ఉత్తర మధ్య అండమాన్ జిల్లా
ఉత్తర మధ్య అండమాన్ జిల్లా | |
---|---|
ఉత్తర మధ్య అండమాన్ జిల్లా | |
Coordinates: 12°55′12″N 92°54′00″E / 12.92000°N 92.90000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అండమాన్ నికోబార్ దీవులు |
రాజధాని | మాయా బందర్ |
Time zone | UTC+05:30 (IST) |
ఉత్తర మధ్య అండమాన్ జిల్లా, బంగాళాఖాతంలోని భారతదేశ కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవులకు చెందిన మూడు జిల్లాలలో ఇది ఒకటి. దీని జిల్లా ప్రధాన కార్యాలయం మాయాబందర్ పట్టణంలో ఉంది. ఈ జిల్లా 3251.85 చ.కి.మీ.విస్తీర్ణంలో విస్తరించి ఉంది.
చరిత్ర
[మార్చు]పూర్వపు అండమాన్ జిల్లాను విభజించడం ద్వారా 2006 ఆగస్టు 18న ఈ జిల్లా సృష్టించబడింది.[1] ఇందులో పూర్వ జిల్లాలోని మాయాబందర్ ఉపవిభాగానికి చెందిన మూడు తాలూకాలు ఉన్నాయి.
భౌగోళికం
[మార్చు]ఉత్తర మధ్య అండమాన్ జిల్లా విస్తీర్నం 3,227 చ.కి.మీ 1,246 (చ.మైళ్లుకు సమానం).[2]
జనాభా
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఉత్తర మధ్య అండమాన్ జిల్లాలో 105,597 జనాభా ఉంది, [3] ఇది సమారుగా టోంగా దేశానికి సమానం.[4] ఇది భారతదేశంలో 640 ర్యాంకులలో 614 వ ర్యాంకును కలిగిఉంది. జిల్లాలో జనాభా సాంద్రత చ.కి.మీ.కు 32 మంది (83 / చ. మై). 2001-2011 దశాబ్దంలో దాని జనాభా వృద్ధి రేటు -0.07%. ఉత్తర మధ్య అండమాన్ జిల్లాలో ప్రతి 1000 మంది పురుషులకు లింగ నిష్పత్తి 925గా ఉంది. అక్షరాస్యత రేటు 84.25%గా ఉంది. జిల్లా జనాభాలో ఎక్కువ శాతం బెంగాలీలు .
చారిత్రక జనాభా వివరాలు
[మార్చు]చారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% p.a. |
1901 | 6,999 | — |
1911 | 6,807 | −0.28% |
1921 | 6,874 | +0.10% |
1931 | 7,417 | +0.76% |
1941 | 8,225 | +1.04% |
1951 | 7,317 | −1.16% |
1961 | 18,901 | +9.96% |
1971 | 35,605 | +6.54% |
1981 | 58,716 | +5.13% |
1991 | 84,312 | +3.68% |
2001 | 1,05,613 | +2.28% |
2011 | 1,05,597 | −0.00% |
ఆధారం:[5] |
భారత జనాభా లెక్కల ప్రకారం ఉత్తర మధ్య అండమాన్ జిల్లాలో 1901 నుండి 2011 వరకు జనాభా పెరుగదల, తరుగుదల వివరాలు ఈ దిగువ పట్టికలో వివరించిన ప్రకారం ఉన్నాయి.[5]
మాట్లాడే భాషలు
[మార్చు]నికోబార్ దీవులలో ఎక్కువగా మాట్లాడే భాష బెంగాలీ. 2011 జనాభా లెక్కల ప్రకారం, జిల్లా జనాభాలో 53.79 శాతం బెంగాలీ మొదటి భాషగా మాట్లాడతారు. తరువాత హిందీ (17.06%), తమిళం (6.46%), కురుఖ్ (6.17%), తెలుగు (5.94%), మలయాళం (3.5%) ), నికోబారీస్ (0.57%), ఇతరులు 4.97% శాతం ఇతర భాషలను మాట్లాడుతారు.[6][6]
మయన్మార్‌లోని కైన్ స్టేట్ నుండి వచ్చిన సినో-టిబెటన్ జాతి సమూహానికి చెందిన కరెన్ ప్రజలు, మాయాబందర్, డిగ్లిపూర్ తహసిల్స్‌లోని ఎనిమిది గ్రామాల్లో సుమారు 2000 మంది ఉన్నారు.[7]
రెవెన్యూ విభాగాలు
[మార్చు]ఈ జిల్లా 2006 ఆగస్టు 18న పూర్వపు అండమాన్ జిల్లాను విభజించడం ద్వారా సృష్టించబడింది.[8] wఇందులో ఈ పూర్వ జిల్లాలోని మాయాబందర్ సబ్-డివిజన్‌లోని 3 తహసీల్స్, డిగ్లిపూర్, మాయాబందర్, రంగత్ ఉన్నాయి.
మాయాబందర్ తహసీల్
[మార్చు]- వెబ్,
- డియోపూర్,
- లాటావ్,
- లక్నో (బర్మాడెరా),
- కర్మతాంగ్ -9
- కర్మతాంగ్ -10
డిగ్లిపూర్ తహసీల్
[మార్చు]- బోరాంగ్
- చిపోన్
రంగత్ తహసీల్
[మార్చు]ఈ తహసీల్లో 79 గ్రామాలు, బకుల్తాలా అనే జనగణన పట్టణం ఉన్నాయి.[9]
ఆర్థిక వ్యవస్థ
[మార్చు]2010 నాటికి, జిల్లా ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు బియ్యం (సుమారు 6500 హెక్టార్లు), కొబ్బరికాయలు (3600 హెక్టార్లు), రబీ పప్పులు (2900 హెక్టార్లు), అరేకా గింజలు (1300 హెక్టార్లు), అరటిపండ్లు (650 హెక్టార్లు).[10]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
- ↑ Srivastava, Dayawanti (2010). "States and Union Territories: Andaman Islands: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1208. ISBN 978-81-230-1617-7.
- ↑ "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Tonga 105,916 July 2011 est.
- ↑ 5.0 5.1 Decadal Variation In Population Since 1901
- ↑ 6.0 6.1 "C-16 Population By Mother Tongue". Census of India 2011. Office of the Registrar General.
- ↑ Sameera Maiti (2004), "The Karen – A Lesser Known Community of the Andaman Islands" (PDF), ISLANDS of the WORLD VIII International Conference - "Changing Islands – Changing Worlds", 1–7 November 2004, Kinmen Island (Quemoy), Taiwan[permanent dead link]
- ↑ Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
- ↑ "Villages & Towns in Rangat Tehsil of North and Middle Andaman, Andaman and Nicobar Islands". www.census2011.co.in. Retrieved 2023-09-26.
- ↑ Government of India (2011), Andaman and Nicobar Islands Statistical Hand-Book - North and Middle Andaman, 2007-08 To 2009-10