Jump to content

లేహ్ జిల్లా

వికీపీడియా నుండి
లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్, లేహ్
రకం
రకం
లేహ్ జిల్లా అటానమస్ హిల్ కౌన్సిల్
నాయకత్వం
చీఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్
రిగ్జిన్ స్పాల్ బార్
సీట్లు30 కౌన్సిలర్లు
ఎన్నికలు
ఓటింగ్ విధానం
26 (బహుళత్వ ఓటింగ్ విధానం)
ఓటింగ్ విధానం
4 నామినేట్ చేయబడినవారు
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
సమావేశ స్థలం
లేహ్ జిల్లా
వెబ్‌సైటు
http://leh.nic.in/
సోమోరిరి సరస్సు

లఢక్ ప్రాంతంలోని 2 జిల్లాలలో లేహ్ ఒకటి. రెండవది పశ్చిమ సరిహద్దులో కార్గిల్ జిల్లా ఉంది. జిల్లా వైశాల్యం 45,110 చ.కి.మీ. భారతదేశంలో వైశాల్యపరంగా లేహ్ జిల్లా 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో గుజరాత్ రాష్ట్రంలోని కుట్చ్ జిల్లా ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో గంచా జిల్లా (గిల్జిత్- బలిస్థాన్), స్వల్పంగా క్సింజియాంగ్ (వయా కరకోరం పాస్, (చైనా), తూర్పు సరిహద్దులో అక్సాయ్ చిన్ , టిబెట్, పశ్చిమ సరిహద్దులో కార్గిల్ జిల్లా, దక్షిణ సరిహద్దులో లాహౌల్ స్పితి జిల్లా ఉన్నాయి. జిల్లా కేంద్రంగా లేహ్ పట్టణం ఉంది. కార్గిల్ , లఢక్ అడ్మినిస్ట్రేటివ్ జిల్లాలు ఏర్పాటు చేయబడిన సమయంలో 1979 జూలై 1 వరకు లఢక్ ప్రాంతం మొత్తం లేహ్ ఆధీనంలో ఉంది.[1] 2011 గణాంకాలను అనుసరించి ఈ జిల్లా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఈ జిల్లా జనసాంధ్రతలో 2వ స్థానంలో ఉంది.[2] లేహ్ నగరం ఈ జిల్లాకు పరిపాలనా కేంద్రంగా ఉంది

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 147,104, [2]
ఇది దాదాపు. సెయింట్ లూసియా దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 599 వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 3 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 25.48%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 583: 1000 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 80.48%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

2001 గణాంకాలను అనుసరించి బౌద్ధులు 77.3%, ముస్లిములు 13.8% , 8.2%.

పాలనా విభాగాలు

[మార్చు]

లేహ్ జిల్లాలో 17 బ్లాకులు ఉన్నాయి: నుబ్రా, పనమిక్, ఖల్సిల్ (ఖల్స్తే ), సస్పోల్, లేహ్, చౌచాట్, ఖరు, డర్బక్, న్యోమా, టర్తక్, వన్ల (ఖల్సి), సింగే లాలొక్, చుంతంగ్, హెచ్‌క్యు, రప్షొ, స్క్యుర్బచన్, తిక్సె[4]ప్రతి బ్లాకులో కొన్ని పంచాయితీలు ఉంటాయి.

లేహ్ జిల్లా 6 విభాగాలుగా విభజించబడింది:

  • నుబ్రా తెహ్సిల్
  • ఖల్సి తెహ్సిల్
  • లేహ్ తెహ్సిల్
  • ఖరు తెహ్సిల్
  • డర్‌బక్ తెహ్సిల్
  • న్యోమా తెహ్సిల్

రాజకీయాలు

[మార్చు]

లేహ్ జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి: నోబ్రా , లెహ్.[5]

అటానిమస్ హిల్ కౌన్సిల్

[మార్చు]

" లేహ్ జిల్లా లడక్ అటానిమస్ హిల్ డెవెలెప్మెంట్ కౌంసిల్,లేహ్ " ఎల్.ఎ.హెచ్.డి.సి. 1995లో స్థాపించబడింది. .[6]

సరిహద్దులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Muslim Precedence Politics - How it operates in Ladakh". Archived from the original on 2005-08-27. Retrieved 2014-06-30.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Saint Lucia 161,557 July 2011 est.
  4. Statement showing the number of blocks in respect of 22 Districts of Jammu and Kashmir State including newly Created Districts Archived 2008-09-10 at the Wayback Machine dated 2008-03-13, accessed 2008-08-30
  5. "ERO's and AERO's". Chief Electoral Officer, Jammu and Kashmir. Archived from the original on 2008-10-22. Retrieved 2008-08-28.
  6. http://leh.nic.in/lahdc.htm

వెలుపలి లికులు

[మార్చు]