దివ్యా దత్తా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దివ్యా దత్తా
2017లో 'సొనాట' స్క్రీనింగ్‌లో దత్తా
జననం (1977-09-25) 1977 సెప్టెంబరు 25 (వయసు 46)
లూథియానా,పంజాబ్, ఇండియా
వృత్తి
 • నటి
 • మోడల్
క్రియాశీల సంవత్సరాలు1994–ప్రస్తుతం
బంధువులుదీపక్ బహ్రీ (అంకుల్)

దివ్యా దత్తా (జననం 1977 సెప్టెంబరు 25) [1] ప్రముఖ భారత నటి, మోడల్. బాలీవుడ్ లోనూ, పాలీవుడ్ (పంజాబీ సినిమా) లోనూ మంచి కెరీర్ తో రాణించారు ఆమె. మలయాళం, ఇంగ్లీష్ భాషల్లోనూ కొన్ని సినిమాలు చేశారు. వివిధ సినీ రకాల్లో నటించడంలో ఆమె ప్రసిద్ధురాలు. పార్లల్ సినిమా రంగంలో దివ్య ప్రముఖ నటిగా కొనసాగుతున్నారు.

పంజాబ్ లోని లుధియానా లో పుట్టి, పెరిగారు దివ్యా. 1994లో ఇష్క్ మే జీనా ఇష్క్ మే మర్నా సినిమాతో బాలీవుడ్ లో తెరంగేట్రం చేశారు ఆమె. ఆ తరువాత 1995లో డ్రామా వీర్గటి సినిమాలో కథానాయిక పాత్రలో నటించారు దివ్య. భారత విభజన ప్రభావంతో  తన సిక్కు భర్తతో విడిపోయిన ముస్లిం భార్య పాత్రలో షాహీద్-ఈ-మొహొబ్బత్ బూటా సింగ్ సినిమాలో నటించారు ఆమె. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ప్రధాన పాత్రల్లో నటిస్తూనే సహాయనటిగా  నటిస్తూ వచ్చారామె. వీర్-జీరా సినిమాలో షబ్బూ పాత్రలో ఆమె  నటనకు ఫిలింఫేర్ తో సహా ఎన్నో ప్రతిష్ఠాకర పురస్కారలకు నామినేషన్లు లభించాయి. అలాగే 2008లో విడుదలైన వెల్ కం టు సజ్జన్ పూర్ సినిమాలోని ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. ఢిల్లీ-6 సినిమాలోని ఆమె నటనకు ఐఫా ఉత్తమ సహాయ నటి పురస్కారం పొందారు. 

2011లో స్టాన్లీ కా డబ్బా, 2012లో హీరోయిన్ సినిమాల్లో నటించారు దివ్యా. 2013లో గిప్పీ సినిమాలోనూ, భాగ్ మిల్కా భాగ్ సినిమాలో మిల్కా సింగ్ అక్క ఇష్రి కౌర్ పాత్రలోనూ ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది. ఆమె తరువాత చేసిన సినిమాల్లోని నటనకు ఐఫా ఉత్తమ సహాయ నటి అవార్డుతో సహా ఎన్నో అవార్డులు, నామినేషన్లు లభించాయి. ఇప్పటివరకు ఆమె రెండు అంతర్జాతీయ సినిమాలతో సహా 60 సినిమాల్లో నటించారు.[2][3] సంవిధాన్ సీరియల్ లో కాంగ్రెస్ నాయకురాలు పూర్ణిమా బెనర్జీ పాత్రలో కూడా నటించారు దివ్య.

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

25 సెప్టెంబరు 1977న పంజాబ్ లోని లుధియానాలో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు దివ్యా. దివ్య 7వ ఏట ఆమె తండ్రి చనిపోయారు. ఆమెనూ, ఆమీ సోదరుణ్ణీ ఆమె తల్లి డాక్టర్.నళినీ ఒంటి చేత్తో పెంచారు. ఆమె తల్లి ప్రభుత్వ అధికారి, డాక్టర్ గా పనిచేసేవారు. ఆమె తల్లి గురించి దివ్యా మాట్లాడుతూ "ధైర్యవంతురాలైన అధికారి", ఇంటి దగ్గర మాత్రం సరదా తల్లి అని వివరించారు.[4] 2013లో గిప్పీ సినిమాలో సింగిల్ మదర్ గా పప్పీ పాత్ర నటించాల్సి వచ్చినప్పుడు ఆమె తల్లి నుండి ప్రేరణ పొంది నటించారు ఆమె. తమ తల్లి రాసిన కవితల్ని దివ్య, తాన సోదరుడు కలసి పుస్తకంగా ప్రచురించారు.

