లక్షద్వీప్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్, సదరన్ నేవల్ కమాండ్ వైస్ అడ్మిరల్ గిరీష్ లూథ్రా, తన పర్యటన సందర్భంగా లక్షద్వీప్, మినికాయ్ (LAM) దీవులలో భద్రతా యంత్రాంగ సమీక్ష చిత్రం.

లక్షద్వీప్ జిల్లా, కేంద్రపాలితప్రాంతం మొత్తం ఒక జిల్లాగా పరిగణించబడుతుంది.[1] [2]జిల్లా ముఖ్యపట్టణం కవరట్టి అంతకుముందు జిల్లాను నాలుగు తహసీల్స్‌గా విభజించారు. ప్రస్తుతం 10 సబ్ డివిజన్లు ఉన్నాయి. సబ్ డివిజనల్ అధికారులు 8 ద్వీపాలలో అభివృద్ధి కార్యకలాపాలను నిర్వహిస్తారు.మినికోయ్, అగట్టిలలో సబ్ డివిజన్ డిప్యూటీ కలెక్టర్ కింద ఉంది. అడ్మినిస్ట్రేషన్ సెక్రటేరియట్ 1964 మార్చిలో కోజికోడ్ నుండి కవరట్టికి మార్చబడింది. వివిధ ప్రణాళిక పథకాలు, నిధుల కేటాయింపుల పెరుగుదలతో, విభాగం వికేంద్రీకరణ అవసరాన్ని గుర్తించి, తదనుగుణంగా 1972 లో కొత్త కార్యాలయాలు సృష్టించబడ్డాయి. డిపార్ట్‌మెంటల్ కార్యాలయాలు విడిగా పనిచేస్తున్నప్పటికీ, అడ్మినిస్ట్రేషన్ సెక్రటేరియట్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటేరియట్ భవనం నుండి కాంపాక్ట్ యూనిట్‌గా ఒకే ఫైల్ సిస్టమ్ కింద పనిచేస్తాయి

రెవెన్యూ, ల్యాండ్ సెటిల్మెంట్, లా అండ్ ఆర్డర్ వంటి జిల్లా పరిపాలన పరిధిలోకి వచ్చే అంశాలు కలెక్టర్ కమ్ డెవలప్‌మెంట్ కమిషనర్ పరిధిలో ఉన్నాయి. అతను జిల్లాకు మేజిస్ట్రేట్‌గా పనిచేస్తాడు . లక్షద్వీప్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎల్‌డిసిఎల్) మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిని నియమించి, సెక్రటరీ, పే అండ్ అకౌంట్స్ పోస్టును సృష్టించిన తరువాత, కలెక్టర్ కమ్ డెవలప్‌మెంట్ కమిషనర్‌తో సహా ఈ సీనియర్ అధికారులలో అభివృద్ధి విభాగాలు కేటాయించబడ్డాయి. కేటాయించిన విభాగాలకు వారు కార్యదర్శులుగా నియమించారు.

శాంతిభద్రతల అమలుకు సంబంధించి జిల్లా మేజిస్ట్రేట్‌కు ఒక అదనపు జిల్లా మేజిస్ట్రేట్, పది ఎగ్జిక్యూ్టివ్ మేజిస్ట్రేట్‌లు సహాయం చేస్తారు. లక్షద్వీప్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ గా లక్షద్వీప్ పోలీసులు అడ్మినిస్ట్రేటర్ ఆధ్వర్యంలో, నియంత్రణలో ఉన్నారు. జిల్లా పరిధిలో 9 పోలీస్ స్టేషన్లు, 2 పోలీస్ అవుట్ పోస్టులు, 1 పోలీస్ ఎయిడ్ పోస్టులలో, లక్షద్వీప్ పోలీసులు 349 మంది సిబ్బందిని మంజూరు చేశారు. పోలీసు సూపరింటెండెంట్ ఫోర్సు హెడ్, పోలీసు బలంతో పాటు శాంతిభద్రతల నిర్వహణ కోసం, కేంద్ర ప్రభుత్వం భారత రిజర్వ్ బెటాలియన్ సంస్థను లక్షద్వీప్, దాద్రా నగర్ హవేలి, డామన్ డయ్యూ కోసం ప్రత్యేకంగా పెంచింది. ఐఆర్‌బికి చెందిన 355 మంది సిబ్బంది లక్షద్వీప్‌లోని వివిధ ద్వీపాల్లో ఉన్నారు. లా అండ్ ఆర్డర్ మెషినరీని బలోపేతం చేయడానికి లక్షద్వీప్ మెరైన్ పోలీస్, లక్షద్వీప్ హోమ్ గార్డ్సును కూడా ఉన్నారు, కవరట్టిలో నావల్ డిటాచ్మెంట్ & కోస్ట్ గార్డ్ యూనిట్లు ఏర్పాటు చేయబడ్డాయి. మినీకోయ్ ద్వీపంలో కూడా నావల్ డిటాచ్మెంట్ పనిచేస్తోంది.

