కార్గిల్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కార్గిల్
కార్గిల్ నగరం
కార్గిల్ నగరం
భారతదేశం భారతదేశం
రాష్ట్రంలడఖ్
కార్గిల్1979 జులై 1
ప్రధాన కార్యాలయంకార్గిల్
Area
 • Total14,086 km2 (5,439 sq mi)
Elevation
2,676 మీ (8,780 అ.)
Population
 (2011)[1]
 • Total1,43,388
 • Density10/km2 (26/sq mi)
భాషలు
 • అధికారఉర్దూ
 • మాట్లాడే భాషలులడఖి/పుడిగ్, హిందీ / ఉర్దూ, షీనా, బాల్టి
Time zoneUTC+5:30
పిన్‌కోడ్
194103
లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్, కార్గిల్
రకం
రకం
కార్గిల్ జిల్లా అటానమస్ హిల్ కౌన్సిల్
నాయకత్వం
చీఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్
అస్గర్ అలీ కర్బలై, భారత జాతీయ కాంగ్రెసు
కౌన్సిలర్లు
నిర్మాణం
సీట్లు30 కౌన్సిలర్లు
రాజకీయ వర్గాలు
భారత జాతీయ కాంగ్రెసు
రాజకీయ వర్గాలు
జమ్మూ కాశ్మీర్ జాతీయ సమావేశం
ఎన్నికలు
ఓటింగ్ విధానం
26 (బహుళ ఓటింగ్)
ఓటింగ్ విధానం
4 నామినేటడ్
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
సమావేశ స్థలం
కార్గిల్

లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలోని 2 జిల్లాలలో కార్గిల్ జిల్లా (లడకి భాష: ཀར་གིལ, ఉర్దు: کرگل, హింది: करगिल) ఒకటి. కార్గిల్ జిల్లా పశ్చిమ సరిహద్దులో పాక్ ఆక్రమిత కాశ్మీరు లోని గిల్‌జిత్-బల్టిస్తాన్, దక్షిణ సరిహద్దులో కాశ్మీర్ లోయ ఉన్నాయి. శురు, వాకా, ద్రాస్‌ లోయలతో చేర్చి జెంసర్ కూడా కార్గిల్ జిల్లాలో భాగంగా ఉంది.బ్రిటిష్ ప్రభుత్వం ముగింపుకు వచ్చిన తరువాత పాకిస్థాన్ , భారత్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. తరువాత 1947లో జరిగిన ఇండో - పాకిస్థాన్ యుద్ధం తరువాత కార్గిల్ పాకిస్థాన్ వశమైంది. అయినప్పటికీ 1971లో జరిగిన ఇండో- పాకిస్థాన్ యుద్ధం తరువాత భారతప్రభుత్వం తిరిగి కార్గిల్ ప్రాంతాన్ని భారతప్రభుత్వం వశపరచుకుంది. 1999లో పాకిస్థాన్ తిరిగి కార్గిల్‌ను స్వాధీనపరచుకుంది. ఈ యుద్ధంలో పాకిస్థాన్ సైన్యాల మీద భారత్ సైన్యాలు విజయం సాధించాయి. 1979లో కార్గిల్ ప్రత్యేక జిల్లాగా రూపొందించబడింది. 2019 లో ఈ జిల్లాను లడఖ్ కేండ్రపాలిత ప్రాంతం లోకి చేర్చక ముందు ఇది జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో భాగంగా ఉండేది. ఆ రాష్ట్రంలో అత్యల్ప జనసాంధ్రత కలిగిన జిల్లాగా గుర్తించబడింది.[2]

భౌగోళికం[మార్చు]

