Coordinates: 8°59′N 76°36′E / 8.983°N 76.600°E / 8.983; 76.600

అష్టముడి సరస్సు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అష్టముడి సరస్సు
Aerial view of the Ashtamudi lake
అష్టముడి సరస్సు వైమానిక దృశ్యం
Location of Ashtamudi Lake
Location of Ashtamudi Lake
అష్టముడి సరస్సు
ప్రదేశంకొల్లం జిల్లా, కేరళ
అక్షాంశ,రేఖాంశాలు8°59′N 76°36′E / 8.983°N 76.600°E / 8.983; 76.600
స్థానిక పేరుഅഷ്ടമുടി കായൽ  (Malayalam)
సరస్సులోకి ప్రవాహంకళ్ళద నది
పరీవాహక విస్తీర్ణం1,700 km2 (660 sq mi)
ప్రవహించే దేశాలుభారతదేశం
ఉపరితల వైశాల్యం61.4 km2 (23.7 sq mi)
గరిష్ట లోతు6.4 m (21 ft)
76,000,000,000 km3 (1.8×1010 cu mi)
ఉపరితల ఎత్తు10 m (33 ft)

అష్టముడి సరస్సు భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో గల కొల్లం జిల్లాలో ఉంది. ఇది ఒక ప్రత్యేకమైన చిత్తడి నేలతో కూడిన పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఈ సరస్సు ఆక్టోపస్ ఆకారాన్ని కలిగి, వెంబనాడ్ ఈస్ట్యూరీ పర్యావరణ వ్యవస్థలో ఉంటుంది.[1][2][3]

పేరు - అర్థం[మార్చు]

స్థానిక మలయాళ భాషలో అష్టముడి అంటే 'ఎనిమిది జడలు' (అష్ట: 'ఎనిమిది'; ముడి: 'జడ') అని అర్థం. ఈ పేరు అనేక శాఖలతో సరస్సు స్థలాకృతిని సూచిస్తుంది. ఈ సరస్సును కేరళలోని బ్యాక్‌వాటర్స్‌కి గేట్‌వే అని కూడా పిలుస్తారు. ఇది హౌస్‌బోట్, బ్యాక్‌వాటర్ రిసార్ట్‌లకు అత్యంత ప్రసిద్ధి చెందింది. అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలల జాబితాలో అష్టముడి చిత్తడి నేల ఒకటి. చిత్తడి నేలల పరిరక్షణ, సుస్థిరమైన వినియోగం కోసం రామ్‌సర్ కన్వెన్షన్ ద్వారా ఇది పరిరక్షించబడుతుంది.

ఉపయోగాలు[మార్చు]

ఈ సరస్సు తీర ప్రాంతంలో కొబ్బరి తోటలు, తాటి చెట్లతో పాటు కొన్ని పట్టణాలు, గ్రామాలు ఉన్నాయి. ఈ ప్రాంతం నుండి అనేక ఇతర పట్టణాలు, గ్రామాలకు రవాణా సౌకర్యాన్ని అందించడం కోసం కొల్లం బోట్ క్లబ్ ద్వారా బోట్ క్రూయిజ్‌లు నిర్వహించబడుతున్నాయి. విలాసవంతమైన హౌస్ బోట్లు కూడా సరస్సులో పనిచేస్తాయి.[4]

జీవనాధారం[మార్చు]

ఈ సరస్సు సమీపంలో నివసించే చాలా మంది ప్రజల జీవనాధారం కాయిర్ ఉత్పత్తి కోసం చేపలు పట్టడం.[5][6]

ప్రత్యేకత[మార్చు]

2014 లో అష్టముడి సరస్సు భారతదేశంలో మొట్టమొదటి మెరైన్ స్టీవార్డ్‌షిప్ కౌన్సిల్ సర్టిఫైడ్ ఫిషరీగా నిలిచింది.[7]

కళాకారులు[మార్చు]

సరస్సు తీరంలోని ప్రాంతం చాలా మంది కళాకారులు, రచయితలకు స్ఫూర్తినిచ్చింది. దాని ఒడ్డున పుట్టి పెరిగిన ప్రఖ్యాత కవి తిరునల్లూరు కరుణాకరన్.

మూలాలు[మార్చు]

  1. "Kerala's Ashtamudi lake gets recognition for sustainable clam fishing". The Hindu (in Indian English). 2014-11-07. ISSN 0971-751X. Retrieved 2016-01-28.
  2. "Ashtamudi Lake - Overview". Archived from the original on 2007-12-17. Retrieved 2007-11-20. Ashtamudi Lake
  3. "Ramsar cities in Kerala" (PDF). Archived from the original (PDF) on 2011-07-21. Retrieved 2011-02-07.
  4. "The List of Wetlands of International Importance" (PDF). The Secretariat of the Convention on Wetlands (Ramsar, Iran, 1971) Rue Mauverney 28, CH-1196 Gland, Switzerland. Archived (PDF) from the original on 2008-01-02. Retrieved 2008-01-07.
  5. http://www.indiainfoweb.com/kerala/lakes/ashtamudi-lake.html Archived 29 డిసెంబరు 2012 at the Wayback Machine Ashtamudi Lake
  6. http://www.kazhakuttom.com/kollam.htm Archived 11 జూన్ 2012 at the Wayback Machine Kollam at a Glance
  7. "Kerala's Ashtamudi lake gets recognition for sustainable clam fishing". The Hindu (in Indian English). 2014-11-07. ISSN 0971-751X. Retrieved 2016-01-28.