ఓపెన్ హ్యాండ్ మాన్యుమెంట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఓపెన్ హ్యాండ్ మాన్యుమెంట్
Open Hand Monument in Chandigarh.jpg
చండీగఢ్ లోని ఓపెన్ హ్యాండ్ మాన్యుమెంట్
కళాకారుడులె కార్బుజియె
సంవత్సరం1964 (1964)
కొలతలు26 m (85 ft)
ప్రదేశంచండీగఢ్
Coordinates30°45′32″N 76°48′26″E / 30.758974°N 76.807348°E / 30.758974; 76.807348Coordinates: 30°45′32″N 76°48′26″E / 30.758974°N 76.807348°E / 30.758974; 76.807348

ఓపెన్ హ్యాండ్ మాన్యుమెంట్ చండీగఢ్ లోని ఇండియన్ యూనియన్ టెరిటరీ ఉన్న ఒక సింబాలిక్ నిర్మాణం. ఇది ప్రముఖ ఆర్కిటెక్ట్ లె కార్బుజియె ద్వారా రూపొందించబడింది. ఇది చండీగఢ్ ప్రభుత్వం యొక్క చిహ్నం (the hand to give and the hand to take). ఓపెన్ హ్యాండ్ మాన్యుమెంట్ శాంతి, శ్రేయస్సు మరియ మానవజాతి యొక్క ఐక్యతను సూచిస్తుంది. లె కార్బుజియె యొక్క అనేక ఓపెన్ హ్యాండ్ శిల్పాలలో ఇది అతిపెద్దది. ఇది 26 మీటర్ల (85 అడుగుల) ఎత్తులో ఉంది. లోహంతో 14 మీటర్ల (46 అడుగుల) ఎత్తులో వానెస్ నిర్మాణం, 50 చిన్నటన్నులు (100,000 lb) బరువుతో గాలిలో తిరిగే విధంగా రూపొందించబడింది.[1][2][3]

సింబాలిజం[మార్చు]

ఓపెన్ హ్యాండ్ లె కార్బుజియె ప్రధాన శిల్పం. శాంతి మరియు సయోధ్య చిహ్నంగా దీనిని భావించాడు. ఇచ్చి పుచ్చకోవడానికి ప్రతీకగా దీనిన అభివర్ణించాడు. "సెకండ్ మెషిన్ యుగం" యొక్క పునరావృత ఆలోచనతో లె కార్బుజియె దీనిని నిర్మించాడు.

నిర్మించిన ప్రదేశం[మార్చు]

ఓపెన్ హ్యాండ్ శివాలిక్ పర్వతాల హిమాలయ పర్వత శ్రేణుల నేపథ్యంలో, చండీగఢ్ కాపిటల్ కాంప్లెక్స్ లోని 1వ సెక్టార్ లో ఉంది.[3][4] ఓపెన్ హ్యాండ్ ఉన్న చోటికి రోడ్డు, రైలు మరియు వాయు సేవలు కూడా అనుసంధానం చేయబడివున్నాయి. NH 22 (అంబాలా - కల్కా - సిమ్లా - ఖబ్, కిన్నౌర్) మరియు NH 21 (చండీగఢ్ - మనాలి) లు ఈ నగరంమీదుగానే ఉన్నాయి.

ఓపెన్ హ్యాండ్ శిల్పం 26 మీటర్ల (85 అడుగుల) ఎత్తులో 9 మీటర్లు (41 అడుగులు × 30 అడుగులు) 12.5 ల కందకం పైన ఉంటుంది.[5] 50 టన్నుల బరువుతో 14 మీటర్ల (46 అడుగులు ) ఎత్తు కలిగిన ఒక కాంక్రీట్ వేదిక మీద లోహంతో తయారుచేసిన నిర్మాణం. ఇది ఒక ఎగిరే పక్షిలా కనిపిస్తుంది.[6] ఈ శిల్పం నంగల్ లోని భాక్రా నంగల్ మేనేజ్మెంట్ బోర్డ్ వర్క్ లో షీట్ మెటల్ లో చేతితో తయారుచేయబడింది. ఉపరితలంపై మెరుగుపెట్టిన ఉక్కుతో కప్పబడి, గాలి ద్వారా తిరిగేందుకు బాల్ బేరింగ్స్ తో ఒక ఇనుప కడ్డీ పైన అమర్చబడి ఉంటుంది.[5]

మూలాలు[మార్చు]

ఆధార గ్రంథాలు[మార్చు]

  • Betts, Vanessa; McCulloch, Victoria (10 February 2014). Delhi & Northwest India Footprint Focus Guide: Includes Amritsar, Shimla, Leh, Srinagar, Kullu Valley, Dharamshala. Footprint Travel Guides. ISBN 978-1-909268-75-3.
  • Corbusier, Le; Žaknić, Ivan (1997). Mise Au Point. Yale University Press. ISBN 978-0-300-06353-0.
  • Jarzombek, Mark M.; Prakash, Vikramaditya (4 October 2011). A Global History of Architecture. John Wiley & Sons. ISBN 978-0-470-90248-6.
  • Sharma, Sangeet (26 September 2010). Corb's Capitol: a journey through Chandigarh's architecture. A3 foundation. ISBN 978-81-8247-245-7.
  • Shipman, Gertrude (5 October 2014). Ultimate Handbook Guide to Chandigarh : (India) Travel Guide. MicJames. pp. 7–. GGKEY:32JTRTZ290J.