Coordinates: 32°34′N 75°07′E / 32.57°N 75.12°E / 32.57; 75.12

సంబా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంబా
సంబా is located in Jammu and Kashmir
సంబా
సంబా
జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో సంభా స్థానం
సంబా is located in India
సంబా
సంబా
సంబా (India)
Coordinates: 32°34′N 75°07′E / 32.57°N 75.12°E / 32.57; 75.12
దేశంభారతదేశం
రాష్ట్రంజమ్మూ కాశ్మీరు
జిల్లాసంభా
Named forసాంబ్యాల్ వంశం
Government
 • Typeమున్సిసిపల్ కౌన్సిల్
Area
 • Total1.65 km2 (0.64 sq mi)
Elevation
384 మీ (1,260 అ.)
Population
 (2018)
 • Total42,700
 • Density7,697/km2 (19,940/sq mi)
Time zoneUTC+5:30

సంబా, భారతదేశం కేంద్రపాలిత భూభాగం జమ్మూ కాశ్మీర్‌, సంబా జిల్లాకు చెందిన పట్టణం.ఇది సంబా జిల్లా పరిపాలనా కేంద్రస్థానం.ఇది సంబా జిల్లాలో ఉన్న ఏకైక ఉప జిల్లా "సంబా తహసీల్సు" లోని నగరపంచాయితీ హోదా కలిగిన నగరం.[1] ఇది సుమారు 12,700 మంది జనాభాతో సంబా జిల్లాలో మూడవ అత్యధిక జనాభా కలిగిన పురపాలక సంఘం.దీని మొత్తం జనసాంద్రత 2 (చ.కి.మీ. జనాభా), ఇది సంబా ఉపజిల్లాలో, విస్తీర్ణంలో రెండవ అతి చిన్ననగరం. సంబా పురపాలకసంఘం 13 వార్డులుగా విభజించారు.దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి. సంబా 13 వార్డులలో, 13వ వార్డు 1702 ఓటర్లతో ఎక్కువతో ఉండగా,11వ వార్డు 533 ఓటర్లతో అతి తక్కువ ఓటర్లు కలిగిన వార్డుగా ఉంది.

చరిత్ర[మార్చు]

సంబా జిల్లా ఏర్పడటానికి ముందు, ఈ నగరం జమ్మూ జిల్లాలో భాగంగా ఉంది.జమ్మూ జిల్లా పరిధిలోకి వచ్చే బారి బ్రాహ్మణ లోని ప్రధాన పారిశ్రామిక ప్రాంతం ఇప్పుడు సంబా జిల్లాలో భాగంగా చేరింది. నగరంలోని ప్రజలలో ఎక్కువమంది సైన్యంలో చేరే సంప్రదాయం ఉంది.

భౌగోళికం[మార్చు]

సంబా 32°34′N 75°07′E / 32.57°N 75.12°E / 32.57; 75.12.అక్షాంశ రేఖాంశాలు వద్ద ఉంది.ఇది 384 మీటర్లు (1,260 అడుగులు) సముద్రమట్టానికి సగటుఎత్తులో ఉంది. జమ్మూ నగరం నుండి జాతీయరహదారి 1-ఎలో సంబా పట్టణం శివాలిక్ కొండలలో, బసంతర్ నది ఒడ్డున 40 కి.మీ. (25 మైళ్లు) దూరంలో ఉంది.సంబాకు ఉత్తరాన ఉధంపూర్ జిల్లా, తూర్పున కథువా జిల్లా, పశ్చిమాన జమ్మూ జిల్లాకు చెందిన తహసిల్సు ఉన్నాయి. జమ్మూ, బిష్నా, దక్షిణాన పాకిస్తాన్ దీనికి ప్రస్తుత సరిహద్దులుగా ఉన్నాయి.

సంబా ప్రాంతంలో ఎక్కువ భాగం కంది పంటను సాగుచేస్తారు.జాతీయ రహదారికి దిగువన ఉన్న దక్షిణ ప్రాంతం రవితవి పంటకాలువ ద్వారా సేద్యం జరుగుతుంది. ప్రాంతీయ ఆయకట్టు అభివృద్ధి శాఖ ద్వారా ప్రత్యేకంగా జలవనరుల మంత్రిత్వ శాఖ కేటాయించిన ప్రధాన ధాన్యపు, కూరగాయల పంటలకు దోహదం చేస్తుంది.

ఆధునిక పారిశ్రామిక సముదాయం, పారిశ్రామిక అభివృద్ధి కేంద్రం బసంతర్ నది ఒడ్డున ఉంది. అనేక చిన్న, మధ్యతరహా పారిశ్రామిక సంస్థలు పనిచేస్తున్నాయి. విద్యావంతులైన నిరుద్యోగ యువకులుకు, నైపుణ్యం కలిగిన కార్మికులుకు, నైపుణ్యం లేని కార్మికులకు ప్రైవేట్ రంగంలో కొత్త వ్యాపార కార్యక్రమాలను ప్రారంభించడానికి అవకాశాలు కల్పిస్తున్నాయి.

