జి.వరలక్ష్మి
జి. వరలక్ష్మి | |
---|---|
జననం | గరికపాటి వరలక్ష్మి 1926 సెప్టెంబరు 27 ఒంగోలు, మద్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, భారతదేశం) |
మరణం | 2006 నవంబరు 26 చెన్నై, భారతదేశం | (వయసు 80)
వృత్తి | నటి |
జీవిత భాగస్వామి | |
పిల్లలు | కె. రాఘవేంద్రరావు (సవతి కొడుకు) |
బంధువులు | కె.బాపయ్య (బావగారి కొడుకు) ప్రకాష్ కోవెలమూడి (సవతి-మనవడు) |
గరికపాటి వరలక్ష్మి (సెప్టెంబర్ 13, 1926 - నవంబర్ 26, 2006) అందరికీ జి.వరలక్ష్మిగా సుపరిచితురాలైన అలనాటి రంగస్థల, సినిమా నటీమణి, గాయని, నిర్మాత, దర్శకురాలు. 1940 నుండి 1960 వరకు తెలుగు తమిళ సినిమా రంగాలలో ప్రాచుర్యమైన నటిగా వెలుగొందినది.
జననం, బాల్యం
[మార్చు]వరలక్ష్మి సెప్టెంబర్ 13, 1926లో ఒంగోలులో జన్మించింది. ఈమె బాల్యము నుండి మంచి గాయని. 11యేళ్ల వయసులో ఇల్లు వదిలి విజయవాడ చేరుకొని తుంగల చలపతి, దాసరి కోటిరత్నం మొదలైన రంగస్థల నటుల నాటకబృందాలలో నటించింది. వరలక్ష్మి సక్కుబాయి, రంగూన్ రౌడీ నాటకాలలో తన నటనకు మంచి పేరు తెచ్చుకొన్నది.
సినిమా రంగ ప్రవేశం
[మార్చు]రంగస్థలంపై తెచ్చుకున్న పేరు ఈమెను కె.ఎస్.ప్రకాశరావు, హెచ్.ఎం.రెడ్డి వంటి తెలుగు సినిమా ఆద్యుల దృష్టికి తెచ్చింది. హెచ్.ఎం.రెడ్డి 1940లో తీసిన వ్యంగ్య హాస్య చిత్రం బారిష్టరు పార్వతీశం సినిమాతో వరలక్ష్మిని చిత్రరంగానికి పరిచయం చేశాడు.[1] బాలనటిగా బారిస్టర్ పార్వతీశం (1940) లో సినీ రంగ ప్రవేశం చేసి దాదాపు 4 దశాబ్దాలు చిత్ర సీమలో రాణించిన గొప్ప నటీమణి.
ఈమె 1968 లో మూగజీవులు అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.
కుటుంబం
[మార్చు]వరలక్ష్మి తెలుగు సినిమా నటుడు, దర్శకుడైన కె.ఎస్.ప్రకాశరావును వివాహం చేసుకొన్నది. ఈమె ఆయనకు రెండవ భార్య. వరలక్ష్మి కుమారుడు కె.ఎస్.సూర్యప్రకాష్ కూడా తెలుగు సినీ రంగములో ఛాయాగ్రాహకుడు. కుమార్తె కనకదుర్గ. ఈమె మనవరాలు మానస తెలుగు సినీ రంగములో నటీమణిగా ప్రవేశించింది.
మరణం
[మార్చు]వరలక్ష్మి 2006, నవంబర్ 26 న మద్రాసులో 80 ఏళ్ల వయసులో కన్ను మూసింది.
చిత్ర సమాహారం
[మార్చు]నటిగా
[మార్చు]- గోరంత దీపం (1978)
- శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ (1976)
- అత్తవారిల్లు (1976)
- సంసారం సాగరం (1973)
- బుద్ధిమంతుడు (1969)
- బంగారు పిచ్చుక (1968)
- లేత మనసులు (1966)
- అంతస్థులు (1965)
- కుళందయుమ్ దెయివముమ్ (1965)
- సుమంగళి (1965)
- పతివ్రత (1964)
- కులగోత్రాలు (1962)
- బికారి రాముడు (1961)
- ఇద్దరు మిత్రులు (1961)
- రాజనందిని (1958)
- మాంగల్యబలం (1958)
- దొంగల్లో దొర (1957)
- కర్పూరకరసి (1957)
- మేలుకొలుపు (1956)
- అంతే కావాలి (1955)
- మా గోపి (1954)
- మేనరికం (1954)
- కన్నతల్లి (1953)
- నా చెల్లెలు (1953)
- పరోపకారం (1953/I)
- మానవతి (1952)
- పెళ్ళి చేసి చూడు (1952)
- దీక్ష (1951)
- నిర్దోషి (1951)
- మాయా రంభ (1950)
- మొదటి రాత్రి (1950 సినిమా) (1950)
- శ్రీ లక్ష్మమ్మ కథ (1950)
- స్వప్న సుందరి (1950)
- వింధ్యరాణి (1948)
- ద్రోహి (1948)
- భక్త ప్రహ్లాద (1942)
- దక్షయజ్ఞం (1941)
- బారిష్టర్ పార్వతీశం (1940)
దర్శకురాలిగా
[మార్చు]- మూగ జీవులు (1968)
మూలాలు
[మార్చు]- ↑ మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్. p. 109.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో జి.వరలక్ష్మి పేజీ
- హిందూ పత్రికలో వరలక్ష్మిపై వ్యాసం Archived 2007-09-30 at the Wayback Machine
- వెబ్ప్రపంచములో సంతాప వార్త