దివ్యా చిన్నతనంలో పంజాబ్ విప్లవం జరిగినప్పుడు తన తల్లి దుపట్టా వెనకాల దాక్కునేవారట. తమను ఎవరూ చంపకూడదంటూ ప్రార్థించేవారట.[5] లుధియానాలోని సేక్రెడ్ హార్ట్ కాన్వెంట్ లో చదువుకున్నారు ఆమె.

మోడలింగ్ కెరీర్

[మార్చు]

సినిమాల్లోకి రాకముందు పంజాబీ భాషలో టీవీ యాడ్లలో నటించేవారు. 2001లో ఇంగ్లాండ్ లోని లండన్ కు చెందిన బసేమెంట్ జాక్స్ ల  రోమియో అనే మ్యూజిక్ వీడియోలో కనిపించారు దివ్య.

1994లో ఇష్క్ మే జీనా ఇష్క్ మే మర్నా సినిమాతో బాలీవుడ్ లో తెరంగేట్రం చేశారు దివ్య. 1995లో సురక్ష సినిమాలో బిందియా పాత్రలో సహాయ నటిగా నటించారు. ఈ సినిమా మంచి విజయాన్నే నమోదు చేసుకుంది. ఓవర్ సీస్ లో ముఖ్యంగా నార్వే, స్వీడన్ దేశాల్లో మంచి వసూళ్ళు సాధించిందీ చిత్రం. అదే సంవత్సరంలో సల్మాన్ ఖాన్ సరసన వీర్గటి సినిమాలో నటించారు. ఈ సినిమా ఫ్లాప్ అయింది.

ఆ తరువాతి సంవత్సరంలో మూడు సినిమాల్లో సహాయ నటి పాత్రల్లో కనిపించారు ఆమె. జాకీ ష్రాఫ్, నానా పటేకర్, మనీషా కొయిరాలా లతో కలసి అగ్ని సాక్షి చిత్రంలోనూ, గోవిందా, శిల్పాశెట్టిలతో కలసి చోటే సర్కార్ సినిమాలోనూ, రామ్ ఔర్ శ్యామ్ సినిమాలోనూ నటించారు దివ్య. 1997లో రాజాకీ ఆయేగీ బారాత్, దేవా వంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించారు. 1998లో ఘర్ వాలీ బాహర్ వాలీ, బడే మియాన్ చోటే మియాన్ లలో సహాయ నటి పాత్రల్లోనూ, ఇస్కీ టోపీ ఉస్కే సర్ లో ప్రధాన పాత్రలో నటించారు దివ్య.[6] ట్రైన్ టు పాకిస్థాన్ సినిమాలో కూడా నటించారు ఆమె.

1999–2003: పంజాబీలో మొదటి సినిమా

[మార్చు]

దివ్యా దత్తా (జననం 1977 సెప్టెంబరు 25) [1] ప్రముఖ భారత నటి, మోడల్. బాలీవుడ్ లోనూ, పాలీవుడ్ (పంజాబీ సినిమా) లోనూ మంచి కెరీర్ తో రాణించారు ఆమె. మలయాళం, ఇంగ్లీష్ భాషల్లోనూ కొన్ని సినిమాలు చేశారు. వివిధ సినీ రకాల్లో నటించడంలో ఆమె ప్రసిద్ధురాలు. పార్లల్ సినిమా రంగంలో దివ్య ప్రముఖ నటిగా కొనసాగుతున్నారు.

ఆ తరువాతి ఏడాది బసంతీ చిత్రంతో తన మొదటి నేపాలీ సినిమాలో నటించారు. 2001లో విక్రం భట్ దర్శకత్వంలో కసూర్ సినిమాలో మిస్.పాయల్ పాత్రలో నటించారు. అదే సినిమాలో లిసా రాయ్ కు డబ్బింగ్ చెప్పారు.[7] ఈ సినిమా కూడా హిట్ అయింది.

