Jump to content

గందర్బల్

అక్షాంశ రేఖాంశాలు: 34°14′N 74°47′E / 34.23°N 74.78°E / 34.23; 74.78
వికీపీడియా నుండి
గందర్బల్
గందర్బల్ is located in Jammu and Kashmir
గందర్బల్
గందర్బల్
జమ్మూ కాశ్మీరు పటంలో గందర్బల్ స్థానం
గందర్బల్ is located in India
గందర్బల్
గందర్బల్
గందర్బల్ (India)
Coordinates: 34°14′N 74°47′E / 34.23°N 74.78°E / 34.23; 74.78
దేశం భారతదేశం
రాష్ట్రంజమ్మూ కాశ్మీరు
జిల్లాగందర్బల్
Elevation
పట్టణం
1,619 మీ (5,312 అ.)
జనాభా
 (2011)
 • Total28,233
భాషలు
 • అధికారఉర్డూ
Time zoneUTC+5:30
Vehicle registrationJK16

గందర్బల్, భారత కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీరులోని గందర్బ​బల్ జిల్లాకు పరిపాలనా కేంద్ర పట్టణం, పురపాలక సంఘం. సముద్రమట్టానికి దీని సగటు ఎత్తు 1,619 మీటర్లు (5,312 అడుగులు)ఉంది.దీనికి సరిహద్దులో దక్షిణాన శ్రీనగర్, ఉత్తరాన బండిపోర్, ఈశాన్యంలో కార్గిల్, ఆగ్నేయంలో అనంతనాగ్, నైరుతిలో బారాముల్లా ఉన్నాయి.

భౌగోళికం

[మార్చు]

గందర్బల్ 34°14′N 74°47′E / 34.23°N 74.78°E / 34.23; 74.78 వద్దఉంది.[1] దీని సగటు ఎత్తుసముద్ర మట్టానికి 1,619 మీటర్లు (5,312 అడుగులు) పైన ఉంది. దీనికి సరిహద్దులో దక్షిణాన శ్రీనగర్ జిల్లా, ఉత్తరాన బండిపోర్, ఈశాన్యంలో కార్గిల్, ఆగ్నేయంలో అనంతనాగ్ ఉన్నాయి.

విద్యుత్ ప్రాజెక్టు

[మార్చు]

జీలం నదికి ప్రధాన ఉపనదిగాఉన్న సింధ్ నది ఈ జిల్లా గుండా ప్రవహిస్తుంది. నది నీటిని ప్రధానంగా నీటిపారుదల కొరకు, జలవిద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు.జీలం నదిపై గందర్​బల్ దిగువ సింధ్ జలవిద్యుత్ ప్రాజెక్ట్, ఎగువ సింధ్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ -1 కంగన్, ఎగువ సింధ్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ - 2 సుంబల్ అనే మూడు విద్యుత్ ఉత్పత్తి చేసే జలవిద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. అంతేకాకుండా, నది నీటిని శ్రీనగర్ నగరానికి రంగిల్ నీటి శుద్ధి కేంద్రం ద్వారా తాగడానికి సరఫరాకు ఉపయోగిస్తారు. [2]

పర్యాటక

[మార్చు]

కాశ్మీర్ లోయ పర్యాటక రంగాన్ని పెంచడానికి ప్రతి సంవత్సరం పర్యాటక కేంద్రమైన సోనమార్గ్ వద్ద ప్రతి సంవత్సరం నదిలో పడవ పందాలు నిర్వహిస్తారు. లోయను సందర్శించే విదేశీ పర్యాటకుల సందర్శనలలో మనస్బాల్ సరస్సుతో పాటు, హరముఖ్ పర్వతం పాదాల వద్ద ఉన్న గంగాబల్ సరస్సు ఒకటి. [3] వైష్ణోసర్ సరస్సు, గాడ్సర్ సరస్సు సోనమార్గానికి ఉత్తరాన ఉన్నాయి.

