Coordinates: 33°46′01″N 74°05′45″E / 33.7670°N 74.0957°E / 33.7670; 74.0957

పూంచ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పూంచ్
పూంచ్ is located in Jammu and Kashmir
పూంచ్
పూంచ్
జమ్మూ కాశ్మీర్‌లో పూంచ్ స్థానం
పూంచ్ is located in India
పూంచ్
పూంచ్
పూంచ్ (India)
Coordinates: 33°46′01″N 74°05′45″E / 33.7670°N 74.0957°E / 33.7670; 74.0957
దేశంభారతదేశం
రాష్ట్రంజమ్మూ కాశ్మీరు
జిల్లాపూంచ్
Government
Elevation
915 మీ (3,002 అ.)
జనాభా
 (2011)
 • Total40,987
జనాభా
 • భాషలుఉర్దూ, పహరీ, గోజ్రీ, పంజాబీ
Time zoneUTC+5:30

పూంచ్ (పంచ్ అనికూడా పిలుస్తారు) భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్‌లో పూంచ్ జిల్లా రాజధాని.ఇది నియంత్రణ రేఖకు సమీపంలో ఉంది.పాకిస్తాన్ ఆజాద్ కాశ్మీర్‌ దీని వాస్తవ సరిహద్దు.

చరిత్ర

[మార్చు]

7వ శతాబ్దపు చైనా యాత్రికుడు జువాన్జాంగ్,[2] తెలిపిన ఆధారాలు, మహాభారతం సమయంనాటి పురాణ సాక్ష్యాల ప్రకారం,[3] పూంచ్, రాజౌరి, అభిసారాలు, కాంఙోజులు రిపబ్లికన్ల ఆధీనంలో ఉన్నాయి.[4][5][6][7][8]

పూంచ్ అనేక చారిత్రక యుగాలను చూసింది.సా.శ 326 లో అలెగ్జాండర్ దిగువ జీలం ప్రాంతంపై పోరాడటానికి పోరస్తోపై దాడి చేసినప్పుడు, ఈ ప్రాంతాన్ని ద్రవాభిసర్ అని పిలిచారు.సా.శ 6 వ శతాబ్దంలో, చైనా యాత్రికుడు హుయెన్ త్సాంగ్ ఈప్రాంతం గుండా వెళ్ళాడు.అతని పరిశీలన ప్రకారం, ఈ ప్రాంతాన్ని కాశ్మీర్‌లో భాగంగా చిన్న కాశ్మీర్ పిలుస్తారు.సా.శ. 850లో గుర్రపు వ్యాపారి రాజా నార్ చేత పూంచ్ పాలించబడిన ప్రాథమిక సార్వభౌమ రాజ్యంగా మారింది.రాజతరంగణి గ్రంథం ఆధారాల ప్రకారం పూంచ్ ప్రాంతంలోని రాజా త్రిలోచనపాల సా.శ.1020లో మహ్మూద్ గజనీతో ఈ ప్రాంతంలో కఠినమైన పోరాటం చేసాడు

ఈ ప్రాంతాన్నిసా.శ.1798 వరకు సిరాజ్-ఉద్-దిన్, అతని వారసులు రాజా షాబాజ్ ఖాన్ రాథోడ్, రాజా అబ్దుల్ రజాక్ రాథోడ్, రాజా రుస్తం రాథోడ్, రాజాబహదూర్ రాథోడ్ పరిపాలించారు.సా.శ.1819 నుండి సా.శ.1850 వరకు పూంచ్ సిక్కు సామ్రాజ్యంలో ఒక భాగంగా ఉంది. సా.శ.1850లో ధియాన్ సింగ్ కుమారుడు రాజా మోతీసింగ్ పూంచ్‌లో డోగ్రా పాలనను ప్రారంభించాడు.సిక్కు చక్రవర్తి రంజిత్ సింగ్ ప్రధానిగా పనిచేసిన ధియాన్ సింగ్, 'పూంచ్' ను బహుమతికింద జాగీర్ గా ఇచ్చాడు.పూంచ్ 1850 నుండి1940 వరకు జమ్మూ కాశ్మీర్ మహారాజా ఆధ్వర్యంలో సొంత జాగీర్దార్ కలిగి ఉన్న జాగీర్ గా మిగిలిపోయింది.గ్లాన్సీ సంఘం సిఫారసుల మేరకు 75 మంది సభ్యుల ప్రజాసభ పేరుతో శాసనసభ ఉనికిలోకి వచ్చింది.పూంచ్ ఆధిపత్యానికి రెండు స్థానాలు కేటాయించారు.

