అక్సాయ్ చిన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

Coordinates: 35°7′N 79°8′E / 35.117°N 79.133°E / 35.117; 79.133మూస:Chinese

అక్సాయ్ చిన్, ఆక్సాయ్ క్విన్, అకేసాయిక్విన్ లేదా అకేసాయి క్విన్ (హిందీలో: अक्साई चिन, సరళీకరించబడిన చైనీస్: 阿克赛钦, గా కూడా పిలువబడేది, పశ్చిమ కున్లున్ పర్వతాలకు ఉత్తరంగా టిబెట్ పీఠభూమి యొక్క వాయవ్య ప్రాంతంలో ఉన్న వివాదాస్పద ప్రదేశం.[1] ఇది జిన్జియాంగ్ స్వయంపాలిత ప్రాంతం యొక్క హోటన్ ప్రెఫెక్చర్ లోని హోటన్ కౌంటీలో భాగంగా పూర్తిగా పీపుల్స్ రిపబ్లిక్ అఫ్ చైనాచే పరిపాలించబడుతుంది. ఏదేమైనా, భారతదేశం దీనిని తన రాష్ట్రమైన జమ్మూ మరియు కాశ్మీర్ లో భాగమని ప్రస్తావిస్తుంది.

భౌగోళిక స్థితి[మార్చు]

భారతదేశం మరియు పీపుల్స్ రిపబ్లిక్ అఫ్ చైనా మధ్య ఉన్న రెండు ముఖ్యమైన వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలలో అక్సాయ్ చిన్ ఒకటి, మరొకటి భారతదేశ పరిపాలనలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్, దీనిని చైనా దక్షిణ టిబెట్ గా ప్రస్తావిస్తుంది. భారతదేశం అక్సాయ్ చిన్ ను, జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రంలో తూర్పువైపున ఉన్న చివరి ప్రాంతంగా ప్రస్తావిస్తుంది. జమ్మూ మరియు కాశ్మీర్ లోని భారత-పాలిత ప్రాంతాలను అక్సాయ్ చిన్ నుండి వేరు చేసే రేఖను లైన్ అఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) అంటారు మరియు ఇది ప్రస్తుతం చైనీస్ అక్సాయ్ చిన్ ప్రస్తావన రేఖతో ఏకీభవిస్తోంది (అనగా, అక్సాయ్ చిన్ యొక్క పశ్చిమ సరిహద్దు)

అక్సాయ్ చిన్ (సాహిత్యపరమైన అర్ధం "తెల్ల (అక్) బ్రూక్ (సాయి) మార్గం (చిన్)"[ఆధారం కోరబడింది]) లో అధిక భాగం అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న విశాలమైన ఎడారి, ఇది కొన్ని ఉప్పునీటి సరస్సులను సముద్రమట్టానికి 4,800 మీటర్లు (15,700 అడుగులు) నుండి 5,500 మీటర్లు (18,000 అడుగులు) ఎత్తులో కలిగి ఉంది. ఇది 37,250 square కిలోmetre (14,380 sq mi) ప్రాంతంలో విస్తరించి ఉంది.

భౌగోళికంగా, అక్సాయ్ చిన్, టిబెట్ పీఠభూమిలో భాగంగా ఉంది. అక్సాయ్ చిన్ మరియు భారతదేశ-నియంత్రిత కాశ్మీర్ లకు మధ్య నైరుతి దిశలో, కారకోరం శ్రేణి వాస్తవ సరిహద్దు (లైన్ అఫ్ యాక్చువల్ కంట్రోల్) గా ఉంది. ఈ సరిహద్దు మధ్యభాగంలో ఉన్న హిమానీనద శిఖరాలు 6,950 మీటర్లు (22,800 అడుగులు) ఎత్తుకు చేరతాయి.