2002లో దివ్య ఆరు సినిమాల్లో నటించారు. నేపాలీ చిత్రం మాయా నమారాలో అతిథిపాత్రలో కనిపించారు. శక్తి:ది పవర్, సుర్:ది మెలోడీ ఆఫ్ లైఫ్, జిందగీ ఖూభ్ సూరత్ హై, 23rd మార్చి 1931:షాహీద్ సినిమాల్లో సహాయ నటి పాత్రల్లో నటించారు ఆమె. 23rd మార్చి 1931:షాహీద్ సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. 2003లో ప్రాణ్ జాయే పర్ షాన్ నా జాయే, బఘ్బాన్, లాక్:కార్గిల్ సినిమాల్లో నటించారు. ఈ సినిమాలు మంచి విజయాలను నమోదు చేసుకున్నాయి. ఆమె నటనకు కూడా విమర్శకుల నుండి ప్రశంసలు లభించాయి.[8] ఆ తరువాత విడుదలైన గోగ్గర్స్ పార్క్ లో ఆమె నటనకు మొదటిసారి స్టార్ గిల్డ్ ఉత్తమ సహాయ నటి పురస్కారానికి నామినేషన్ లభించింది.

2004–08: గుర్తింపు

[మార్చు]
2014 మే లో దివ్యా దత్తా

2004లో వీర్-జీరాలో షారూఖ్ ఖాన్, ప్రీతీ జింటా, రాణీ ముఖర్జీలతో నటించారు దివ్య. ప్రేమజంటను కలిపే పనిమనిషి పాత్రలో ఆమె నటించిన తీరుకు విమర్శకుల నుండి ప్రశంసల జల్లు కురిసింది. ఆ సినిమా కూడా కమర్షియల్ గా మంచి విజయం సాధించింది.[9][10] ఈ సినిమాలోని ఆమె నటనకు ఫిలింఫేర్ సహా ఎన్నో ప్రఖ్యాత అవార్డులకు ఉత్తమ సహాయ నటి నామినేషన్లు లభించాయి. అదే ఏడాది మర్డర్, అగ్నిపంఖ్, మనోజ్ పంజ్ దర్శకత్వంలో దేస్ హోయా పరదేస్ అనే పంజాబీ సినిమాలోనూ నటించారు దివ్య. శోభాయాత్ర, షాదీ కా లడ్డూ సినిమాల్లో సహాయ నటిగానూ నటించారు.

ఆ తరువాతి ఏడాది దిల్ కే పచే పచే, నామ్ గుమ్ జాయేగా, దుబాయ్ రిటర్న్ స్, సిల్సిలే, మిస్టర్ యా మిస్ వంటి సినిమాల్లో నటించారు సుభాష్ చంద్ర బోస్ జీవిత కథ ఆధారంగా తీసిన నేతాజీ సుభాష్ చంద్ర బోస్:ది ఫర్గాటెన్ హీరో సినిమాలో సుభాష్ సోదరి ఇలా బోస్ పాత్రలో నటించారు. ఈ సినిమాలోని ఆమె నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు లభించాయి.[11] తన కోరికలను అణుచుకోలేక, పితృస్వామ్య సమాజపు పోకడలను అనుసరించలేక ఇబ్బందిపడే ఒక రాజస్థానీ పెళ్ళికూతురు పాత్రలో సంయోగితా:ది బ్రైడ్ ఇన్ రెడ్ లో ఆమె నటించిన తీరు ఎన్నో ప్రశంసలు తెచ్చిపెట్టింది. ఫ్రాన్స్ దేశంలో కూడా ఈ సినిమా బాగా ఆడింది. ల్యాన్ ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రం అవార్డు అందుకొంది.[12] 2006లో దర్వాజా బంద్ రఖో, ఉమ్రావ్ జాన్ సినిమాల్లో నటించారు ఆమె. ఉమ్రావ్ జాన్ సినిమా ఫ్లాప్ అయినా దివ్యా పాత్రకు మంచి గుర్తింపు, ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి.[13][14]