భౌగోళికం

[మార్చు]

పూంచ్ పట్టణం 33°46′N 74°06′E / 33.77°N 74.1°E / 33.77; 74.1 అంక్షాంశ, రేఖాంశాల వద్ద ఇది పూంచ్ నది ఒడ్డున ఉంది.[9] పూంచ్ నది పిర్ పంజాల్ పర్వతశ్రేణిలో ఉద్భవించి, పశ్చిమ, నైరుతి దిశలుగా ప్రవహించి ఆజాద్ కాశ్మీర్‌లోని మంగ్లా జలాశయంలోకి ప్రవహిస్తుంది.పూంచ్ సముద్రమట్టానికి 981 మీ. (3218 అ) ఎత్తులో ఉంది.పిర్ పంజాల్ శ్రేణి పర్వతాలు పూంచ్ లోయను, కాశ్మీర్ లోయ నుండి వేరు చేస్తాయి.2010లో మొఘల్ రహదారి పూర్తవడంతో, పిర్ పంజాల్ కనుమ ద్వారా, ఇప్పుడు రెండు ప్రాంతాల మధ్య ప్రత్యక్ష రహదారి సంబంధం ఉంది.

వాతావరణం

[మార్చు]

పూంచ్ తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం (కొప్పెన్ సిఫా) ను కలిగి ఉంటుంది.ఇది మిగతా భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ఉన్నదానికంటే చాలా చల్లగా ఉంటుంది.ఎందుకంటే ఇది ఈశాన్య స్థానంలో ఎత్తైనప్రదేశంగా ఉండుటవలన శీతాకాలం మధ్యస్తంగా, చల్లని వాతావరణంలో ఉంటుంది. జనవరిలో పగటిపూట సగటు ఉష్ణోగ్రత 2.5 °C (36.5 °F), రాత్రి గడ్డకట్టే ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉంటుంది.వేసవికాలం సాధారణంగా తక్కువుగాఉండి, ఆహ్లాదకరంగా ఉంటుంది.వేసవి ఉష్ణోగ్రత సాధారణంగా 31 °C.కి మించి పెరగదు.పాశ్చాత్య అవాంతరాల కారణంగా వర్షపాతం ఉంటుంది.జనవరి, ఫిబ్రవరి నెలల్లో హిమపాతం చాలా సాధారణంగా ఉంటుంది.

జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం పూంచ్ పట్టణ జనాభా మొత్తం 40,987, అందులో పురుషులు 55% మంది ఉన్నారు.స్త్రీలు 45%. మంది ఉన్నారు.[10] పూంచ్ పట్టణ సరాసరి అక్షరాస్యత 79%కాగా. పురుషులు అక్షరాస్యత 84%, స్త్రీలఅక్షరాస్యత 77%గా ఉంది.పూంచ్ పట్టణ మొత్తం జనాభాలో 6 సంవత్సరంల వయస్సులోపు పిల్లల13% మంది ఉన్నారు.సుమారు 44 % మంది హిందువులు, ఉండగా, ఇస్లాం మతస్థులు పూంచ్ పట్టణ మొత్తం జనాభాలో 1/3 వంతు మంది ఉన్నారు.[11]

పూంచ్ పట్టణంలో అతిపెద్ద మతం హిందూమతం.వీరు 44% మంది ప్రజలు ఉన్నారు.ఇస్లాం మతస్థులు 33.49% మంది వారి అనుచరులతో కలిపి రెండవ అతిపెద్ద మతంగా ఉంది. క్రైస్తవ మతం, సిక్కు మతాలకు చెందిన ప్రజలు వరుసగా 1.28% 20.79%గా ఉన్నారు [12]