ఉత్తరదిశలో, కున్లున్ శ్రేణి, అక్సాయ్ చిన్ ను హోటన్ కౌంటీలోని మిగిలిన ప్రాంతం ఉన్న టరిమ్ హరివాణం నుండి వేరు చేస్తుంది. ఇటీవలి కాలంలోని ఒక సవివరమైన చైనీయుల మానచిత్రం ప్రకారం, హోటన్ ప్రెఫెక్చుర్ లో కున్లున్ శ్రేణి ద్వారా ఏ విధమైన రహదారులు లేవు మరియు కేవలం ఒక త్రోవ మాత్రం హిందుతాష్ మార్గం మీదుగా వెళుతుంది.[2]

సోడా మైదానంగా వ్యవహరించబడే అక్సాయ్ చిన్ యొక్క ఉత్తర భాగం, అక్సాయ్ చిన్ యొక్క అతి పెద్ద నది అయిన కరకోష్ని కలిగి ఉంది, అనేక హిమానీనదాలు కరిగిన నీటితో ఏర్పడిన ఈ నది, వాయవ్య దిశలో కున్లున్ ను దాటి పిషన్ కౌంటీలోకి ప్రవేశించి అక్కడనుండి టరిమ్ హరివాణాన్ని చేరుతుంది, అక్కడ ఇది కారకక్స్ మరియు హోటన్ కౌంటీలలో ముఖ్యమైన నీటివనరులలో ఒకటిగా ఉంటుంది.

ఈ ప్రదేశం యొక్క తూర్పు భాగం అనేక చిన్న అంత్య జలవనరులున్న (ఎండోర్హీయిక్) హరివాణాలను కలిగి ఉంది. వీటిలో అత్యంత పెద్దది అక్సాయ్ చిన్ సరస్సు (Chinese: 阿克赛钦湖; pinyin: Akesaiqin Hu), దీనికి అదేపేరుతో గల నది నుండి నీరు అందించబడుతుంది.

ఈ ప్రాంతంలో జనావాసాలు, స్థిర స్థావరాలు దాదాపుగా లేవు మరియు హిమాలయాలు మరియు కారకోరం భారతదేశ ఋతుపవన వర్షాలను అడ్డగించడం వలన అవపాతం చాల తక్కువగా ఉంటుంది.

చరిత్ర[మార్చు]

ఇవి కూడా చూడండి: Origins of the Sino-Indian border dispute

అక్సాయ్ చిన్ చారిత్రకంగా హిమాలయన్ రాజ్యమైన లడఖ్ లో భాగంగా ఉంది[ఆధారం కోరబడింది] 19వ శాతాబ్దంలో స్థానిక నామ్గ్యాల్ వంశం పరిపాలన నుండి డోగ్రాలు మరియు కాశ్మీర్ యొక్క రాచరిక రాజ్యంలో కలుపబడేవరకు ఇది కొనసాగింది. ఏదేమైనా, కాశ్మీర్ యొక్క రాచరిక రాజ్యానికి ఈశాన్య దిశగా బ్రిటిష్ వారు మధ్యవర్తిత్వం వహించిన సరిహద్దును చైనీయులు ఎప్పుడూ అంగీకరించలేదు.[3]

చైనీయుల మానచిత్రాలలో చైనీయులదిగా పేర్కొనబడిన రహదారిని, చైనీయులు అక్సాయ్ చిన్ గుండా నిర్మించినట్లు భారతదేశం కనుగొనడం, 1962 చైనా-భారత యుద్ధం యొక్క ప్రధాన కారణాలలో ఒకటి. 1954లో ప్రారంభించి, భారతదేశం తన అధికారక సర్వే అఫ్ ఇండియా మానచిత్రాలలో, అక్సాయ్ చిన్ కు దానికదే ఒక కచ్చితమైన సరిహద్దు రేఖను, ఏ విధమైన సైనిక లేదా ఇతర ఆక్రమణ లేకుండా చూపుతోంది. 1954కు ముందు, ఈ ప్రదేశంలో భారతదేశ మానచిత్రాలు నిర్వచింపబడని మరియు అనిశ్చిత సరిహద్దు రేఖలను చూపాయి. టిబెట్ మరియు జిన్జియాంగ్ లను కలిపే చైనా జాతీయ రహదారి 219, అక్సాయ్ చిన్ లోని ఏ విధమైన పట్టణాల నుండి పోదు, అతి చిన్న కేంద్రమైన టియాన్షుహై వంటి (మొదలైన 4,850 మీ (15,910 అడుగులు)) కొన్ని సైనిక కేంద్రాలు మరియు ట్రక్ లు నిలుపు స్థలాలను మాత్రం కలిగి ఉంది. ఈ రహదారి ఈ ప్రదేశం యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతను పెంచుతుంది.

