రంబాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రంబాన్
Chenab Ramban.jpg
రంబాన్ is located in Jammu and Kashmir
రంబాన్
రంబాన్
జమ్మూ కాశ్మీరు రాష్ట్తంలో రంబాన్ స్థానం
రంబాన్ is located in India
రంబాన్
రంబాన్
రంబాన్ (India)
నిర్దేశాంకాలు: 33°15′N 75°15′E / 33.25°N 75.25°E / 33.25; 75.25Coordinates: 33°15′N 75°15′E / 33.25°N 75.25°E / 33.25; 75.25
దేశంభారతదేశం
రాష్ట్రంజమ్మూ కాశ్మీరు
జిల్లారంబాన్
సముద్రమట్టం నుండి ఎత్తు
747 మీ (2,451 అ.)
జనాభా వివరాలు
(2011)
 • మొత్తం3,596
అక్షరాస్యత
 • పట్టణం82.23%
కాలమానంUTC+5:30
పిన్‌కోడ్
182144
ప్రాంతీయ ఫోన్‌కోడ్01998
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లుJK 19
జమ్మూ నుండి దూరం150 కి.మీ
జాలస్థలిramban.gov.in

రంబాన్ భారతదేశంలోని జమ్మూ కాశ్మీరు రాష్ట్రం, రంబాన్ జిల్లాలోని ఒక పట్టణం.ఇది రంబాన్ జిల్లాకు పరిపాలనా కేంద్రస్థానం.ఇది జాతీయ రహదారి -1 ఎ (ఇప్పుడు ఎన్ఎచ్-44) లో చినాబ్ లోయలోని చీనాబ్ నది ఒడ్డున ఉంది. జమ్మూ నుండి 150 కి.మీ.దూరంలో, శ్రీనగర్ నుండి సుమారు 150 కి.మీ. దూరంలో ఉంది.ఇది జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై దాదాపు కేంద్ర బిందువుగా మారింది.[1]

చరిత్ర[మార్చు]

సి.ఇ. బాట్స్ రాసిన ' ది గెజిటీర్ ఆఫ్ కాశ్మీర్ ' అనే తన పుస్తకంలో, 1846లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఏర్పడటానికి ముందు, చీనాబ్ నది కుడి ఒడ్డున 15 ఇళ్లతో కూడిన ఒక చిన్న గ్రామం నాష్‌బ్యాండ్ (తరువాత 'రంబాన్') అని పిలువబడింది.జమ్మూకు చెందిన రాజా గులాబ్ సింగ్ జమ్మూ కాశ్మీరుకు ప్రాంతానికి మహారాజా అయినప్పుడు,అతను రాయల్ కార్వాన్సు (రాజులు,రాణులు లేదా యాత్రికలు) కదలిక కోసం శ్రీనగర్ చేరుకోవడానికి జమ్మూ-ఉధంపూర్-బనిహాల్ మార్గాన్ని అనుసరించాడు.ఈ ప్రక్రియలో రాయల్ యాత్రికులు కోసం, రాంబన్ విడిది స్టేషనుగా హోదాను పెంచాడు.ప్రస్తుత రాంబన్ సమీపంలో ఒక పక్కా భవనం, చీనాబ్ నది దాటడానికి ఒక చెక్క వంతెనను నిర్మించాడు.సుఖ్‌దేవ్ సింగ్ చాడక్ తన ' మహారాజా రణబీర్ సింగ్ ' పుస్తకంలో జమ్మూ నుండి శ్రీనగర్ వరకు బనిహాల్ మీదుగా ఒక బండి ప్రయాణించే రహదారి నిర్మాణానికి, రంబాన్ వద్ద చినాబ్ నదిపై వేలాడే వంతెన కోసం మహారాజా ఉత్తర్వులు జారీ చేశాడని రాశాడు.ఈ రహదారి ప్రస్తుతం జాతీయ రహదారి (ఎన్ఎచ్-44)గా మారింది.ఇప్పుడు ఇది నాలుగు వరుసల మార్గంగా మారింది. ఈ రహదారి అభివృద్ధితో, రాంబన్ హాల్టింగ్ స్టేషను చాలా అభివృద్ధి చెందింది.ఇప్పుడు దీనికి జిల్లా ప్రధాన కార్యాలయ హోదా లభించింది. [2]

జనాభా[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం[3] రాంబాన్ పట్టణ జనాభా 3,596,అందులో పురుషులు 1873, స్త్రీలు 1723 మంది ఉన్నారు. పట్టణ అక్షరాస్యత 82.23%.పురుషులు అక్షరాస్యత మొత్తం జనాభాలో 90.42%,స్త్రీల అక్షరాస్యత 73.5%గా ఉంది.[4]

గజపత్ కోట[మార్చు]

రాంబాన్ సమీపంలోని ఒక పర్వతం పైభాగంలో గజ్‌పత్ కోట అని పిలువబడే ఒక ముఖ్యమైన కోట ఉంది. ఒకసారి షేక్ అబ్దుల్లాను ఈ కోటలో కొన్ని రోజులు జైలులో ఉంచినట్లు చెబుతారు.1825 లో గులాబ్ సింగ్ ఈ కోటలో బింబార్‌కు చెందిన రాజా సుల్తాన్ ఖాన్‌ను ఖైదు చేశారని తెలుస్తుంది.సుల్తాన్ ఖాన్ అక్కడ మరణించిన తరువాత, చందర్‌కోట్‌లో ఖననం చేయబడ్డాడు.1858 లో రాజౌరి గవర్నర్ మీన్ హతు సింగ్, మహారాజా బంధువులు అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి మహారాజా రణబీర్ సింగ్‌ను చంపడానికి ప్రయత్నించారు.మీన్ హతును అరెస్టు చేసి గజ్‌పత్ కోటకు తరలించారు.[2]

ఇది కూడ చూడు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Statement showing the number of blocks in respect of 22 Districts of Jammu and Kashmir State including newly Created Districts Archived 2008-09-10 at the Wayback Machine dated 2008-03-13, accessed 2008-08-30
  2. 2.0 2.1 "Ramban From past to present". Jammu Kashmir Latest News | Tourism | Breaking News J&K (in అమెరికన్ ఇంగ్లీష్). 2015-07-19. Retrieved 2017-01-18.
  3. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
  4. "Ramban City Population Census 2011 - Jammu and Kashmir". www.census2011.co.in. Retrieved 2017-01-18.

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=రంబాన్&oldid=3122119" నుండి వెలికితీశారు