అక్షాంశ రేఖాంశాలు: 32°54′58″N 75°08′31″E / 32.915977°N 75.141937°E / 32.915977; 75.141937

ఉధంపూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉధంపూర్
పట్టణం
ఉధంపూర్ is located in Jammu and Kashmir
ఉధంపూర్
ఉధంపూర్
భారతదేశం, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉధంపూర్ స్థానం
ఉధంపూర్ is located in India
ఉధంపూర్
ఉధంపూర్
ఉధంపూర్ (India)
Coordinates: 32°54′58″N 75°08′31″E / 32.915977°N 75.141937°E / 32.915977; 75.141937
దేశంభారతదేశం
రాష్ట్రంజమ్మూ కాశ్మీరు
జిల్లాఉధంపూర్
Founded byరాజా ఉధం సింగ్
Named forరాజా ఉధం సింగ్
Government
 • Bodyఉధంపూర్ పురపాలక సంఘం
విస్తీర్ణం
 • Total51 కి.మీ2 (20 చ. మై)
Elevation
755 మీ (2,477 అ.)
జనాభా
 (2016)
 • Total2,15,213
 • జనసాంద్రత4,686/కి.మీ2 (12,140/చ. మై.)
భాషలు
 • అధికార భాషలుహిందీ, డోగ్రీ
Time zoneUTC+5:30
పిన్
182101
ప్రాంతీయ ఫోన్ కోడ్91-1992
Vehicle registrationJK-14
Websiteudhampur.nic.in

ఉధంపూర్, జమ్మూ కాశ్మీరు కేంద్రపాలిత ప్రాంతానికి లోని పట్టణం. ఇది ఉధంపూర్ జిల్లా ముఖ్యపట్టణం. ఇది పురపాలక సంఘం హోదాతోఉన్న పట్టణం. రాజా ఉధమ్ సింగ్ పేరు మీద ఈ పట్టణానికి పేరు వచ్చింది. ఇక్కడ భారత సైన్యపు ఉత్తర కమాండు ప్రధాన కార్యాలయం ఉంది. భారత వైమానిక దళానికి చెందిన ఫార్వర్డ్ బేస్ సపోర్ట్ యూనిట్ (ఎఫ్‌బిఎస్‌యు) ఇక్కడే ఉంది. జాతీయ రహదారి 1 ఎలో సాయుధ దళాలు ప్రయాణించేటప్పుడు జమ్మూ, శ్రీనగర్ ల మధ్య ఉధంపూర్ ‌ను మార్గాంతర రవాణా/విశ్రాంతి స్థలంగా వాడుకుంటాయి.

భౌగోళికం

[మార్చు]

ఉధంపూర్ జిల్లా హిమాలయాలకు సమీపంలోని శివాలిక్ కొండల పరిధిలో ఉంది. ఈ భూభాగం ఎక్కువగా పర్వత ప్రాంతం. జిల్లా లోని ఎగువ ప్రాంతాల్లో శీతాకాలంలో మంచు కురుస్తుంది. [1] సముద్ర మట్టం నుండి 756 మీటర్లు (2480 అడుగులు) ఎత్తున ఉన్న ఉధంపూర్ సాపేక్షంగా చదునుగా ఉంటుంది. ఇక్కడ మంచు కురవడం అరుదు.

పరిపాలన

[మార్చు]

22 వార్డులతో ఉధంపూర్ పురపాలక సంఘం, పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

శీతోష్ణస్థితి

[మార్చు]

నగరంలో ఉప ఉష్ణమండల శీతోష్ణస్థితి ఉంటుంది. వేసవి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు వరకు పెరుగుతాయి. శీతాకాలంలో గడ్డకట్టే ఉష్ణోగ్రత నమోదవుతుంది. వార్షిక వర్షపాతం 130 సెం. మీ. ఇందులో అధికభాగం వర్షాకాలం, శీతాకాలాలలో పడుతుంది, మారుతున్న శీతోష్ణస్థితి కారణంగా, ఇటీవలి సంవత్సరాలలో భారీ హిమపాతం సంభవిస్తోంది. 2011 లో సుమారు 15 సెం.మీ. మంచు కురిసింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో వడగళ్ల వానలు కురుస్తాయి.