అక్సాయ్ చిన్ ప్రస్తుతం పీపుల్స్ రిపబ్లిక్ అఫ్ చైనాచే జిన్జియాంగ్ లో హోటన్ ప్రెఫెక్చూర్ లోని హోటన్ కౌంటీలో భాగంగా పరిపాలించబడుతుంది. లభ్యమైన స్వల్ప సమాచారం ప్రకారం అక్సాయ్ చిన్ కొందరు స్థానిక బౌద్ధమతం అవలంబించేవారిని కలిగి ఉంది[ఆధారం కోరబడింది], అయితే టిబెట్ మరియు జిన్జియాంగ్ ల మధ్య వర్తకం కారణంగా కొందరు ముస్లిం ఉయ్ఘుర్స్ కూడా ఈ ప్రదేశంలో నివసిస్తూ ఉండవచ్చు.[ఆధారం కోరబడింది] భారతదేశం ఈ ప్రాంతాన్ని జమ్మూ మరియు కాశ్మీర్ ప్రాంతంలోని లడఖ్ జిల్లాలో భాగంగా ప్రతిపాదిస్తోంది. ఈ వివాదంలోని రెండు పక్షాలు లైన్ అఫ్ యాక్చువల్ కంట్రోల్ ని గౌరవించడానికి అంగీకరించాయి.

ట్రాన్స్-కారకోరం ట్రాక్ట్ ను పీపుల్స్ రిపబ్లిక్ అఫ్ చైనాకు ఇచ్చిన 1963 భారత-పాకిస్తానీ సరిహద్దు ఒప్పందం (ఇప్పటికీ ఇది భారతదేశంతో కాశ్మీర్ యొక్క ఉత్తరపు చివరి ప్రాంతంగా ప్రకటించబడుతుంది), అక్సాయ్ చిన్ స్థాయిపై ఏ విధమైన ప్రకటన చేయలేదు, తరువాత రూపొందిన భారత-పాకిస్తానీ ఒప్పందాలు కూడా ఏ ప్రకటన చేయలేదు. ట్రాన్స్-కారకోరం ట్రాక్ట్ మరియు అక్సాయ్ చిన్ ఒకదానితో ఒకటి సరిహద్దులను కలిగి లేవు. 1963 చైనా-పాకిస్తాన్ సరిహద్దు రేఖ కారకోరం పాస్ వద్ద, అక్సాయ్ చిన్ కు అత్యంత పశ్చిమాగ్రంలో తొమ్మిది కిలోమీటర్లు పశ్చిమంగా ముగిసిందనే వాస్తవం, 1947 నుండి భారతదేశ ఆక్రమణలో ఉన్న భూభాగంలో తూర్పు దిశగా రేఖను గీయడం ఫలితం లేనిదని ఈ రెండు దేశాలు భావించాయని, మరియు కారకోరం పాస్ కు పశ్చిమ విభాగంలో వలె భూమిపై భౌతిక విభజన అసాధ్యమని సూచించింది. ఇంటర్ నెట్ ఊహలు దీనికి విరుద్ధంగా ఉన్నప్పటికీ, 1963 ఒప్పందం యొక్క రచన అక్సాయ్ చిన్ గురించి ఏ విధమైన సూచన చేయలేదు.[4]

వ్యూహాత్మక ప్రాముఖ్యత[మార్చు]