కార్గిల్ జిల్లా హిమాలయాలలో ఉంది. ఇక్కడి వాతావరణం చలిగా ఉంటుంది. వేసవి రాత్రుళ్ళు అధికమైన చలిగానూ పగలు నులివెచ్చగానూ ఉంటుంది. శీతాకాలం దీర్ఘంగా అత్యంత చలిగానూ ఉంటుంది. శీతాకాలం ఉష్ణోగ్రతలు తరచుగా పతనం ఔతూ ఉంటుంది. జంస్కర్ పీఠభూమి చలి విపరీతంగా ఉన్న కారణంగా ఇక్కడ మానవులు నివసించడానికి అనుకూలంగా ఉండదు. కార్గిల్ జిల్లా వైశాల్యం 14,086 చ.కి.మీ. జిల్లా అంతటా శురు నది ప్రవహిస్తుంటుంది.శ్రీనగర్ , లెహ్ జిల్లాలను కలుపుతున్న జాతీయ రహదారి 1డి కార్గిల్ మీదుగా పోతుంది. ఈ రహదారి జూన్ , నవంబరు మద్య వరకు తెరచుకుని తరువాత జాయ్ లా వద్ద హిమపాతం కారణంగా మూసివేయబడుతుంది. అయినప్పటికీ సమీపకాలంగా ఈ మార్గం జూన్ మాసానికి ముందే తెరవబడుతూ ఉంది. కార్గిల్ జిల్లా రాష్ట్రరాజధాని శ్రీనగర్ నుండి మొదలౌతుంది. కార్గిల్ దక్షిణ ప్రాంతం నుండి జంస్కర్ వరకు 40 కి.మీ దూరం కాలిబాట వేయబడి ఉంది. జంస్కర్ వరకూ మొత్తం దూరం 220 కి.మీ ఉంటుంది. ఈ మార్గం జూన్ నుండి సెప్టెంబరు వరకు తెరచి ఉంటుంది. ఈ భూభాగం చూడడానికి ప్రస్తుతం భారతప్రభుత్వం పర్యాటకులకు అనుమతి ఇస్తుంది.[3] సమీపకాలంలో భారత్ , పాక్ ప్రభుత్వాలు ఆలోచించి పాకిస్థాన్ పట్టణం స్కర్దు నుండి కార్గిల్ వరకు బసు మార్గం ద్వారా ప్రయాణవసతి కల్పించడానికి ప్రయత్నిస్తుంది.[4]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 143,388,[2]
ఇది దాదాపు సెయింట్ లూసియా దేశ జనసంఖ్యకు సమానం [5]
అమెరికాలోని నగర జనసంఖ్యకు సమం
640 భారతదేశ జిల్లాలలో 603 వ స్థానంలో ఉంది [2]
1చ.కి.మీ జనసాంద్రత 10 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం 20.18%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి 775:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే అల్పం
అక్షరాస్యత శాతం 74.49%.[2]
జాతియ సరాసరి (72%) కంటే అధికం
కార్గిల్ జిల్లాలో ప్రాంతీయ స్త్రీలు

కార్గిల్ జిల్లాలోని ప్రజలలో అత్యధికంగా ఉన్న ముస్లిముల శాతం 80% (95,963), వారిస్థానంలో షియా ముస్లిములు 73% ఉన్నారు.ముస్లిం ప్రజలు అధికంగా కార్గిల్ పట్టణం, ద్రాస్ , దిగువన ఉన్న శురులోయ (రంగ్డం), షర్గోల్ , ముల్బఖ్‌లో ఉన్నారు. స్థానిక ప్రజలలో మిగిలిన 5% ప్రజలు హిందువులు , సిక్కులు ఉన్నారు.

కార్గిల్ జిల్లాలో మతాలు వారిగా
మతం Percent
ముస్లిం
  
80%
బౌద్ధులు
  
15%
హిందూ
  
5%

Includes సిక్కుs (0.2%).

కార్గిల్ జిల్లాలోని ప్రజలలో అత్యధికులు టిబెటియన్ స్థానికత కలిగిన (16వ శతాబ్దంలో బుద్ధిజం నుండి ఇస్లాం మతానికి మారిన ప్రజలు) [6] బురిగ్ , బల్టి చెందిన వారు. వీరు చక్కగా దర్ద్, మాన్ , ఇతర ఆర్య సంతతి ప్రజలతో కలిసి మెలిసి ఉంటున్నారు. ముస్లిం దర్ద్ ప్రజలు ద్రాస్‌లో నివసుస్తూ షినా భాషను మాట్లాడుతుంటారు. బ్రోక్పా అనబడే బౌద్ధ దర్ద్ ప్రజలు ధా- హను వద్ద ఉన్న " లమయురు " స్థూపం వద్ద నివసిస్తుంటారు. అర్ఘోన్లు , షినా ప్రజలలో కొందరు కార్గిల్ పట్టణంలో స్థిరపడ్డారు.

