వీర్-జారా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వీర్-జారా
వీర్-జారా.jpg
వీర్-జారా చిత్ర పోస్టర్
దర్శకత్వంయష్ చోప్రా
దృశ్య రచయితఆదిత్య చోప్రా
కథఆదిత్య చోప్రా
నిర్మాతయష్ చోప్రా
ఆదిత్య చోప్రా
తారాగణంషారుక్ ఖాన్
ప్రీతీ జింటా
రాణీ ముఖర్జీ
మనోజ్ బాజ్పేయి
ఛాయాగ్రహణంఅనీల్ మెహతా
కూర్పురితేష్ సోనీ
సంగీతంమదన్ మోహన్
సంజీవ్ కొహ్లీ
పంపిణీదారుయాష్ రాజ్ ఫిల్మ్స్
విడుదల తేదీ
12 నవంబర్ 2004
సినిమా నిడివి
192 నిముషాలు
దేశంభారత్
భాషలుహిందుస్తానీ ( హిందీ, ఉర్దూ )
బడ్జెట్₹25 కోట్లు[1]
బాక్స్ ఆఫీసు₹94.22 కోట్లు[2]

వీర్-జారా యష్ చోప్రా దర్శకత్వం వహించిన యాష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ కింద నిర్మితమైన బాలీవుడ్ రొమాంటిక్ చిత్రం. ఈ చిత్రంలో షారుక్ ఖాన్, ప్రీతీ జింటా ముఖ్య పాత్రధారులు. రాణీ ముఖర్జీ, మనోజ్ బాజ్పేయి, కిర్రోన్ ఖేర్, దివ్యా దత్తా, అనుపమ్ ఖేర్ సహాయక పాత్రధారులు. అనుభవజ్ఞులైన నటులు అమితాబ్ బచ్చన్, హేమమాలిని ఈ చిత్రంలోని ప్రత్యేక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం యొక్క కథ, మాటలు ఆదిత్య చోప్రా రాసారు.

భారతదేశం, పాకిస్తాన్ మధ్య వివాదాలకు వ్యతిరేకంగా నిర్మింపబడిన, ఈ రొమాంటిక్ చిత్రం 22 సంవత్సరాలుగా విడిపోయి జీవించిన ఒక భారత వైమానిక దళ పైలెట్, దళ నాయకుడు వీర్ ప్రతాప్ సింగ్, లాహోర్లో ఒక పేరుమోసిన రాజకీయ కుటుంబానికి చెందిన ఒక పాకిస్తానీ అమ్మాయి, జారా హయాత్ ఖాన్ ల యొక్క దురధృష్టవంతమైన ప్రేమకథ. సామియా సిద్దికి అనే ఒక పాకిస్తానీ మహిళా న్యాయవాది, జైలులో ఉన్న వీర్ ప్రతాప్ ను కనుక్కుని, కన్నీళ్ళు పెట్టించే అతని కథను విన్న తర్వాత, అతనిని జైలు జీవితం నుండి విముక్తి చెయ్యడానికి ప్రయత్నిస్తుంది.

ముందుగానే ఊహించిన విధంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹94.22 కోట్లకు ($ 15 మిలియన్లు) [2][3], పైగా వసూళ్ళు చేసి భారతీయ, అంతర్జాతీయ బాక్స్ ఆఫీసుల వద్ద ఆ ఏడాదికి అత్యధిక వసూళ్లు చేసిన బాలీవుడ్ చిత్రంగా నిలిచింది . ఇంకా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రముఖ చలన చిత్రోత్సవాలలో ప్రదర్శింపబడింది . జావెద్ అక్తర్ యొక్క లిరిక్స్, మదన్ మోహన్ యొక్క కూర్పుల వల్ల ఈ చిత్రం యొక్క సంగీతం కూడా అత్యంత విజయవంతమైంది. థియేటర్లలో విడుదలైన తర్వాత, వీర్ -జారా విమర్శకుల నుండి ఎక్కువగా అనుకూల సమీక్షలను అందుకుంది. ఈ చిత్రం జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం వద్ద అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డు, ఉత్తమ చిత్రంగా ఫిలింఫేర్ అవార్డు, సహా ప్రధాన భారతీయ చిత్ర అవార్డు వేడుకల్లో పలు అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రం ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ యాష్ చోప్రాను దర్శకుడిగా తీసుకువచ్చింది. యాదృచ్ఛికంగా అతడి ఏడు సంవత్సరాల క్రితం నాటి చివరి చిత్రం దిల్ తో పాగల్ హై కూడా షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా నిర్మింపబడింది.