సమాజ అభివృద్ధి పథకాలను అమలు చేసే ఉద్దేశ్యంతో ఈ భూభాగాన్ని ఐదు కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లుగా విభజించారు, కవరట్టి, అమిని, ఆండ్రోట్, మినికోయ్, కిల్తాన్‌లతో బ్లాక్ హెడ్ క్వార్టర్స్‌గా విభజించారు. పరిపాలనను ప్రజలకు దగ్గరగా తీసుకురావడానికి ఎనిమిది సబ్ డివిజన్ అధికారులు, ఇద్దరు డిప్యూటీ కలెక్టర్లు అగట్టి సబ్ డివిజన్లో భాగమైన బంగారం (దీవి) మినహా అన్ని జనావాస ద్వీపాలలో పోస్ట్ చేయబడ్డారు. వారు సంబంధిత ద్వీపాల బ్లాక్ డెవలప్మెంట్ / అదనపు బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్లుగా కూడా పనిచేస్తారు.[1]

లక్షద్వీప్ జిల్లా గణాంకాలు

[మార్చు]

జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం లక్షద్వీప్ జిల్లాలోని మొత్తం జనాభా 64,473. వీరిలో 33,123 మంది పురుషులు కాగా, 31,350 మంది మహిళలు ఉన్నారు. 2011 నాటికి లక్షద్వీప్ జిల్లాలో మొత్తం 11,574 కుటుంబాలు నివసిస్తున్నాయి. లక్షద్వీప్ జిల్లా మొత్తం సగటు లింగ నిష్పత్తి 1000: 946గా ఉంది.[3] 2011 జనాభా లెక్కల ప్రకారం లక్షద్వీప్ జిల్లా మొత్తం జనాభాలో 78.1% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 21.9% గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత 91.9% కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 91.6%గా ఉంది. లక్షద్వీప్ జిల్లాలోని పట్టణ ప్రాంతాల లింగ నిష్పత్తి 945 కాగా, గ్రామీణ ప్రాంతాల లింగ నిష్పత్తి 952గా ఉంది.లక్షద్వీప్ జిల్లాలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 7255 మంది ఉన్నారు. ఇది మొత్తం జనాభాలో 11%గా ఉంది. 0-6 సంవత్సరాల మధ్య 3797 మగ పిల్లలు, 3458 ఆడ పిల్లలు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం లక్షద్వీప్ బాలల లైంగిక నిష్పత్తి1000: 911గా ఉంది. ఇది లక్షద్వీప్ జిల్లాలోని సగటు లింగ నిష్పత్తి (946) కన్నా తక్కువ.లక్షద్వీప్ జిల్లా మొత్తం అక్షరాస్యత 91.85%గా ఉంది. లక్షద్వీప్ జిల్లాలో పురుషుల అక్షరాస్యత రేటు 84.6%కాగా, మహిళా అక్షరాస్యత రేటు 78.25%గా ఉంది.[4]