ది లాస్ట్ లేర్ సినిమాలో అమితాబ్ బచ్చన్, ప్రీతీ జింటా, అర్జున్ రాంపాల్ లతో కలసి తన మొదటి అంతర్జాతీయ సినిమాలో నటించారు దివ్య. టొరొనొటో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శింపబడిందీ సినిమా. సినిమాకు మిశ్రమ విమర్శలు లభించినా, దివ్యాకు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది.[15][16] అప్నే, ఆజా నాచ్లే సినిమాల్లో సహాయనటిగా నటించారు. 2008లో యు మి ఔర్ హమ్, సమ్మర్ 2007 సినిమాల్లో కనిపించారు ఆమె. వెల్ కమ్ టు సజ్జన్ పూర్ సినిమాలోని ఆమె నటనకు స్టార్ సబ్సే ఫేవరెట్ కౌన్ పురస్కారం అందుకున్నారు దివ్య. ఒహ్, మై గాడ్ సినిమా కమర్షియల్ గానూ, విమర్శనాత్మకంగానూ విఫలం చెందినా, ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది.[17] కహానీ గుడియా కీ..ది ట్రూ లవ్ స్టోరీ ఆఫ్ ఎ ఉమన్, కార్గిల్ వార్ సినిమాల్లో కూడా నటించారు దివ్య.[18]

2009–12: ఢిల్లీ-6, అంతర్జాతీయ గుర్తింపు

[మార్చు]

2009లో రాకేష్ ఓంప్రకాశ్ మెహ్రా దర్శకత్వంలో ఢిల్లీ-6 సినిమాలో నటించారు దివ్య. సినిమా ఫ్లాప్ అయినా, చెత్త ఏరుకునే అమ్మాయి జలేబీగా దివ్య నటనకు విమర్శకుల నుండి ఎన్నో ప్రశంసలు లభించాయి.[19][20] ఎన్నో అవార్డులకు నామినేషన్లు లభించడమే కాక, ఐఫా ఉత్తమ సహాయ నటి పురస్కారం కూడా పొందారు. ఆ తరువాత లవ్ కిచిడీ సినిమాలో నటించారు ఆమె. ఈ సినిమాలోని నటనకు కూడా ఎన్నో ప్రశంసలు లభించాయి.[21] ఆమె నటించిన మార్నింగ్ వాక్ సినిమాకు విమర్శకుల నుంచి వ్యతిరేకత వచ్చినా, ఆమె నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి.[22]  అదే ఏడాది మినీ పంజాబ్, పరోక్ష్ సినిమాల్లో నటించారామె.

2010లో పంజాబీ సినిమా సుఖ్మనీ:హోప్ ఫర్ లైఫ్ సినిమాలో ఆమె నటనకు పిటిసి పంజాబీ ఫిలిం ఉత్తమ నటి పురస్కారం అందుకున్నారు దివ్య. మనోజ్ తివారీ దర్శజత్వంలో హలో డార్లింగ్ సినిమాలో సహాయ నటిగా కనిపించారు ఆమె. ఈ సినిమా కమర్షియల్ గానూ, విమర్శనాత్మకంగానూ విజయం సాధించకపోయినా, ఆమెకు మాత్రం మంచి ప్రశంసలు లభించాయి.[23][24] తరువాత శిరిడి సాయిబాబా జీవితం ఆధారంగా తీసిన మాలిక్ ఏక్ సినిమా కూడా విమర్శలు పొందినా, బాబా భక్తురాలు లక్ష్మిగా దివ్య నటనకు మాత్రం మంచి ప్రశంసలు వచ్చయి.[25] అదే ఏడాది హార్ట్ లాండ్, హిస్ వంటి అంతర్జాతీయ సినిమాల్లో కనిపించారు దివ్య.[26] ఈ సినిమాకు కూడా  ఎన్నో విమర్శలు ఎదురైనా, ఆమెకు చిన్న పాత్రను ఇవ్వడంపై  విమర్శకుల నుంచి విమర్శలు వచ్చాయి.[27][28]

తరువాతి సినిమాలు

[మార్చు]

ఆయే బలా కో తాల్ తు సినిమాలో శుభో శేఖర్ భట్టాచార్య దర్శకత్వంలో నటించనున్నారు దివ్య.[29][30]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