వాతావరణం[మార్చు]

సంబా వాతావరణం ఉపఉష్ణమండలమైంది.వేసవిలో వేడి, పొడి వాతావరణంతోనూ, శీతాకాలంలో చల్లగా ఉంటుంది.సంబా పర్వత ప్రాంతంలో ఉన్నందున, సంబాలోని రాత్రులు పొరుగు ప్రాంతం పంజాబ్ కన్నా కొంచెం చల్లగా ఉంటాయి.సంబా సగటు వార్షిక వర్షపాతం 80.07 cm (31.52 in).దీని వార్షిక సగటు ఉష్ణోగ్రత 5 to 45 °C (41 to 113 °F). గా ఉంది.

జనాభా[మార్చు]

అవలోకనం[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, సంబా పురపాలకసంఘ పరిధి జనాభా 12,700, అందులో 6,979 (55%) పురుషులు, 5721 (45%) మహిళలు.[1] జనాభా మొత్తంలో 10.75% మంది ఏడు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు 1365 మంది పిల్లలు ఉన్నారు. నగరం పరిధిలో 2566 గృహాలు ఉన్నాయి. ప్రతి కుటుంబంలో సగటున ఐదుగురు వ్యక్తులు నివసిస్తున్నారు. 

కులాల వారీ[మార్చు]

సంబా పట్టణ నివాసితులలో కులం ప్రకారం, 71% సాధారణ కులానికి చెందినవారు, 28.57% మంది షెడ్యూల్ కులానికి, 0.04% మంది షెడ్యూల్ తెగలుకు చెందినవారు ఉన్నారు.[1]

కులాలు వారీగా సంబా జనాభా [1]
వివరం మొత్తం సాధారణ షెడ్యూల్ కులం షెడ్యూల్ తెగ పిల్లలు
మొత్తం 12,700 9066 3629 5 1365
పురుషుడు 6979 5041 1934 4 756
స్త్రీలు 5721 4025 1695 1 609

మత పంపిణీ[మార్చు]

సంబాలో, హిందూ మతం ఆధిపత్య మతం కాగా, క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు మైనారిటీలుగా ఉన్నారు. 

2011 జనాభా లెక్కల ప్రకారం సంబా పట్టణంలో మతాలవారిగా

  గుర్తించలేదు (0.08%)
మతం ద్వారా సాంబా జనాభా
మొత్తం హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్కు బౌద్ధ జైన ఇతరులు పేర్కొనబడలేదు
మొత్తం (శాతాలు) 100% 95.54% 0.47% 2.08% 1.76% 0.07% 0.00% 0.00% 0.08%
మొత్తం (జనాభా) 12,700 12,134 60 264 223 9 0 0 10
పురుషులు 6979 6644 42 128 156 4 0 0 5
స్త్రీలు 5721 5490 18 136 67 5 0 0 5

జనాభా పెరుగుదల[మార్చు]

2001 జనాభాతో 2011 జనాభా పోల్చగా నగర జనాభా 20.2% తగ్గింది. 2001 జనాభా లెక్కల ప్రకారం, సంబా మొత్తం జనాభా సుమారు 16,000. స్త్రీల జనాభా వృద్ధి రేటు 8.1%, ఇది పురుష జనాభా వృద్ధి రేటు (28%) కంటే 19.9% ఎక్కువ సాధారణ కుల జనాభా 27.9% తగ్గింది, షెడ్యూల్ కుల జనాభా 8.5% పెరిగింది. రెండు జనాభా లెక్కల మధ్య పిల్లల జనాభా 24.7% తగ్గింది. 

లింగ నిష్పత్తి[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం, సంబాలో 1000 మంది పురుషులకు 820 మంది మహిళలు ఉన్నారు. రాష్ట్ర సగటు 1000 పురుషులకు 889 మంది మహిళలుకన్నా తక్కువగా ఉన్నారు.[1] లింగ నిష్పత్తి సాధారణ కులంలో 798, షెడ్యూల్ కులంలో 876, షెడ్యూల్ తెగలో 250 మంది ఉన్నారు.ఏడు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు, నగరంలో 1000 మంది అబ్బాయిలకు 806 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్ర సగటు 1000 మంది అబ్బాయిలకు 862 మంది బాలికలు. సంబా మొత్తం లింగ నిష్పత్తి 2001, 2011 మధ్య, వరుసగా 1000 మంది పురుషులకు 177 మంది మహిళలు,1000 మంది అబ్బాయిలకు 36 మంది బాలికలు పెరిగారు.