జనాభా

[మార్చు]

2016 అనధికారిక జనాభా లెక్కల ప్రకారం ఉధంపూర్ నగరంలో 2 లక్షల జనాభా ఉంది. అందులో పురుషులు 60.2%, మహిళలు 39.8%. మంది ఉన్నారు. నగర జనాభాలో సైన్యానికి చెందిన పురుషులు ఎక్కువగా నివసించుచున్న కారణంగా పురుషుల శాతం ఎక్కువుగా ఉంది. నగర సగటు అక్షరాస్యత 91.5%. నగరంలో హిందూ మతానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు.

రవాణా సౌకర్యాలు

[మార్చు]

రోడ్డు మార్గం

[మార్చు]

ఉధంపూర్ జాతీయ రహదారి ఎన్ఎచ్-44 పైన ఉంది. ఇది శ్రీనగర్‌ను భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే ఏకైక జాతీయ రహదారి. ఉధంపూర్ నుండి ఇతర ప్రదేశాలకు ప్రయాణించటానికి ప్రైవేటు, ప్రభుత్వ యాజమాన్యంలోని బస్సులు ఉన్నాయి. కాశ్మీర్ లోయ, జమ్మూలకు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. జమ్మూ, శ్రీనగర్, ఇతర సమీప పట్టణాలకు వెళ్ళడానికి టాక్సీ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. నగరంలో మినీబస్సులు తిరుగుతాయి.

రైలు మార్గం

[మార్చు]

జమ్మూ కాశ్మీరు శీతాకాల రాజధాని అయిన జమ్మూతో ఉధంపూర్‌కు రైలు రవాణా సౌకర్యాలున్నాయి. 2005 లో న్యూడిల్లీ ఉత్తర సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ఈ మార్గంలో నడిచిన మొదటి రైలు. డజనుకు పైగా సుదూర రైళ్లు ఉధంపూర్ రైల్వే టెర్మినస్ నుండి భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకు వెళ్తాయి. ప్యాసింజర్ రైళ్లు జమ్మూ, ఉధంపూర్‌లను అనుసంధానిస్తాయి. రైల్వే నిర్మాణ సంస్థ (జమ్మూ-బారాముల్లా) ఉధంపూర్, శ్రీనగర్లను అనుసంధానించే పనిలో ఉంది.

వాయు మార్గం

[మార్చు]

భారత వైమానిక దళం (ఐఎఎఫ్) ఉధంపూర్ వైమానిక దళం స్టేషన్ ఉధంపూర్‌కు ఉంది. అయితే ఇక్కడ పౌరుల రవాణా సౌకర్యానికి అనుమతి లేదు. ఉధంపూర్‌కు సమీప సమీప పౌర విమానాశ్రయం జమ్మూ విమానాశ్రయం.

సరాసరి వాతావరణ పట్టిక

[మార్చు]
శీతోష్ణస్థితి డేటా - Udhampur
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 24
(75)
29
(84)
33
(91)
39
(102)
40.5
(104.9)
40.9
(105.6)
41
(106)
38
(100)
32
(90)
31
(88)
29
(84)
25
(77)
41
(106)
సగటు అధిక °C (°F) 18.8
(65.8)
21.9
(71.4)
26.6
(79.9)
32.9
(91.2)
38.3
(100.9)
40.6
(105.1)
35.5
(95.9)
33.7
(92.7)
33.6
(92.5)
31.7
(89.1)
26.8
(80.2)
21.1
(70.0)
30.1
(86.2)
సగటు అల్ప °C (°F) 1.2
(34.2)
9.7
(49.5)
13.6
(56.5)
19.0
(66.2)
24.4
(75.9)
26.8
(80.2)
24.5
(76.1)
24.0
(75.2)
23.0
(73.4)
18.4
(65.1)
12.6
(54.7)
8.5
(47.3)
17.7
(63.9)
అత్యల్ప రికార్డు °C (°F) −4.4
(24.1)
−3
(27)
3
(37)
6
(43)
7
(45)
13
(55)
13
(55)
8
(46)
12
(54)
4
(39)
2
(36)
−3
(27)
−4.4
(24.1)
సగటు వర్షపాతం mm (inches) 50.0
(1.97)
46.4
(1.83)
53.2
(2.09)
26.3
(1.04)
16.0
(0.63)
51.8
(2.04)
283.4
(11.16)
644.5
(25.37)
123.9
(4.88)
38.1
(1.50)
11.9
(0.47)
42.2
(1.66)
1,387.7
(54.63)
Source 1: BBC Weather
Source 2: IMD

మూలాలు

[మార్చు]
  1. "Maps, Weather, and Airports for Udhampur, India". Retrieved 5 February 2017.

బాహ్య లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఉధంపూర్&oldid=4213399" నుండి వెలికితీశారు