మే 2005లో లెఫ్టెనెంట్ కమాండర్ సందీప్ షెర్గిల్ ను వివాహం చేసుకున్నారు దివ్య. కానీ కొన్నాళ్ళ తరువాత అభిప్రాయ భేదాలతో విడాకులు తీసుకున్నారు.[31][32]

అవార్డులు

[మార్చు]
సైఫ్టా అవార్డ్స్ 2013లో దివ్య

జీ సినీ అవార్డులు

 • 2005 - జీ సినీ ఉత్తమ సహాయ నటి-వీర్ జారా
 • 2014 - జీ సినీ ఉత్తమ సహాయ నటి-భాగ్ మిల్కా భాగ్

ఐఫా పురస్కారాలు

 • 2010 - ఐఫా ఉత్తమ సహాయ నటి-ఢిల్లీ-6
 • 2014 - ఐఫా ఉత్తమ సహాయ నటి-భాగ్ మిల్కా భాగ్
గ్లోబల్ భారత ఫిలిం అవార్డులు
 • 2005- గిఫా ఉత్తమ సహాయ నటి పురస్కారం-వీర్-జారా
అప్సరా ఫిలిం & టివి ప్రొడ్యూసర్స్ గిల్డ్ అవార్డులు
 • 2014- అప్సర ఉత్తమ సహాయ నటి పురస్కారం-భాగ్ మిల్కా భాగ్
ఇతర పురస్కారాలు
 • 2010 - బిగ్ పంజాబీ ఎంటర్టైన్మెంట్ అవార్డ్-ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్
 • 2010 - పిటిసి పంజాబీ ఫిలిం ఉత్తమ నటి అవార్డ్-సుఖ్మని
 • 2009 - స్టార్ సబ్సే ఫేవరెట్ కౌన్ అవార్డ్- వెల్ కమ్ టు సజ్జన్ పూర్
 • 1998 - స్మితా పాటిల్ అవార్డు
 • 1997 - దివ్య భారతి అవార్డు
 • 1997- ఆశీర్వాద్ అవార్డు
 • 1994 - 25వ సినీగోయర్స్ అవార్డు
 • 1993 - పంజాబ్ యూత్ ఫెస్టివల్ ఉత్తమ నటి & ఉత్తమ డ్యాన్సర్-1993 అవార్డు
టెలివిజన్ అవార్డులు
 • 2007 - ఉత్తమ నటి-సాన్సుయ్ టెలివిజన్ అవార్డులు
 • 2005 - నామీ రిపోర్టర్ అవార్డు
 • 2002 - రపా ఉత్తమ నటి పురస్కారం- కదమ్ సీరియల్-2002