అక్షరాస్యత[మార్చు]

సంబా అక్షరాస్యత రేటు 90.45%, ఇది రాష్ట్ర సగటు 67.16% కంటే ఎక్కువ.సంబా పురుష అక్షరాస్యత రేటు 94.52%, స్త్రీల అక్షరాస్యత రేటు 85.49%.నగరంలో అక్షరాస్యులైన 10,000 మందిలో 5882 మంది పురుషులు, 4370 మంది మహిళలు ఉన్నారు. 2001, 2011 మధ్య, నగరం మొత్తం అక్షరాస్యత రేటు 2%కు పెరిగింది.స్త్రీ, పురుష అక్షరాస్యత రేట్లు వరుసగా 2%, 6%కు పెరిగాయి. 

ఉపాధి[మార్చు]

జనాభా గణనలో, ఒక కార్మికుడు వ్యాపారం చేసే లేదా ఏదైనా ఉద్యోగం, సేవ, సాగు లేదా కార్మిక కార్యకలాపాలు చేసే వ్యక్తిగా నిర్వచించబడతాడు.[1] సంబ్రా జనాభాలో 4356 (34%) పని లేదా వ్యాపార కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారు. 91.80% మంది కార్మికులు పూర్తి సమయంలో నిమగ్నమై ఉన్నారు.8.20% మంది కార్మికులు తాత్కాలిక పనులలో నిమగ్నమై ఉన్నారు.జనాభాలో కార్మికులు లింగపరంగా 3885మంది కార్మికులు పురుషులు కాగా, 471మంది స్త్రీలు ఉన్నారు.[1] పురుష జనాభాలో 56%, స్త్రీ జనాభాలో 8% కార్మికులు.పురుష జనాభాలో 51% ప్రధాన కార్మికులు,4% మంది ఉపాంత కార్మికులు.మహిళా జనాభాలో 7% ప్రధాన కార్మికులు,1% ఉపాంత కార్మికులు. 

మైలురాళ్ళు[మార్చు]

మన్సార్ సరస్సు[మార్చు]

మన్సార్ సరస్సు

మన్సార్ సరస్సు సంబా-ఉధంపూర్ రహదారిలో సంబాకు 22 కి.మీ (14 మైళ్లు) దూరంలో ఉంది.ఈ సరస్సు చుట్టూ వివిధ హిందూ దేవాలయాలు ఉన్న కొండలు ఉన్నాయి.ఈ ప్రాంతం పర్యాటకులును, మత యాత్రికులను అధిక సంఖ్యలో ఆకర్షిస్తుంది.సరస్సు ఒడ్డున ఉన్న ఐదు పర్యాటక గుడారాలు, గదులతో కూడిన పర్యాటక సముదాయం సందర్శకులకు వసతి కల్పిస్తుంది. నాలుగు పర్యాటక ప్రదేశాలలో పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టుల అమలు బాధ్యత కలిగిన సురిన్సర్-మన్సార్ డెవలప్‌మెంట్ అథారిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

దేవాలయాలు[మార్చు]

జమ్మూకు 39 కి.మీ. (24 మైళ్లు) దూరంలో పూర్మండలం అనే గ్రామం ఉంది.ఇది పూర్మండలం -ఉత్తర్‌బాని-విజయ్‌పూర్ రహదారి మీదుగా సంబాకు రవాణా సౌకర్యం ద్వారా అనుసంధానించబడింది. పూర్మండలం ‌ను "చోటా కాశీ" అని పిలుస్తారు.ఇక్కడ పాత శివాలయాలు ఉన్నాయి.వీటికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది, చుట్టూ శివాలిక్ కొండలు ఉన్నాయి. పూర్మండలం నుండి చారిత్రాత్మక దేవాలయాలుఉన్న మరో గ్రామం ఉత్తర్‌బాని దేవిక నది ఒడ్డున 5 కి.మీ దూరంలోఉంది.ఆప్ శంభు మందిర్ ఆలయం జమ్మూలో ఉంది.సంబాలో ఉన్న చిచి మాతా మందిర్ అనే ఆలయం సతీదేవి చిన్న వేలు పడిపోయిన శక్తిపీఠాలలో ఒకటి.

ఉన్నత విద్యాసంస్థలు[మార్చు]

సాంబాలోని ఉన్నత విద్యాసంస్థలు ఈ క్రింది వాటిని కలిగి ఉన్నాయి:

  • బిబిఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేధావులు
  • ప్రభుత్వ డిగ్రీ కళాశాల
  • భార్గవ డిగ్రీ కళాశాల
  • ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల
  • ప్రభుత్వ ఐటీఐ
  • భార్గవ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ
  • భార్గవ లా కాలేజీ
  • జమ్మూ సెంట్రల్ యూనివర్శిటీ

ప్రస్తావనలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "Samba Municipal Committee City Population Census 2011-2019 | Jammu and Kashmir". www.census2011.co.in. Retrieved 2019-07-22.

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సంబా&oldid=3948547" నుండి వెలికితీశారు