, శ్రీమతి గారు, ఇల్లాలు వర్థిల్లు మొదలైన చిత్రాలు వచ్చాయి.అలాగే చిరంజీవి నటించిన మొండి ఘటం చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు రాజా చంద్ర.సుమన్ నటించిన కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు రాజాచంద్ర. కొన్ని కన్నడ చిత్రాలకు కూడా దర్శకుడిగా పనిచేశారు రాజాచంద్ర.

రాజా చంద్ర వ్యక్తిగత విషయానికొస్తే 1972లో అంజనీ కుమారితో వివాహంజరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు పుట్టారు.'పండంటి కాపురానికి12సూత్రాలు'కన్నడ వెర్షన్ షూటింగ్ జరుగుతున్న సమయంలో రాజా చంద్ర కి కృష్ణవేణి తో పరిచయం ఏర్పడింది.ఆ పరిచయం ప్రేమగా మారి 1983లో గుంటూరు లోని ఒక రామాలయంలో వీరి వివాహం జరిగింది. భర్త రెండో వివాహం చాలా కాలం వరకు అంజనీ కుమారి గారికి తెలీదు. తెలిసిన తరువాత పిల్లలును,తనను బాగా చూసుకుంటూ ఉండడంతో ఆమె రాజీ పడ్డారు.29అక్టోబర్1987 రాత్రి 11గంటల సమయంలో బయటకు వెళ్లిన రాజాచంద్ర ను గుర్తుతెలియని వ్యక్తులు చంపేసి మద్రాసులో రోడ్డు పక్కన పడేసి పోయారు. అతని మరణం ఇప్పటికీ ఒక మిస్టరీ గానే మిగిలిపోయింది.

రాజాచంద్ర దర్శకత్వం వహించిన దేవీ శ్రీదేవి తెలుగు చలనచిత్రం 1983లో విడుదలయింది

సినిమాలజాబితా[1]

[మార్చు]

తెలుగు

[మార్చు]
  1. బొమ్మరిల్లు (1978)
  2. నా ఇల్లు నా వాళ్ళు (1979)
  3. బొట్టు కాటుక (1979)
  4. మా ఊళ్ళో మహాశివుడు (1979)
  5. విజయ (1979)
  6. మహాలక్ష్మి (1980)
  7. రామాయణంలో పిడకలవేట (1980)
  8. వారాలబ్బాయి (1981)
  9. అత్తగారి పెత్తనం (1981)
  10. మొండిఘటం (1982)
  11. దేవీ శ్రీదేవి (1983)
  12. పండంటి కాపురానికి 12 సూత్రాలు (1983)
  13. పిచ్చిపంతులు (1983)
  14. ఈ చరిత్ర ఇంకా ఎన్నాళ్లు (1984)
  15. కాయ్ రాజా కాయ్ (1984)
  16. కుటుంబ గౌరవం (1984)
  17. కుర్రచేష్టలు (1984)
  18. నిర్దోషి (1984)
  19. ఇదే నా సమాధానం (1985)
  20. ఇల్లాలు వర్ధిల్లు (1985)
  21. ఓ తండ్రి తీర్పు (1985)
  22. కర్పూర దీపం (1985)
  23. ముగ్గురు మిత్రులు (1985)
  24. శ్రీమతిగారు (1985)
  25. జీవన పోరాటం (1986)
  26. బంధం (1986)
  27. మిస్టర్ భరత్ (1986)
  28. విజృంభణ (1986)

కన్నడ

[మార్చు]
  1. [[::kn:ಮನೆ ಮನೆ ಕಥೆ|మనె మనె కథె]] (1981)
  2. నావు యారిగేను కడిమె (1983)
  3. ఎందిన రామాయణ (1984)
  4. [[::kn:ಕಲಿಯುಗ (ಚಲನಚಿತ್ರ)|కలియుగ]] (1984)
  5. [[::kn:ಸುಖ ಸಂಸಾರಕ್ಕೆ ೧೨ ಸೂತ್ರಗಳು|సుఖసంసారక్కె ೧೨ సూత్రగళు]] (1984)
  6. [[::kn:ರಾಮಾಪುರದ ರಾವಣ|రామాపురద రావణ]] (1985)
  7. [[::kn:ಸ್ನೇಹ ಸಂಬಂಧ|స్నేహ సంబంధ]] (1985)
  8. [[::kn:ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಮಹೇಶ್ವರ|బ్రహ్మవిష్ణుమహేశ్వర]] (1988)

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "List of Telugu movies online directed by Raja Chandra". Archived from the original on 2016-03-04. Retrieved 2015-12-27.