సినిమాలు

[మార్చు]
సంవత్సరం చిత్రం పాత్ర నోట్స్
1994 ఇష్క్ మే జీనా ఇష్క్ మే మర్నా
1995 సురక్షా బిందియా
వీర్గటి సంధ్య
1996 అగ్ని సాక్షి ఉర్మి
చోటే సర్కార్ మీనా
రామ్ ఔర్ శ్యామ్ సునయన
1997 రాజాకీ ఆయేగీ బారాత్
దావా దీపా
1998 ఘర్ వాలీ బాహర్ వాలీ మధు
ఇస్కీ టోపీ ఉస్కే సర్ మిల్లీ
బడే మియాన్ చోటే మియాన్ మధు
ట్రైన్ టు పాకిస్థాన్
1999 షాహీద్-ఎ-మొహొబ్బత్ జైనాబ్ పంజాబీ సినిమా
సమర్ హిందీ/ఉర్దు సినిమా
రాజాజీ సోనియా
తబాహీ-ది డిస్ట్రాయర్
2000 బసంతి మలకి నేపాలి చిత్రం
2001 కసూర్ మిస్.పాయల్ నటి లిసా రాయ్ కు డబ్బింగ్ కూడా చెప్పారు
2002 మాయా నేపాలీ సినిమా (అతిథి పాత్ర)
ఇంత్ కా జవాబ్ పత్తర్ కాంచన్
23rd మార్చి 1931:షాహీద్ దుర్గ బాబీ
సుర్:ది మెలోడీ ఆఫ్ లైఫ్ రీటా డి 'సిల్వా
శక్తి - ది పవర్ Shekhar's sister
జిందగీ ఖూబ్ సూరత్ హై కిటు
గేమ్ తమిళ్ సినిమా
2003 ప్రాణ్ జాయే పర్ షాన్ నా జాయే దులారీ
జోగర్స్ పార్క్
బఘ్బాన్ రీనా మల్హోత్రా
లాక్:కార్గిల్
2004 శోభాయాత్ర ఝాన్సీ రాణి
అగ్నిపంఖ్ నుపుర్
షాదీ కా లడ్డూ గీతూ
వీర్-జారా షబ్బూ ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కారానికి నామినేషన్
మర్డర్ నర్గిస్
దేస్ హోయా పరదేశ్ గుడ్డి పంజాబీ సినిమా
2005 దిల్ కె పెచే పెచే విద్య
నామ్ గమ్ జాయేగా దివ్య
నేతాజీ సుభాష్ చంద్ర బోస్:ది ఫర్గాటెన్ హీరో ఇలా బోస్
సిల్సిలే దివ్యా రావ్
సంయోగితా - ది బ్రైడ్ ఇన్ రెడ్ సంయోగితా
మిస్టర్ యా మిస్ లవ్ లీన్ కపూర్
దుబాయ్ రిటర్న్ వైశాలీ
ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ పోలీస్ ఆఫీసర్ మలయాళం సినిమా (విడుదల కాలేదు)
2006 దర్వాజా బంద్ రఖో చమేలీ జి.కాలే
వారిస్ షా-ఇష్క్ డా వారిస్ సబూ పంజాబీ సినిమా
ఉమ్రావ్ జాన్ బిస్మిల్లా జాన్
2007 అప్నే పూజా బి. సింగ్ చౌదరి
ది లాస్ట్ ఇయర్ ఇవీ ఇంగ్లీష్ సినిమా
ఆజా నచ్లే నజ్మా
2008 యు మి ఔర్ హమ్ రీనా
కహానీ గుడియా కీ:ట్రూ స్టోరీ ఆఫ్ ఎ ఉమెన్ గుడియా (కార్గిల్ యుద్ధం బాధితురాలు
సమ్మర్ 2007 డ్యాన్సర్/సింగర్
వెల్ కమ్ టు సజ్జన్ పూర్ వింధ్య
ఓహ్, మై గాడ్ సుమన్ ఆర్. దూబే
2009 ఢిల్లీ-6 జలేబీ ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి నామినేషన్
మినీ పంజాబ్ షబ్బూ
మార్నింగ్ వాక్ రీటా
లవ్ కిచిడీ పర్మిందర్ కౌర్
పర్కోష్ గౌరి
2010 సుఖ్మనీ:హోప్ ఫర్ లైఫ్ రేష్మా పంజాబీ సినిమా
మాలిక్ ఏక్ లక్ష్మి
హిస్ మాయా గుప్త ఇంగ్లీష్/హిందీ సినిమా
హార్ట్ ల్యాండ్ అమృత ఇంగ్లీష్ సినిమా
హలో డార్లింగ్ మిసెస్.హార్దిక్
2011 హాత్ - ది వీక్లీ బజార్ సంజా
మస్తీ ఎక్స్ ప్రెస్ సీమా
మోనికా మోనికా ఆర్. జైట్లీ
ది లయన్ ఆఫ్ పంజాబ్[33] పంజాబీ సినిమా
స్టాన్లీ కా డబ్బా రోజీ మిస్
చార్జ్ షీట్ మిన్నే సింగ్
మమ్మీ పంజాబీ మునియా
మై ఫ్రెండ్ పింటో రేష్మా షేర్గిల్
చలో మూవీ మిస్ ఊర్మిళా ఉండ్రెస్కర్
2012 డేంజరస్ ఇష్క్ నీతూ
హీరోయిన పల్లవి నారాయణ్
ఓవర్ టైమ్
2013 స్పెషల్ 26 శాంతి
జిల్లా ఘజియాబాద్ మహేందెరీ
గిప్పీ పప్పీ
లూటెరా శ్యామా
భాగ్ మిల్కా భాగ్ ఇష్రా కౌర్ ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కారానికి నామినేషన్
2014 రాగిణీ ఎం.ఎం.ఎస్ డాక్టర్. మీరా దత్తా [34]
మంజునాథ్ అంజలి ముల్లటి
2015 బద్లాపూర్ శోభ [35]
చెహరే:ఎ మోడ్రన్ డే క్లాసిక్ అమనాథ్
ప్రామిస్ డాడ్ సుజన్నే
2016 చాక్ ఎన్ డస్టర్ కామినీ గుప్త
ట్రాఫిక్ మాయా గుప్త
లక్నో టైమ్స్ రేణుకా శ్రీవాస్తవ్ నిర్మాణంలో ఉంది

