కంఝావాలా
కంఝావాలా | |
---|---|
ఉప జిల్లా | |
Coordinates: 28°43′36″N 77°00′09″E / 28.72674°N 77.00248°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఢిల్లీ |
జిల్లా | నార్త్ వెస్ట్ ఢిల్లీ జిల్లా |
జనాభా (2011) | |
• Total | 10,331 |
భాషలు | |
• అధికార | హిందీ , ఆంగ్లం |
Time zone | UTC+5:30 (IST) |
కంఝవాలా, భారతదేశ కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీ రాష్ట్రం, నార్త్ వెస్ట్ ఢిల్లీ జిల్లాలోని పట్టణం.ఇది జిల్లా ముఖ్య పట్టణం, ఒక ఉపవిభాగం.[1]
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కలు ఆధారంగా కంఝవాలా పట్టణం పరిధిలో మొత్తం 10,331 మంది జనాభా ఉన్నారు. వారిలో 5,529 మంది పురుషులు ఉండగా, 4,802 మంది మహిళలు ఉన్నారు.
0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 1,344 మంది ఉన్నారు.ఇది కంజవాలా పట్టణ మొత్తం జనాభాలో 13.01%గా ఉంది.కంజవాలా జనగణన పట్టణంలో, స్త్రీ లింగ నిష్పత్తి, రాష్ట్ర సగటు 868 కు వ్యతిరేకంగా, 869 గా ఉంది. కంజావాలాలో బాల లింగ నిష్పత్తి 826గా ఉంది.ఇది ఢిల్లీ రాష్ట్ర సగటు 871 తో పోలిస్తే తక్కువుగా ఉంది. కంజవాలా నగర అక్షరాస్యత 83%గా ఉంది.ఇది రాష్ట్ర సగటు 86.21% కన్నా తక్కువ. కంజావాలాలో పురుషుల అక్షరాస్యత 90.07ఉండగా, స్త్రీల అక్షరాస్యత రేటు 75%గా ఉంది.[2]
ప్రాంతాలు, కార్యాలయాలు
[మార్చు]అన్ని మతాలకు, కులాలకు చెందిన ప్రజలు పట్టణంలో నివసిస్తున్నారు.ఈ పట్టణం భవనా, ముండ్కా, రాణి ఖేరా, బహదూర్గర్ అనే నాలుగు పారిశ్రామిక ప్రాంతాలు ఈపట్టణం పరిధిలో ఉన్నాయి. కంజవాలా పట్టణ పరిధిలో స్వంత పారిశ్రామిక ప్రాంతాన్ని కలిగి ఉంది. భారతదేశంలోని ప్రతి ప్రాంతం నుండి ప్రజలు కంజవాలా గ్రామంలో, దాని పరిసర ప్రాంతంలో నివసిస్తున్నారు. జిల్లా కమిషనర్ (డిసి), సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కార్యాలయం, వాయువ్య ఢిల్లీకి చెందిన రెవెన్యూ కోర్టు, ఇంకా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రధాన రహదారి ఎండిఆర్ - 8 లోని కంజవాలాలో ఉన్నాయి.
భౌగోళికం
[మార్చు]మహాభారత కాలంనాటి ఖండవ్ ప్రస్థ్ వాన్, కంజవాల పట్టణం నుండి ఒక కి.మీ దూరంలోని లాడ్పూర్ గ్రామ ప్రాంతంలో ఉంది. దీనిని ప్రస్తుతం దాదా పోభారా అని పిలుస్తారు.
మూలాలు
[మార్చు]- ↑ "Official website of North-West district".
- ↑ "Kanjhawala Census Town City Population Census 2011-2021 | Delhi". www.census2011.co.in. Retrieved 2021-01-04.