భాషలు[మార్చు]

వర్నాక్యులర్లు (బల్టి ప్రజలతో చేర్చిన) నాస్తలిక్ , దేవనాగరి భాషను వ్రాయడం , మాట్లాడడం చేయగలరు. బల్టిస్థాన్‌లో వీరు దాదాపు 30,000 మంది ఉన్నారు.[7]

సంస్కృతి[మార్చు]

పూర్వపు టిబెటన్ సంబంధం కార్గిల్ , లెహ్ ప్రజలమీద తీవ్రమైన ప్రభావం కలిగిఉంది. కార్గిల్‌లోని షియా ముస్లిములు వచ్చిన తరువాత ప్రజల మీద పర్షియన్ సంస్కృతి ప్రభావం అధికమైంది. ఇక్కడి ప్రజలలో వాడుకలో ఉన్న పర్షియన్ పదాలు, సామెతలు , మతసంబంధమైన ఇతర గీతాలు (మరాసియాలు , క్వసిడాలు) పర్షియన్ ప్రభావానికి నిదర్శనంగా ఉన్నాయి. మహమ్మద్ ప్రవక్త వారసులు తమ పిల్లలను విద్యాభ్యాసానికి ఇరాక్ దేశానికి పంపడం ఇందుకు మరొక సాక్ష్యం.[8] స్థానిక లడక్ ప్రజలు ఇస్లామీ పైచదువులకు , సమావేశాలకు నజఫ్,ఇరాక్ , క్వాం, ఇరాన్ దేశాలకు వెళుతుంటారు. నాన్ ఆగా పండితులను షియేఖ్ అని అంటారు. వారిలో ప్రబలమైన పండితులు ఇమామ్-ఇ- జమ్ము, షెయిఖ్ ముస్సా షరీఫ్, షెయిక్ అహమ్మద్ మొహమ్మది మొదలైన వారు.[9] షెయిక్ హుస్సైన్ జాక్రి , షెయిక్ అంవర్ .[10] వివాహాది సాంఘిక ఉత్సవాలలో ముస్లిములు , బౌద్ధుల మద్య పలు సంప్రదాయాలు , ఆచారాలు భాగస్వామ్యం వహిస్తున్నాయి. లఢక్ , కార్గిల్ జిల్లాలలో విభిన్న సంప్రదాయాలు ప్రజలు నివసిస్తున్నారు. అందువలన లెహ్‌తో పోల్చిచూదినప్పుడు ఈ ప్రాంతాలలో అత్యధిక మైన మతసంప్రదాయాలు చోటుచేసుకున్నాయి. బల్టి , గజల్స్ వంటి జానపద గీతాలను ప్రజలు అత్యధికంగా అభిమానిస్తుంటారు. ఈ గీతాలను వివాహాది వేడుకలలో కూడా ఆలపిస్తుంటారు. ఈ జిల్లాలో పర్యాటకం అభివృద్ధి చేయడానికి ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం " సంస్కృతిక కార్యక్రమాలు " నిర్వహిస్తూ ఉంది. ఈ కార్యక్రమాలలో గజల్స్ వంటి సంగీత కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. మౌలిక సదుపాయాలు , పర్యాటకులు బసచేయడానికి అవసరమైన వసతులు తక్కువగా ఉన్న కారణంగా ఈ జిల్లాలో ప్రకృతి సౌందర్యం అపారంగా ఉన్నప్పటికీ పర్యాటకరంగం ఇకా అభివృద్ధి కాలేదు.

పేరు వెనుక చరిత్ర[మార్చు]

కార్గిల్ అనే పేరు " ఖార్ , ర్గిల్ " పదాల సమ్మిశ్రితం. ఖార్ అంటే కోట అని అర్ధం, ర్ఖిల్ అంటే కేంద్రం అని అర్ధం. అంటే కోటల కేంద్రమని అర్ధం. ఈ ప్రాంతం పలు రాజ్యాల మద్య ఉన్నందున ఇది కార్గిల్ అయిందని భావిస్తున్నారు. మరొక అర్ధంలో గార్ , ఖిల్ పదాల కలయిక అని ప్రాంతీయ పరిభాషలో గార్ అంటే ఎక్కడైనా అని ఖిల్ అంటే కేంద్రమని అర్ధం. ప్రజలు నివసించే కేంద్రమని కూడా ఒక అర్ధం ఉంది. కార్గిల్ ప్రాంతం స్వతంత్రానికి ముందు ప్రశాంతంగా ఉండేది. ఇండియా విభజన జరిగిన తరువాత ఈ ప్రాంతంలో 1947లో మొదటి ఇండో - పాక్ యుద్ధం జరిగింది. మొదట ద్రాస్, జోయి లా పాస్ ప్రదేశాలు పాకిస్థాన్ వశమయ్యాయి. 1948 నాటికి వీటిలో అధిక భాగం భరతదేశం తిరిగి వశపరచుకుంది.[11] ఈ ప్రాంతం యుద్ధానంతరం భారతప్రభుత్వ ఆధీనంలో ఉంది. రెండవ కాశ్మీర్ యుద్ధంలో భరతప్రభుత్వం కార్గిల్ లోని మిగిలిన ప్రాంతాన్ని కూడా వశపరచుకుంది.[11]

