బండిపోరా
బండిపోర్ బండిపోరా | |
---|---|
పట్టణం | |
నిర్దేశాంకాలు: 34°25′00″N 74°39′00″E / 34.4167°N 74.6500°ECoordinates: 34°25′00″N 74°39′00″E / 34.4167°N 74.6500°E | |
దేశం | ![]() |
కేంద్రపాలిత ప్రాంతం | జమ్మూ, కాశ్మీర్ |
జిల్లా | బండిపోరా |
జనాభా వివరాలు (2011) | |
• మొత్తం | 3.92 లక్షలు |
భాషలు | |
• అధికార | ఉర్దూ |
కాలమానం | UTC+5:30 (భా.ప్రా.స) |
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లు | JK15 |
జాలస్థలి | http://bandipore.gov.in |
బండిపోర్ లేదా బండిపోరా భారతదేశం కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలోని బండిపోరా జిల్లాకు ప్రధాన కేంద్రస్థానం.ఇది ఆసియాలో రెండవ అతిపెద్ద మంచినీటి వులర్ సరస్సు ఉత్తర ఒడ్డున ఉంది.శ్రీనగర్‌లోని నిషాత్ బాగ్ మాదిరిగానే బండిపోరాలో చప్పరం తోట ఉంది.బండిపోరా మూడు వైపులా పర్వతాలతో, నాల్గవ వైపు వూలర్ సరస్సుతో నిర్మించారు.బండిపోరా మూడు 'ఎ' లకు అనగా అలీమ్ (జ్ఞానం),అడాబ్ (మంచి అలవాట్లు లేదా సాహిత్యం),ఆబ్ (నీరు)లకు ప్రసిద్ధి చెందింది.జానపద కథల నుండి తెలిసినట్లుగా,బండిపోరా పేరు బండ్ ఆఫ్ వులర్ నుండి,బండ్ ఇ పూర్ గా, స్థానిక జానపద గానం బృందాల నుండి (బాడ్) బాండ్ ఇ పూర్ గా లేదా పరివేష్టిత (బ్యాండ్) భౌగోళిక స్థానం నుండి బంద్ ఇ పూర్ గా రూపాంతరం చెందింది.
భౌగోళికం[మార్చు]
బండిపోరా వూలర్ సరస్సు ఒడ్డున ఉంది.ఇది ఒక పెద్ద మంచినీటి సరస్సు.ఇది చాలా వలస పక్షులకు నిలయం.అనుకోకుండా నదీ జలాల మురుగునీరు ప్రవాహం వూలర్ సరస్సును ముంచెత్తటం వలన సరస్సు కలుషితమై,ఆల్గే మహమ్మారి పెరుగుదలకు దారితీసింది.ఇది సరస్సును,దానితో సహాజీవితాన్ని చేయుచున్న వలస పక్షులను భయంకరంగామారింది.వూలర్ కాలుష్యానికి ప్రధానకారణం జీలంనది.శ్రీనగర్, చుట్టుపక్కల ఇతర ప్రాంతాల నుండి వచ్చే వ్యర్థాలన్నింటినీ జీలంనది తీసుకువెళ్ళి వూలర్‌లో నింపుతుంది.దక్షిణ ఆసియాలో అత్యంత ధనిక చిత్తడినేల,ఆసియాలో అతిపెద్ద మంచినీటి సరస్సు అయినప్పటికీ,వూలర్‌ను కాపాడటానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు.బండిపోరా రాజ్ధన్, గురేజ్, ట్రాగ్బాల్ లాంటి అధిక ప్రాంతాలకు ఒక పునాది పట్టణం
కుప్వారా జిల్లాలోని ప్రసిద్ధ లోలాబ్ లోయ బండిపోరా ప్రక్కనే ఉంది.ఇది కేవలం 30 కి.మీ. బండిపోరా నుండి అలూసా గ్రామం ద్వారా ఈ రహదారిని అధిగమించిన తర్వాత, ఇది లోలాబ్ లోయ ప్రధాన మార్గంగా మారుతుంది.ఇది కుప్వారా జిల్లాకు అదనపు మార్గాన్ని అందిస్తుంది.
సిండిక్ పట్టు రహదారి ద్వారా ఉత్తర భారతదేశం,మధ్య ఆసియా అనుసంధానించటానికి మధ్య బండిపోర్ ఒక కలిపే స్థానంలాంటింది. పజల్‌పోరా గ్రామంలో ఒక విదేశీ వస్తువులపై సుంకం విధించే కేంద్రం, దేశాంతర ప్రవేశ తనిఖీ విభాగం గతంలో ఉండేవి.ఇప్పుడు అవి అటవీ తనిఖీ కేంద్రంగా మారింది.బండిపోరాను వాస్తవంగా,మధ్య ఆసియాకు ప్రవేశద్వారం అని కూడా అంటారు.స్కార్డు, గురేజ్, బండిపోరాల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయి.
తాలూకాలు[మార్చు]
బండిపోర్ ఏడు తాలూకాలు విభజించబడింది
- బండిపోర్
- సుంబల్ సోనావారీ
- అజాస్
- హాజిన్
- ఆలూసా
- గురేజ్
- తులైల్
జనాభా[మార్చు]
2001 భారతదేశ జనాభా లెక్కల ప్రకారం [1] బండిపోరా జనాభా 25,714. జనాభాలో పురుషులు 54%, స్త్రీలు 46%. బండిపోరా లో గ్రామీణ ప్రాంత అక్షరాస్యతా రేటు 57.82%. ఇది జాతీయ అక్షరాస్యతా సగటు 59.5% కంటే తక్కువ. ఇందులో పురుషులు 65% కాగా స్త్రీలు 35% అక్షరాస్యత కలిగి ఉన్నారు. జనాభాలో 6 సంవత్సరాల వయస్సు కంతే తక్కువ ఉన్నవారు 12 శాతం ఉన్నారు.
మూలాలు[మార్చు]
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.