2011 జాభా లెక్కల ప్రకారం పూంచ్ పట్టణంలో మతాల వివరాలు

  హిందువులు (44.19%)
  ఇస్లాం (33.49%)
  సిక్కు (20.79%)
  క్రిష్టియన్ (1.28%)
  బౌద్ధులు (0.03%)
  జైనులు (0.01%)
  ఇతరులు (0.00%)
  Not Stated (0.22%)

రవాణా

[మార్చు]

రోడ్డు మార్గం

[మార్చు]

పూంచ్-రావాలాకోట్ బస్సు నియంత్రణ రేఖకు అడ్డంగా ఉన్న సరిహద్దు మీదుగా సంబంధాలను తిరిగి నెలకొల్పడానికి సహాయపడింది.జాతీయ రహదారి 144A జమ్మూ నుండి మొదలై పూంచ్ వద్ద ముగుస్తుంది.తద్వారా పూంచ్‌ను జమ్మూ డివిజన్‌లోని మిగిలిన ప్రాంతాలకు కలుపుతుంది. పిర్ పంజాల్ పర్వతశ్రేణి ద్వారా మొఘల్ రోడ్ పూంచ్ ను కాశ్మీర్ లోయతో కలుపుతుంది.

రైలు మార్గం

[మార్చు]

పూంచ్‌కు ఇంకా రైలుద్వారా ప్రయాణం చేసే సౌకర్యం లేదు.జమ్మూ-పూంచ్ రైల్వే లైన్ జమ్మూ తావి స్టేషన్ నుండి హిస్టారిక్ సిటీ అఖ్నూర్ మీదుగా పూంచ్ వరకు రైల్వే లైన్ ప్రతిపాదనలో ఉంది.[13] పూంచ్‌కు సమీప ప్రధాన రైల్వే స్టేషన్ జమ్మూ తావి రైల్వే స్టేషన్, ఇది 236 కి.మీ. దూరంలో ఉంది.దీనిని చేరుకోవటానికి 6 గంటలు సమయం పట్టింది.సమీప రైల్వే స్టేషన్లు బిజ్బెహారా రైల్వే స్టేషన్, అనంతనాగ్ రైల్వే స్టేషన్, పూంచ్ టౌన్ నుండి రెండూ సమారు 152 కి.మీ. దూరంలో ఉన్నాయి.

వాయు మార్గం

[మార్చు]

పూంచ్ విమానాశ్రయం 1947 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో నిర్మించిన ఒక చిన్న ఎయిర్‌స్ట్రిప్ మాత్రమే.ప్రస్తుతం ఇది ఉపయోగించని విమానాశ్రయం.శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం దీనికి సమీప విమానాశ్రయం.ఇది 177 కి.మీ. దూరంలో ఉంది.దీనిని చేరుకోవటానికి గం.5.50ని సమయం పట్టింది.

ఇవి కూడ చూడు

[మార్చు]
 • 1947 పూంచ్ తిరుగుబాటు
 • కల్లాయ్, పూంచ్ జిల్లా

మూలాలు

[మార్చు]
 1. "members". Archived from the original on 2019-10-21. Retrieved 2021-01-17.
 2. Watters, Yuan Chawang, Vol I, p 284.
 3. MBH 7.4.5; 7/91/39-40.
 4. See: Political History of Ancient India, 1996, p 133, 219/220, Dr H. C. Raychaudhury, Dr B. N. Mukerjee.
 5. A History of India, p 269-71, N. R. Ray, N. K. Sinha.
 6. Journal of Indian History, P 304, University of Allahabad. Department of Modern Indian History, University of Kerala - 1921; Military History of India, 1980, p 38, Hemendra Chandra Kar - History.
 7. Bimbisāra to Aśoka: with an appendix on the later Saud, 1977, p 16, Sudhakar Chattopadhyaya - India - 1977.
 8. Purana Index, 1992, p 79, A. B. L. Awasthi.
 9. Falling Rain Genomics, Inc - Poonch
 10. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
 11. http://www.census2011.co.in/data/religion/district/623-punch.html
 12. "Poonch Town Population". Census India. Retrieved 22 September 2020.
 13. "Centre nod to Jammu-Poonch rail line after several years". Daily Excelsior. Retrieved 17 November 2020.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పూంచ్&oldid=3948537" నుండి వెలికితీశారు