వాతావరణం[మార్చు]

విషయ వివరణ వాతావరణ వివరణ
సంవత్సర సరాసరి ఉష్ణోగ్రత 8.6° సెల్షియస్
శీతాకాలం సరాసరి ఉష్ణోగ్రత 0 ° సెల్షియస్
వేసవి కాలం సరాసరి ఉష్ణోగ్రత 23.3 ° సెల్షియస్
వర్షపాతం 318 మి.మీ
అత్యధిక వర్షపాతం 82 మి.మీ (మార్చి మాసం)
అత్యల్ప వర్షపాతం 8 మి.మీ (నవంబరు మాసం)
అక్షాంశం ఉత్తరం
రేఖాంశం తూర్పు

వన్యమృగాలు[మార్చు]

కార్గిల్ జిల్లా పలు అంతరించిపోతున్న జంతువులకు ( చిరుత, టిబెటన్ తోడేలు, హిమాలయన్ గోధుమవర్ణ ఎలుగుమంటి, ఆసియాటిక్ ఐబెక్స్, లఢక్ ఉరియల్, మస్క్ డీర్, పికాస్, , హేర్స్) పుట్టినిల్లుగా ఉంది. " వరల్డ్స్ విల్డ్ లైఫ్ " ఐశ్వర్య మహేశ్వరి " అరుదైన మంచు చిరుత ఈ ప్రాంతాలలో స్వేచ్ఛగా విహరుస్తుంది. 1999లో కార్గిల్ యుద్ధం తరువాత ఈ ప్రాంతంలో నివసిస్తున్న పక్షులు అంతరించి పోతున్నాయి.[12][13][14] అంతరించిపోతున్న పక్షులలో బ్లాక్ నెక్డ్ మాగ్పి, హౌస్ స్పారో, హూపో వంటివి ముఖ్యమైనవి.[15] రోస్‌ఫించెస్, రెడ్-బిల్డ్ కఘ్స్, ఈస్టర్న్ చిఫ్‌చిఫ్, కామన్ శాండ్ పైపర్ , యురేపియన్ గోల్డ్ ఫించ్ వంటి ప్రాణులు ఇక్కడ సాధారణంగా వేసవి కాలంలో కనిపిస్తుంటాయి.[16] అంతేకాక ఈ ప్రాంతం అంతటా ఇండియన్ ఆర్మీకి చెందిన ఆశ్వసైన్యం తిరుగాడుతూ ఉంటుంది.

పాలన[మార్చు]

కార్గిల్ నగరం పనోరమా చిత్రం

కార్గిల్ జిల్లాలో 9 బ్లాకులు ఉన్నాయి :

 • ద్రాస్
 • కార్గిల్
 • షర్గోల్
 • షేకర్-చిక్తాన్
 • గుండ్ మంగల్పూర్ - ట్రెస్పోన్
 • శంకూ
 • టియాసురూ
 • జంస్కర్
 • లంగ్నక్[17]

ఒక్కో బ్లాకులో పలు పంచాయితీలు ఉన్నాయి.

రాజకీయాలు[మార్చు]

కార్గిల్ జిల్లాలో 2 అసెంబ్లీలు (జంసర్ , కార్గిల్) ఉన్నాయి.[18] లఢక్ పార్లమెంటు నుండి ఎన్నికైన పార్మమెంటు సభ్యుడు హాజీ గులాం హాసన్ ఖాన్ స్వస్థలం కార్గిల్. జిల్లాలో జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాంఫరెంస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, జమ్మూ & కాశ్మీర్ పీపుల్స్ డెమెక్రటిక్ పార్టీ, భారతీయ జనతాపార్టీ, లఢక్ యూనియన్ టెర్రిటరీ ఫ్రంట్, ( ఇది ప్రస్తుతం భారతీయ జనతాపార్టీలో విలీనం అయింది) మొదలైన రాజకీయ పార్టీలున్నాయి.