మతాల వారీగా జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం లక్షద్వీప్ జిల్లాలో ఆధారంగా మొత్తం జనాభాలో హిందూ మతానికి చెందినవారు 1,788 (2.77%) మంది ఉన్నారు.వారిలో పురుషులు 1,603 మందికాగా, స్త్రీలు 185 మంది ఉన్నారు.ముస్లిం మతానికి చెందినవారు 62,268 (96.58%) మంది ఉన్నారు.వారిలో పురుషులు 31,166 మందికాగా, స్త్రీలు 31,102 మంది ఉన్నారు.క్రిస్టియన్ మతానికి చెందినవారు 317 (0.49%) మంది ఉన్నారు.వారిలో పురుషులు 286 మందికాగా, స్త్రీలు 31 మంది ఉన్నారు.సిక్కు మతానికి చెందినవారు 8 (0.01%) మంది ఉన్నారు.వారిలో పురుషులు 6 మందికాగా, స్త్రీలు 2 ఇద్దరు ఉన్నారు.బౌద్ధులు 10 (0.02%) మంది ఉన్నారు.వారిలో పురుషులు 9 మందికాగా, స్త్రీలు 1 ఒక్కరు మాత్రమే ఉన్నారు.జైనులు 11 (0.02%) మంది ఉన్నారు.వారిలో పురుషులు 6 మందికాగా, స్త్రీలు 5 గురు ఉన్నారు.ఇతర మతాలువారు 7(0.01%) గురు మంది ఉండగా,వారిలో 6 గురు పురుషులు, ఒక్కరు స్త్రీ మాత్రమే ఉంది.మతాలు గుర్తించనివారు 64 (0.1%) మంది ఉండగా,వారిలో పురుషులు 41 మంది, స్త్రీలు 23 మంది ఉన్నారు.[4]

జనాభా సాంద్రత

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం లక్షద్వీప్ జిల్లా మొత్తం వైశాల్యం 30 చ. కి.మీ. జిల్లా జన సాంద్రత చదరపు కిలోమీటరుకు 2,149 మంది.22 చదరపు కి.మీ. విస్తీర్ణం పట్టణ ప్రాంతంలో ఉండగా 8 చదరపు కి.మీ. గ్రామీణ ప్రాంతంలో ఉంది.[4]

జనావాస దీవులు

[మార్చు]

లక్షద్వీప్ జిల్లాలో 10 ఉప విభాగాలున్నాయి.[5][6]

  1. ఆగట్టి
  2. అమిని
  3. ఆండ్రొట్ట్
  4. బిట్ర
  5. చెట్లాట్
  6. కద్మత్
  7. కల్పేని
  8. కవరట్టి
  9. కిల్తన్
  10. మినీకాయ్

ఆర్ధిక రంగం

[మార్చు]

లక్షద్వీప జాతీయ ఉత్పత్తి ప్రస్తుత విలువలలో 60 మిలియన్ల అమెరికా డాలర్లు. లక్షద్వీపములో కొంత ఆర్థిక అసమానలు ఉన్నాయి. దారిద్యరేఖకు దిగువన కొంత మంది ప్రజలు ఉన్నారు. కొబ్బరిపీచు ఉత్పత్తి, పీచుతో చేయబడే ఉత్పత్తులు ఇక్కడి ప్రధాన ఆదాయ వనరులు. ఇక్కడ 5 కాయిర్ ఫైబర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. 5 ఉత్పత్తి వివరణ కేంద్రాలు, ఏడు ఫైబర్ కర్లింగ్ యూనిట్స్ ప్రభుత్వం చేత నడపబడుతున్నాయి. ఈ కేంద్రాలు కాయిర్ ఫైబర్ కర్లింగ్, కాయిర్ యార్న్, కారిడార్ ఉత్పత్తి చేస్తున్నాయి.

పర్యాటక రంగం

[మార్చు]

ఇక్కడి ప్రశాంత వాతావరణానికి శాస్త్రీయ పరిశోధనలకు అనువైన సముద్రతీలాల వలన లక్షద్వీఅపములు భారతీయులకు 1974 నుండి ప్రముఖ పర్యాటక ఆకర్షణ కలిగి ఉంది. పర్యాటకరంగం లక్షద్వీపాలకు గుర్తించతగినంత ఆదాయాన్ని ఇస్తుంది. పర్యాటకరంగం నుండి వచ్చే ఆదాయం క్రమంగా అభివృద్ధిచెందుతూ ఉంది. స్థలాభావంచేత ఈ ద్వీపాలలో ఫ్యాక్టరీలు నడపడానికి వీలు కాదు కనుక ప్రభుత్వంకూడా పర్యాటకరంగాన్ని ప్రోత్సహిస్తుంది. బంగరమ్, కడమట్ ద్వీపాలు పర్యాటకులను ఆకర్షించడంలో ప్రత్యేకత కలిగి ఉన్నాయి. అంతర్జాతీయ పర్యాటకుల ప్రత్యేక ఆకర్షణగా బంగరమ్ ద్వీపం తీర్చిదిద్దబడుతుంది. సముద్రతీర వృక్షసంపద పర్యాటకులకు కనువిందు చేస్తున్నది. నీటి క్రీడలు స్కూబాడైవింగ్, విండ్ సర్ఫింగ్, స్నార్క్లింగ్, సర్ఫింగ్, కయాకింగ్, కేనోయింగ్, వాటర్ స్కీయింగ్, యాచ్టింగ్, ధైర్యసాహసాలతో కూడుకున్న సముద్రంలో నైట్ వాయేజ్ వంటి జలక్రీడలు పర్యాటక ఆకర్ష్ణలో ప్రబలమైనవి. సముద్రం పూర్తిగా ఉగ్రరూపం ధరించే నైరుతీ ఋతుపవన కాలంలో తప్ప సంవత్సరమంతా పర్యాటనకు అనుకూలమే.