References

[మార్చు]
 1. 1.0 1.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; dob అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 2. "Divya Dutta Biography | Divya's Photos, Movies & Interviews - Yahoo! India Movies". In.movies.yahoo.com. Retrieved 2011-01-02.
 3. Divya Duttas Photoshoot - Lehren Files - YouTube
 4. "Divya Dutta's mother inspires her Gippi character". NDTV. 2013-04-10. Archived from the original on 2014-06-19. Retrieved 2014-05-25. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
 5. "Meri Mommy: Divya Dutta". dnaindia.com. 2013-04-10. Retrieved 2014-05-25.
 6. "Iske Topi Uske Sarr: Review". planetbollywood.com. 1998-07-17. Archived from the original on 2011-11-07. Retrieved 2014-05-26. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
 7. "Lisa's voice dubbed by Divya in Kasoor". IndiaFM. 8 November 2000. Retrieved 2011-04-06.
 8. "LOC Kargil- Review". Mouthshut.com. 14 October 2012. Retrieved 2014-05-26.
 9. "Review by Aakash Gandhi (Planet Bollywood)". Retrieved 31 December 2012.
 10. "Review by Subhash K. Jha". Archived from the original on 17 జనవరి 2013. Retrieved 31 December 2012.
 11. "Review by Subhash K. Jha". Archived from the original on 16 సెప్టెంబరు 2014. Retrieved 26 May 2014.
 12. "Divya goes global". Retrieved 26 May 2014.
 13. "Umrao Jaan fails to impress". Retrieved 26 May 2014.
 14. "Umrao Jaan Review". Retrieved 26 May 2014.
 15. "The Last Lear Review". Archived from the original on 27 మే 2014. Retrieved 26 May 2014.
 16. "The Last Lear Review". Retrieved 26 May 2014.
 17. "Oh, My God: Review". Retrieved 26 May 2014.
 18. "Kahaani Gudiya Ki...True Story of a Woman : Review". Retrieved 26 May 2014.
 19. "Delhi-6 Review". Retrieved 26 May 2014.
 20. "Delhi-6 Review". Retrieved 26 May 2014.
 21. "Love Khichdi Review". Retrieved 26 May 2014.
 22. "Zee news". Archived from the original on 2009-08-27. Retrieved 2016-08-01.
 23. "Hello Darling Review". Archived from the original on 14 సెప్టెంబరు 2014. Retrieved 27 May 2014.
 24. "Hello Darling Review". Archived from the original on 26 మార్చి 2014. Retrieved 27 May 2014. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
 25. "Maalik Ek Review". Retrieved 27 May 2014.
 26. "U.S. Director praises Divya Dutta". Retrieved 27 May 2014.
 27. "Hisss Review". Archived from the original on 27 మే 2014. Retrieved 27 May 2014. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
 28. "Hisss Review". Archived from the original on 14 సెప్టెంబరు 2014. Retrieved 27 May 2014.
 29. "Divya Dutta to play a crusader in Manjunath". Retrieved 27 May 2014.
 30. "Aayee Bala Ko Taal Tu". Retrieved 27 May 2014.
 31. Meri Mommy: Divya Dutta - Entertainment - DNA
 32. "I am not married!" says Divya Dutta
 33. "Lion of Punjab Film/Music Release Date". Archived from the original on 2011-03-07. Retrieved 2016-08-01. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
 34. "Ragini MMS 2: Sunny Leone finds Divya Dutt hot for the psychiatrist role - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-01-29.
 35. "Badlapur Movie Reviews". Archived from the original on 2016-03-03. Retrieved 2016-08-01. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)