అభివృద్ధి

[మార్చు]

గతంలో గందర్బల్ ముఖ్యమంత్రి [4] నియోజకవర్గంగా ఉన్నప్పటికీ, [5] ఇతర జిల్లాలతో పోలిస్తే ఇది అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉంది. 2014లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో 461 ఓట్ల తేడాతో ఖాజీ అఫ్జల్‌ను ఓడించిన షేక్ ఇష్ఫాక్ జబ్బర్ గందర్‌బల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. జిల్లా అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ చూపలేదు.కాశ్మీర్ లోయలోని ఏకైక కేంద్రీయ విశ్వవిద్యాలయం [6] గందర్‌బల్‌జిల్లాలో నిర్మిస్తున్నారు.వన్ ఫ్యాకల్టీ, షేర్-ఇ-కాశ్మీర్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ఆఫ్ కాశ్మీర్ బెన్హామాలో నిర్మాణంలో ఉంది. అంతేకాకుండా విద్యను పెంచే లక్ష్యం సాధించటానికి ప్రస్తుతం జిల్లా ఆర్థిక వ్యవస్థ చాలా వెనుకబడి ఉంది.గందర్​బల్ పట్టణంలో ఒక స్టేడియం ఉంది.దీనిలో పగటి-రాత్రి ఆటలు ఆడిన చరిత్రను కలిగి ఉంది. రాష్ట్రంలో ఉన్న ఏకైక భౌతిక విద్య కళాశాల జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 3.5 కి.మీ. దూరంలోని గడూరా గందర్‌బాల్ వద్ద ఉంది.

జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[7]గందర్​బల్ జనాభా మొత్తం 2,97,446.[8] అందులో 53.36% మంది పురుషులు జనాభా ఉండగా, స్త్రీలు జనాభా 46.64% మంది ఉన్నారు.గందర్బల్ పట్టణ సరాసరి అక్షరాస్యత 58.04%.ఇది జాతీయ అక్షరాస్యత 74.04కు తక్కకువగా ఉంది. పురుషులు అక్షరాస్యత 68.85%, స్త్రీలు అక్షరాస్యత 45.71%. ఆరు సంవత్సరంలలోపు పిల్లలు గందర్​బల్ మొత్తం జనాభాలో 17.01% మంది ఉన్నారు.[9]

ప్రభుత్వం

[మార్చు]

గందర్బల్ పట్టణ స్థానిక సంస్థలో 17 మంది ఎన్నుకోబడిన మున్సిపల్ కౌన్సిల్ ఉన్నారు. దీని చివరి ఎన్నికలు 2018 అక్టోబరు 16న జరిగాయి.[10]వారిలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఇద్దరు, భారత జాతీయ కాంగ్రెసుకు చెందిన వారు ఇద్దరు,ఇతరులు 13 మంది ఉన్నారు.

ఇది కూడ చూడు

[మార్చు]
  • వకురా

మూలాలు

[మార్చు]
  1. Falling Rain Genomics, Inc – Ganderbal. Fallingrain.com. Retrieved on 2011-12-14.
  2. Rangil Water Treatment Plant finds hard to feed tail-end areas Lastupdate:- Fri, 4 Sep 2009 18:30:00 GMT. Greaterkashmir.com (2009-09-04). Retrieved on 2011-12-14.
  3. Gangabal Lake in India. India9.com (2005-06-07). Retrieved on 2011-12-14.
  4. Chief Minister of Jammu and Kashmir
  5. Electoral constituency
  6. Central University of Kashmir, Ganderbal | CareerPages Archived 2011-08-23 at the Wayback Machine. Careerpages.in. Retrieved on 2011-12-14.
  7. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
  8. census of India official website, www.census2011.co.in
  9. this is census of India 2011, www.census2011.co.in
  10. http://ceojammukashmir.nic.in/pdf/municipal%20Election/Result_Notifi_Corp.pdf

వెలుపలి లింకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=గందర్బల్&oldid=3948516" నుండి వెలికితీశారు