Jump to content

కిష్త్‌వార్

అక్షాంశ రేఖాంశాలు: 33°19′N 75°46′E / 33.32°N 75.77°E / 33.32; 75.77
వికీపీడియా నుండి
కిష్త్‌వార్
వార్వాన్ లోయ
వార్వాన్ లోయ
కిష్త్‌వార్ is located in Jammu and Kashmir
కిష్త్‌వార్
కిష్త్‌వార్
జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో కిష్త్‌వార్ స్థానం
కిష్త్‌వార్ is located in India
కిష్త్‌వార్
కిష్త్‌వార్
కిష్త్‌వార్ (India)
Coordinates: 33°19′N 75°46′E / 33.32°N 75.77°E / 33.32; 75.77
దేశం భారతదేశం
రాష్ట్రంజమ్మూ కాశ్మీరు
జిల్లాకిష్త్‌వార్
Government
 • Typeమునిసిపల్ కౌన్సిల్
Elevation
1,638 మీ (5,374 అ.)
జనాభా
 (2011)
 • Total14,865
భాషలు
 • అధికార భాషఉర్దూ
Time zoneUTC+5:30
పిన్
182204
Vehicle registrationJK17

కిష్త్‌వార్ అనేది భారత కేంద్రపాలిత భూభాగమైన జమ్మూ కాశ్మీర్‌లోని జమ్మూ ప్రాంతంలోని కిష్త్వార్ జిల్లాలోని పురపాలకసంఘం.[1] కిష్త్‌వార్ జిల్లా వక్రంగా ఉంది.ఇది 2007 ఏప్రియల్ 1న స్వతంత్ర పరిపాలనా విభాగంగా పనిచేయడం ప్రారంభించింది.కిష్త్‌వార్ జిల్లా ప్రధాన కార్యాలయానికి కిష్త్‌వార్ పట్టణం కేంద్రస్థానం. ఇది శీతాకాలపు రాజధాని జమ్మూ నుండి 235 కి.మీ. దూరంలో ఉంది. దీని ఎత్తు సముద్ర మట్టానికి 3000 నుండి15000 అడుగుల ఎత్తులో ఉంది. సాధారణంగా కిష్త్‌వార్ ప్రాంతాన్ని ' 'నీలమణి, కుంకుమ పువ్వు భూమి ' అని పిలుస్తారు.ఇది అడవులు వన్యప్రాణులుతో విస్తరించిన ప్రాంతం. కిష్త్‌వార్ పరిసర ప్రాంతాల చుట్టూ అనంతనాగ్, దోడా జిల్లాలు ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులను కూడా తాకుతాయి.

చరిత్ర

[మార్చు]

రాజతరంగిని గ్రంథం ప్రకారం కిష్త్వార్‌ను మొదట పురాతన పేరు కాష్టవత అని పిలుస్తారు.[2] కాశ్మీర్ రాజా కల్సా పాలనా (1063-1089). కాష్టవతకు "ఉత్తరాజ" పాలకుడుగా  ఉన్నప్పుడు, కాశ్మీర్ రాజు ఆస్థానాన్ని దర్శించినప్పుడు ఇతర కొండరాజ్యాల ముఖ్యులతో కలిసి అనేకసార్లు రాజాకు నివాళులర్పించాడు.ప్రజలు చెప్పినట్లుగా, మహాభారతం పురాణంలో ఈ ప్రదేశం గురించి ప్రస్తావించబడింది

మహారాజా రంజిత్ సింగ్ దీనిని సా.శ 1821 లో స్వాధీనం చేసుకున్నప్పుడు కిష్త్వార్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో విలీనం అయ్యింది. కాలక్రమేణా కిష్త్‌వార్ ఉధంపూర్ జిల్లాకు చెందిన తహసీల్ అయ్యింది.1948 వరకు అలాగే ఉంది.ఇది భారత స్వాతంత్య్రానంతర కాలంలో రాష్ట్రం మొదటి పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో కొత్తగా సృష్టించబడిన దోడా జిల్లాలో ఒక భాగమైంది.