లడక్ అటానిమస్ హిల్ కౌంసిల్[మార్చు]

2013లో జిల్లాలో ప్రాంతీయంగా ఎన్నికచేయబడిన లఢక్ ఆటానిమస్ హిల్ డెవెలెప్మెంట్ కౌంసిల్, కార్గిల్ ఏర్పాటు చేయబడింది. ఇందులో 30 కౌంసిల్స్ ఉంటాయి. వీరిలో 26 మంది నేరుగా ఎన్నికచేబడతారు. 4 సభ్యులు మైనారిటీ , మహిళాప్రతినిధులు నియమించబడతారు. ఈ కౌంసిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కౌంసిల్ , 4 ఎగ్జిక్యూటివ్ కౌంసిలర్ నాయకత్వంలో పనిచేస్తుంది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ కౌంసిల్‌కు కాబినెట్ మంత్రి హోదా, , 4 ఎగ్జిక్యూటివ్ కౌంసిల్‌కు సహాయ మంత్రి హోదా ఉంటుంది. 2013 ఆగస్టు 22 న లఢక్-కే 3 వ జనరల్ ఎన్నికలు జరిగాయి.[19] జిల్లా ఓటర్ల సంఖ్య 79.65%.[20] ఎన్నికల ఫలితంగా హంగ్ గవర్నమెంటు ఏర్పడగా తరువాత జరిగిన సంప్రదింపుల ఫలితంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ , నేషనల్ కాంఫరెంస్ పార్టీల సంకీర్ణంతో ప్రభుత్వం ఏర్పడింది. ఈ ఎన్నికలలో ఇస్లామియా స్కూల్ కార్గిల్ 11 స్థానాలు సంపాదించింది.[21]

చిత్రమాలిక[మార్చు]

సరిహద్దులు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "View Population: Kargil". Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 27 March 2012.
 2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 3. "Financial Express". Financial Express. 2012-06-12. Retrieved 2013-08-16.
 4. Pak considers Kargil-Skardu bus March 15, 2007 NDTV
 5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Saint Lucia 161,557 July 2011 est.
 6. "Census of India: District Profile". Censusindia.gov.in. Archived from the original on 2013-11-13. Retrieved 2013-08-16.
 7. M. Paul Lewis, ed. (2009). "Balti: A language of Pakistan". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
 8. Janet Rizvi. (1996). Ladakh: Crossroads of High Asia. Second Edition, pp. 210-211. Oxford University Press, Delhi. ISBN 0-19-564546-4.
 9. "Anjuman Jamiatul Ulama Houzai Elmiya Madrasa Asna Asharia Islamia School Kargil". Archived from the original on 2016-02-21. Retrieved 2014-06-30.
 10. "IKMT Kargil". Archived from the original on 2014-06-16. Retrieved 2014-06-30.
 11. 11.0 11.1 Kargil: what might have happened By Javed Hussain October 21, 2006, Dawn
 12. "India, Pakistan and the Snow Leopard: Javed Naqi". Kafila. 2012-01-28. Retrieved 2013-08-16.
 13. Voices from Frozen Land (2012-01-24). "Javed Naqi: Human-Wildlife Conflict in Kargil: Precipitation of India-Pakistan Rivalry?". Javed-naqi.blogspot.in. Archived from the original on 2014-08-10. Retrieved 2013-08-16.
 14. "Human-Wildlife Conflict in Kargil: Precipitation of India-Pakistan Rivalry? | Bargad... बरगद". Bargad.org. 2012-02-01. Archived from the original on 2014-08-08. Retrieved 2013-08-16.
 15. "The Indian Encyclopaedia - Google Books". Books.google.co.in. Retrieved 2013-08-16.
 16. Alok Bhave (2011-10-06). "Nature watch: Trip to Cold Desert - Ladakh Part2". Alokbhave.blogspot.in. Archived from the original on 2012-04-20. Retrieved 2013-08-16.
 17. Statement showing the number of blocks in respect of 22 Districts of Jammu and Kashmir State including newly Created Districts Archived 2008-09-10 at the Wayback Machine dated 2008-03-13, accessed 2008-08-30
 18. "ERO's and AERO's". Chief Electoral Officer, Jammu and Kashmir. Archived from the original on 2008-10-22. Retrieved 2008-08-28.
 19. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-09-17. Retrieved 2014-06-30.
 20. "3rd General LAHDCK Election - 2013". Archived from the original on 2013-09-17. Retrieved 2014-06-30.
 21. "Uncertainty looms over Kargil council CEC election - Hindustan Times". Archived from the original on 2014-03-01. Retrieved 2014-06-30.

వెలుపలి లింకులు[మార్చు]