కథ[మార్చు]

కథలోని ఎక్కువ భాగం జైల్లో బందీగా ఉన్న వీర్ ప్రతాప్ సింగ్ (షారుఖ్ ఖాన్) న్యాయవాది అయిన సామియా సిద్దికీ (రాణీ ముఖర్జీ) కి చెప్పే ఫ్లాష్ బ్యాక్ లోనే నడుస్తుంది.

వీర్ యొక్క కథనం పాకిస్తానీ అమ్మాయి అయిన జారా హయాత్ ఖాన్ (ప్రీతీ జింతా) భారతదేశానికి ప్రయాణించడంతో మొదలౌతుంది. ఆమెది లాహోర్లోని ఒక రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం. ఆమె తన ఆలనా-పాలనా చూసిన సిక్కు ఆయా బెబె (అమ్మ లేదా బామ్మ అనే దానికి పంజాబీ పదం) (జోహ్రా సెహగల్) చనిపోయిన తరవాత ఆమె ఆఖరి కోరిక మేరకు భారతదేశంలోని సిక్కులకు పవిత్ర స్థలమైన కిరత్పూర్లోని ఆమె పూర్వీకుల అస్థికలు కలిసిన సట్లెజ్ నదిలో ఆమె అస్థికలు కూడా కలపడానికి వెళ్తుంది. భారతదేశానికి చేరుకుంటున్నప్పుడు ఆమె వస్తున్న బస్సు ప్రమాదవసాత్తూ అదుపుతప్పి బోల్తా పడుతుంది. భారతీయ వైమానిక దళ పైలెట్ స్క్వాడ్రన్ లీడర్ వీర్ ప్రతాప్ సింగ్ ఆమెను కాపడటానికి వచ్చి అమెకు బెబె యొక్క అంత్యక్రియలు చెయ్యడానికి సహాయం చేస్తాడు.

తారాగణం[మార్చు]

సంగీతం[మార్చు]

పాటలు[మార్చు]

సంఖ్య. పాటసింగర్(లు) నిడివి
1. "తేరే లియే"  లతా మంగేష్కర్, రూప్ కుమార్ రాథోడ్ 05:34
2. "మే యహా హూ"  ఉదిత్ నారాయణ్ 04:57
3. "ఏసా దేశ్ హై మేరా"  లతా మంగేష్కర్, ఉదిత్ నారాయణ్, గురుదాస్ మన్న్, ప్రితా మజ్ముదర్ 07:10
4. "యే హమ్ ఆ గయా హై కహా"  లతా మంగేష్కర్, ఉదిత్ నారాయణ్ 05:45
5. "దో పల్"  లతా మంగేష్కర్, సోనూ నిగమ్ 04:27
6. "క్యూ హవా‌‌‍"  లతా మంగేష్కర్, సోనూ నిగం 06:14
7. "హం తో భాఈ జైసే"  లతా మంగేష్కర్ 04:19
8. "ఆయా తేరే దర్ పర్"  అహ్మద్ హుస్సేన్, మహమ్మద్ హుస్సేన్, మహమ్మద్ వకీల్ 07:53
9. "లోడీ"  లతా మంగేష్కర్, గురుదాస్ నారాయణ్, ఉదిత్ మన్న్ 06:55
10. "తుం పాస్ ఆ రహే హో"  లతా మంగేష్కర్, జగ్జీత్ సింగ్ 05:12
11. "జానే క్యూ"  లతా‌ మంగేష్కర్ 05:16

నిర్మాణం[మార్చు]

ప్రేక్షకుల , విమర్శకుల స్పందన[మార్చు]

అవార్డులు[మార్చు]

డీవీడీ విడుదల[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Veer Zaara". Retrieved 25 December 2010.[permanent dead link]
  2. 2.0 2.1 "Top Lifetime Grossers Wచిత్రం.de". Boxofficeindia.com. Archived from the original on 21 అక్టోబర్ 2013. Retrieved 25 December 2010. Check date values in: |archive-date= (help)
  3. Jha, Subhash K (14 September 2004). "The Rediff Interview". Rediff.com. Retrieved 16 August 2008.
"https://te.wikipedia.org/w/index.php?title=వీర్-జారా&oldid=3436445" నుండి వెలికితీశారు