జనాభా

[మార్చు]

2010 భారత జనాభా లెక్కల ప్రకారం కిష్త్‌వార్ మొత్తం జనాభా 14,865.అందులో పురుషులు 63%, స్త్రీలు 37% మంది ఉన్నారు.కిష్త్‌వార్ సగటు అక్షరాస్యత రేటు 78%, ఇది భారత జాతీయ సగటు కంటే ఎక్కువ.పురుషుల అక్షరాస్యత 82%, స్త్రీల అక్షరాస్యత 42%.కిష్త్‌వార్‌లో జనాభాలో ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు 11% మంది ఉన్నారు.ముస్లింలు ఇక్కడ మాట్లాడే ప్రధాన భాష కాశ్మీరీ.స్థానిక హిందువులు కాశ్మీరీ భాష స్థానిక మాండలికాన్ని కాస్త్వారీ భాష మాట్లాడుతారు.[3] కిష్త్‌వార్‌లో ఆధిపత్య మతం ఇస్లాం, 69.21% మంది ముస్లిం జనాభా హిందూ మతాన్ని అనుసరిస్తారు. రెండవ అతిపెద్ద మతంగా 29.59%గా హిందువులు ఉన్నారు.

రవాణా

[మార్చు]

వాయు మార్గం

[మార్చు]

కిష్త్‌వార్‌కు ప్రస్తుతం సొంత విమానాశ్రయం లేదు.అయినప్పటికీ, కిష్త్‌వార్‌ నగరానికి ఉత్తరాన కేవలం 3 కి.మీ. దూరంలో ఒక హెలిప్యాడ్ ఉంది. ప్రభుత్వం దీనిని పూర్తి స్థాయి ఎయిర్‌స్ట్రిప్‌గా ఉన్నతస్థాయికి పెంచింది.[4][5] కిష్త్వార్‌కు జమ్మూ విమానాశ్రయం 219 కి.మీ.దూరంలో, శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం 211 కి.మీ. దూరంలో సమీప విమానాశ్రయాలుగా ఉన్నాయి

రైలు మార్గం

[మార్చు]

కిష్త్‌వార్‌కు రైలు సదుపాయంలేదు.కిష్త్‌వార్ సమీప రైల్వేస్ఠేషను 174 కి.మీ. దూరంలో ఉన్న బనిహాల్ రైల్వే స్టేషను. సమీప ప్రధాన రైల్వే స్టేషన్ 221 కి.మీ. దూరంలో ఉన్న జమ్ము తావి రైల్వే స్టేషన్ .

రహదారి మార్గం

[మార్చు]

జమ్మూ కాశ్మీర్, భారతదేశంలోని ఇతర ప్రదేశాలకు రహదారుల ద్వారా కిష్త్‌వార్‌కు బాగా అనుసంధానించబడి ఉంది. అనేక రహదారులు, మార్గాలు జాతీయ రహదారి 244 కిష్త్‌వార్‌ గుండా వెళుతున్నాయి.

ప్రస్తావనలు

[మార్చు]
  1. "District Kishtwar".
  2. Development Institute, MSME. "Brief Industrial Profile of Kishatwar District" (PDF). Archived from the original (PDF) on 2020-11-17. Retrieved 2020-11-15.
  3. Kashmiri, Ethnologue, retrieved 14 July 2018.
  4. "Construction works of airstrip at Kishtwar to begin soon". The Dispatch (Jammu and Kashmir). 30 May 2020. Archived from the original on 24 సెప్టెంబరు 2020. Retrieved 2 June 2020.
  5. "Kishtwar in J&K to get full-fledged Airport". Press Information Bureau (Govt. of India). Retrieved 16 January 2018.

వెలుపలి లంకెలు

[మార్చు]