అక్షాంశ రేఖాంశాలు: 28°36′50″N 77°12′32″E / 28.6140°N 77.2089°E / 28.6140; 77.2089

కొత్త ఢిల్లీ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
New Delhi district
New Delhi district is located in ఢిల్లీ
New Delhi district
New Delhi district
Location in Delhi, India
Coordinates: 28°36′50″N 77°12′32″E / 28.6140°N 77.2089°E / 28.6140; 77.2089
Country India
Union TerritoryDelhi
HeadquartersNew Delhi
Languages
 • OfficialHindi, English
Time zoneUTC+5:30 (IST)
Nearest cityNew Delhi

న్యూ ఢిల్లీ జిల్లా, భారతదేశం, ఢిల్లీ రాష్ట్రం లోని పరిపాలనా జిల్లా. [1] దీని జిల్లా ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఇది భారతదేశ రాజధాని. దాని సరిహద్దులలో ఉన్న న్యూఢిల్లీ పేరు దీనికి పెట్టబడింది. ఇది పూర్తిగా ఢిల్లీ మహానగరంలో ఒక భాగం. ఈ జిల్లా 1997లో స్థాపించబడింది.[2] [3] అయితే 2012లో ఢిల్లీ జిల్లాలను పునర్నిర్మించే సమయంలో దీని సరిహద్దులు గణనీయంగా మారాయి [4]

భౌగోళిక శాస్త్రం

[మార్చు]

న్యూఢిల్లీ జిల్లా ఢిల్లీలోని నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (ఎన్.సి.టి)లోని మూడు పురపాలక సంఘాలు, [5] అవి న్యూఢిల్లీ, ఢిల్లీ కంటోన్మెంట్, ఢిల్లీ నగరపాలక సంస్థ ప్రాంతాలతో విస్తరించి ఉంది.ఇది కేంద్రంగా ఉన్న లుటియన్స్ ఢిల్లీని కవర్ చేస్తుంది. ఎన్.సి.టి. నైరుతి సరిహద్దు గురుగ్రామ్ వరకు విస్తరించి ఉంది. [6] ఎన్.సి.టి.లోని ఇతర 10 జిల్లాలలో మాదిరిగానే పరిపాలనా సౌలభ్యం కోసం, చాణక్యపురి, ఢిల్లీ కంటోన్మెంట్, వసంత్ విహార్ అనే మూడు తహసీల్‌లుగా విభజించారు.. [7]

చరిత్ర

[మార్చు]

న్యూ ఢిల్లీ జిల్లా 1997లో స్థాపించబడింది, ఎన్.సి.టి. పూర్వపు ఒకే జిల్లా 9 జిల్లాలుగా విభజించబడింది.[8] అప్పటి సరిహద్దులలో, జిల్లా 35 కిమీ² విస్తరించి ఉంది.[9] 2012లో ఢిల్లీ జిల్లాల సరిహద్దులను పునర్నిర్మించినప్పుడు, న్యూ ఢిల్లీ జిల్లా విస్తీర్ణం గణనీయంగా పెద్దదిగా మారింది.[10] ఇప్పుడు పొరుగు రాష్ట్రమైన హర్యానా సరిహద్దు వరకు విస్తరించింది.[11]

గణాంకాలు

[మార్చు]
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
19611,43,846—    
19711,64,702+14.5%
19811,44,115−12.5%
19911,68,669+17.0%
20011,79,112+6.2%
20111,42,004−20.7%

న్యూ ఢిల్లీ జిల్లాలో 3 తాలూకాలు, 0 గ్రామాలు, 4 పట్టణాలు ఉన్నాయి. 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం, న్యూఢిల్లీ జిల్లాలో 33,208 గృహాలు ఉన్నాయి. జిల్లా లోని జనాభా 1,42,004. అందులో పురుషులు 77,942 కాగా, స్త్రీలు 64,062. మంది ఉన్నారు. 0-6 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లల జనాభా 12.760, మంది ఉన్నారు. ఇది మొత్తం జనాభాలో 8.99% ఉంది.[12][13]

న్యూ ఢిల్లీ జిల్లా లింగ నిష్పత్తి రాష్ట్ర లింగనిష్పత్తి 868తో పోలిస్తే దాదాపు 822 ఉంది.ఇది ఢిల్లీ రాష్ట్ర ఎన్.సి.టి. సగటు. న్యూ ఢిల్లీ జిల్లా అక్షరాస్యత రేటు 80.41% అందులో పురుషులు అక్షరాస్యత రేటు 84.27% శాతం, స్త్రీల అక్షరాస్యత రేటు 75.71% శాతం ఉంది.న్యూ ఢిల్లీ మొత్తం వైశాల్యం 35 చ.కి.మీ, జనాభా సాంద్రత చ.కి.మీకి 4057. మొత్తం జనాభాలో, జనాభాలో 100% మంది పట్టణ ప్రాంతంలో 0% గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నారు. న్యూ ఢిల్లీ జిల్లాలో మొత్తం జనాభాలో 23.41% షెడ్యూల్డ్ కులానికి చెందినవారు ఉన్నారు. 0 మంది షెడ్యూల్డ్ తెగల వారు ఉన్నారు.[13]

జిల్లా జనాభా మతం ప్రకారం

[మార్చు]
  • మొత్తం జనాభా 1,42,004
  • హిందూ 1,24,482 - 87.66%
  • ముస్లింలు 8,480 - 5.97%
  • క్రిస్టియన్ 4,852 - 3.42%
  • సిక్కులు 2,933 -2.07%
  • జైనులు 6,79 -0.48%
  • బౌద్ధులు 3,12 -0.22%
  • మతం పేర్కొనబడనివారు - 2,00 0.14%
  • ఇతర మతాలు 66 - 0.05%

మూలాలు

[మార్చు]
  1. New Delhi district, retrieved 2 January 2021
  2. Poonam Sharma: Structure and Growth of Mega City: An Inter-industry Analysis. Concept Publishing, 2010, ISBN 978-8180696756, p. 56
  3. Districts of Delhi, delhionline.com, retrieved 2 January 2022
  4. Geeta Gupta: Delhi gets two more revenue districts: Southeast, Shahdara, Indian Express, 12 September 2012, retrieved 2 January 2022
  5. Prabhash K. Dutta: Beyond MCD election 2017: How 5 municipal corporations manage Delhi, why everyone can't vote tomorrow, India Today, 22 April 2017, retrieved 2 January 2022
  6. New Delhi district: Map of the district, retrieved 2 January 2022
  7. New Delhi district: Map of the district, retrieved 2 January 2022
  8. Districts of Delhi, delhionline.com, retrieved 2 January 2022
  9. Directorate of Census Operations, Delhi: Census of India 2011: N.C.T of Delhi.
  10. Geeta Gupta: Delhi gets two more revenue districts: Southeast, Shahdara, Indian Express, 12 September 2012, retrieved 2 January 2022
  11. New Delhi district: Map of the district, retrieved 2 January 2022
  12. "New Delhi District Population Census 2011 - 2021 - 2023, Delhi literacy sex ratio and density". www.census2011.co.in. Retrieved 2023-08-19.
  13. 13.0 13.1 "Demography | District New Delhi, Government of NCT of Delhi | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-08-19.

వెలుపలి లంకెలు

[మార్చు]