చైనా జాతీయ రహదారి 219 అక్సాయ్ చిన్ ద్వారా వెళుతూ టిబెట్ స్వయంప్రతిపత్త ప్రాంతంలోని లాజి మరియు జిన్జియాంగ్ లను కలుపుతుంది. ఈ ప్రాంతంలో దాదాపుగా జనావాసాలు మరియు వనరులు లేకపోయినప్పటికీ, అది టిబెట్ మరియు జిన్జియాంగ్ లను కలపడం వలన చైనాకు వ్యూహాత్మకంగా ప్రముఖంగా మారింది. 1951లో ప్రారంభమైన ఈ రహదారి నిర్మాణం 1957లో పూర్తయింది. 1962 నాటి చైనా-భారతదేశ యుద్ధానికి కారణమైన వాటిలో ఈ రహదారి నిర్మాణం కూడా ఒకటి.[ఆధారం కోరబడింది]

చైనీయుల భూభాగ నమూనా[మార్చు]

జూన్ 2006లో, గూగుల్ ఎర్త్ సేవ లోని సాటిలైట్ ఇమేజరీ 1:150[5] స్కేల్ భూభాగ నమూనాను [2] అక్సాయ్ చిన్ కు తూర్పుగా మరియు టిబెట్ పక్కన బయట పెట్టింది, ఇది చైనాలోని నిన్జియ స్వయంప్రతిపత్త ప్రాంత రాజధాని యిన్చువాన్ కు 35 కిలోమీటర్లు (22 మైళ్ళు) ఆగ్నేయంగా, హుయన్గ్యటాన్ పట్టణ సమీపంలో నిర్మించబడింది.[6] ప్రక్క ప్రక్కన ఉండే ఒక దృశ్య పోలిక అక్సాయ్ చిన్ యొక్క సవివరమైన నకలును, స్థావరంలో తెలియచేస్తుంది.[7] ఈ 900 మీ × 700 మీ (3,000 అడుగులు × 2,300 అడుగులు)[ఆధారం కోరబడింది] నమూనా ఎరుపు-కప్పు కలిగిన భవనాల వరుసలు, పెద్ద సంఖ్యలో ఆలివ్-రంగు ట్రక్కులు మరియు ఉన్నత ప్రదేశాలలో పరిశీలనా స్థావరాలు మరియు ఒక పెద్ద సమాచార టవర్ కలిగిన విశాలమైన ఆవరణ వంటి అనువైన సౌకర్యాలను కలిగి ఉంది. ఈ విధమైన భూభాగ నమూనాలు, సాధారణంగా స్వల్ప పరిమాణంలోనే అయినప్పటికీ, సైనిక శిక్షణ మరియు అనుకరణలలో వాడతారు.

నింగ్జియలోని స్థానిక అధికారులు వారి అక్సాయ్ చిన్ నమూనా 1998 లేదా 1999లో నిర్మించిన, ట్యాంక్ శిక్షణా స్థలంగా పేర్కొంటారు.[5]

సూచనలు[మార్చు]

  1. "Aksai Chin: China's disputed slice of Kashmir". CNN.com. 24 May 2002. Retrieved 2007-07-23. 
  2. జిన్జియాంగ్ ఉయ్ఘుర్ అటానమస్ రీజియన్ రోడ్ అట్లాస్ (中国分省公路丛书:新疆维吾尔自治区), పబ్లిష్డ్ బై 星球地图出版社 జింగ్క్యు డిటు చుబాన్షే , 2008, ISBN 978-7-80212-469-1. మాప్ అఫ్ హోటన్ ప్రెఫెక్చూర్, పేజీలు . 18-19.
  3. [1]
  4. http://www.kashmir-information.com/LegalDocs/SinoPak.html Sino-Pakistan Frontier Agreement
  5. 5.0 5.1 "Chinese X-file not so mysterious after all". Melbourne: The Age. 2006-07-23. Retrieved 2008-12-17. 
  6. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెబ్ సైట్
  7. గూగుల్ ఎర్త్ కమ్యూనిటీ పోస్టింగ్, 10 ఏప్రిల్ 2007

బాహ్య లింకులు[మార్చు]

మూస:Territorial disputes in East and South Asia