ఎ. ఎ. రహీం (రాజకీయ నాయకుడు)
అబూబకర్ అబ్దుల్ రహీమ్ | |
---|---|
మేఘాలయ గవర్నర్[1] | |
In office 27 జులై 1989 – 8 మే 1990 | |
అంతకు ముందు వారు | Harideo Joshi |
తరువాత వారు | Madhukar Dighe |
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కేంద్ర మంత్రి[2] | |
In office 2 September 1982 – 31 October 1984 | |
ప్రధాన మంత్రి | Indira Gandhi |
తరువాత వారు | Ram Niwas Mirdha |
In office 4 November 1984 – 31 December 1984 | |
న్యాయ మంత్రిత్వశాఖలో కేంద్ర సహాయమంత్రి, న్యాయ, కంపెనీ వ్యవహారాలు[2] | |
In office 15 January 1982 – 2 September 1982 | |
ప్రధాన మంత్రి | Indira Gandhi |
ఆరోగ్యం, వ్యవసాయం, పరిశ్రమల మంత్రి, ట్రావెన్‌కోర్-కొచ్చిన్ రాష్ట్రం[3] | |
In office 1955–1956 | |
Chief Minister | Panampilly Govinda Menon |
Member of Parliament, Lok Sabha[4] | |
In office 1980–1984 | |
అంతకు ముందు వారు | Vayalar Ravi |
తరువాత వారు | Thalekkunnil Basheer |
నియోజకవర్గం | Chirayinkil |
Member of Kerala Legislative Assembly[5] | |
In office 1970–1980 | |
అంతకు ముందు వారు | P. K. Sukumaran |
తరువాత వారు | V. V. Joseph |
నియోజకవర్గం | Kundara |
In office 1957–1964 | |
అంతకు ముందు వారు | Inaugural holder |
తరువాత వారు | T. K. Divakaran |
నియోజకవర్గం | Quilon |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1920 ఫిబ్రవరి 7 |
మరణం | 1995 ఆగస్టు 31 | (వయసు 75)
రాజకీయ పార్టీ | Indian National Congress |
జీవిత భాగస్వామి | Smt. Fathima |
సంతానం | 3 sons, 3daughter |
అబూబకర్ అబ్దుల్ రహీమ్ ( 1920 ఫిబ్రవరి 7 – 1995 ఆగస్టు 31) భారతీయ రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, కేంద్ర మంత్రి. కొల్లంలో అబూబెకర్ కు జన్మించాడు. కేరళ ప్రభుత్వం నడుపుతున్న కొల్లం జిల్లా ఆసుపత్రికి అతని జ్ఞాపకార్థం అతని పేరు పెట్టారు.
ప్రారంభ జీవితం
[మార్చు]అబూబకర్ 1920 ఫిబ్రవరిలో ట్రావెన్‌కూర్ రాష్ట్రంలోని చెరాయిన్‌కిల్ గ్రామంలో జన్మించాడు, కొల్లాంలోని ప్రభుత్వ ఆంగ్ల పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత, అబూ బకర్ కేరళ రాష్ట్రంలోని చంగనసిరి పట్టణంలోని సెయింట్ పెర్చ్‌మాన్ ఉన్నత పాఠశాలలో చదివారు, ఆపై త్రివేండ్రం లోని ముహమ్మద్ విశ్వవిద్యాలయం నుండి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందారు. అబూ బకర్ తన యవ్వనం నుండి సామాజిక, రాజకీయ కార్యకర్తగా పనిచేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]భారత జాతీయ కాంగ్రెస్ విద్యార్థి ఉద్యమంలో చేరడం ద్వారా అబూ బకర్ రాజకీయ జీవితం ప్రారంభమైంది, ఆపై కొల్లం స్థానిక కాంగ్రెస్ కమిటీ చైర్మన్ అయ్యారు . కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ సభ్యుంగాను, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యునిగానూ పనిచేసాడు. 1957, 1960, 1965, 1970, 1977 సంవత్సరాలలో, కేరళ శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1965 లో, అతను లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యాడు,1980లో చిరయింకిల్ నియోజకవర్గం నుండి లోక్ సభకు ఎన్నికయ్యాడు. 1982-84 వరకు మూడవ ఇందిరా గాంధీ మంత్రిత్వ శాఖలో విదేశీ వ్యవహారాలు, న్యాయం, చట్టం, కంపెనీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు. 1989–90లో మేఘాలయ గవర్నర్ గా కూడా పనిచేశాడు .
మూలాలు
[మార్చు]- ↑ "List of Governors of Meghalaya". Mapsofindia.
- ↑ 2.0 2.1 "Council of Ministers | National Portal of India". www.india.gov.in.
- ↑ "General Info - Kerala Legislature". www.niyamasabha.org.
- ↑ "1980 India General (7th Lok Sabha) Elections Results". www.elections.in. Archived from the original on 2021-04-22. Retrieved 2021-09-01.
- ↑ "Members - Kerala Legislature". www.niyamasabha.org.