ఒక్కో దీవిలో పర్యటిస్తూ ఇక ఈ దీవిని చూసింది చాలనిపించి ఫెర్రీ ఎక్కి మరో దీవిలోకి అడుగుపెడితే అక్కడ పర్యాటకులు వాటర్ సర్ఫింగ్‌కి సిద్ధమవుతుంటారు. నీటి మీద అలలతో పోటీ పడుతూ ఎగిరి గంతులేయడాన్ని టెలివిజన్ ప్రోగ్రామ్‌లో చూసి ఆనందించడమే తప్ప స్వీయానుభవం లేని వాళ్లకు అలలతో ఆడుకోవాలనే సరదాతోపాటు కొంచెం భయం కూడా వేస్తుంది. కానీ ఇక్కడి ట్రైనర్లు ‘సర్ఫింగ్ బోర్డు మీద ఎలా నిలబడాలి, అల వస్తున్న దిశకు అనుగుణంగా ఎలా కదలాలి...’ వంటి ప్రాథమిక విషయాల్లో శిక్షణనిచ్చి నీటి మీదకు పంపిస్తారు. పొరపాటున నీటిలో పడిపోయినా వెంటనే బయటకు తీసుకొస్తారు.

ఇతర ఉత్పత్తులు

[మార్చు]

లక్షద్వీప్ దీవుల్లో మనుష్య సంచారం లేని చిన్న చిన్న దిబ్బల్లాంటివి లెక్కలేనన్ని ఉంటాయి. కొన్ని దీవుల్లోకి పగడాల వేటగాళ్లు మాత్రమే అడుగుపెడుతుంటారు. ఈ కేంద్రపాలిత ప్రాంతానికి రాజధాని కరావట్టి దీవి. లక్షద్వీప్ దీవుల్లోని స్థానికులకు చేపల వేట, కొబ్బరి తోటల సాగు, కొబ్బరి పీచు తీయడం ప్రధాన వృత్తులు. అత్యంత ఖరీదైన ‘ట్యూనా ఫిష్’ ఇక్కడి నుంచి పెద్దమొత్తంలో ఎగుమతి అవుతుంది. ఇప్పుడు పర్యాటకం పెద్ద పరిశ్రమ అయింది. కొన్ని దీవులను పూర్తిగా టూరిస్టు రిసార్టులు, వాటర్ స్పోర్ట్స్ కోసమే డెవలప్ చేశారు. ఇలాంటి దీవుల్లో నివసించేవాళ్లంతా పర్యాటకశాఖ ఉద్యోగులే ఎక్కువగా ఉంటారు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 https://web.archive.org/web/20120512103644if_/http://lakshadweep.nic.in/KL_Administration.html
  2. "List of Districts of Lakshadweep (LD) | villageinfo.in". villageinfo.in. Retrieved 2023-01-22.
  3. "Lakshadweep District Population Religion - Lakshadweep, Lakshadweep Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in. Archived from the original on 2023-01-22. Retrieved 2023-01-22.
  4. 4.0 4.1 4.2 "Lakshadweep District Population Religion - Lakshadweep, Lakshadweep Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in. Archived from the original on 2020-09-25. Retrieved 2020-12-08.
  5. "Lakshadweep district, Lakshadweep Village Directory @VList.in". vlist.in. Retrieved 2020-12-08.
  6. "Lakshadweep District Village Information Directory of Lakshadweep". vill.co.in. Archived from the original on 2023-01-22. Retrieved 2023-01-22.

వెలుపలి లంకెలు

[మార్చు]