మా గోపి
మా గోపి (1954 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.ఎస్.రంగా |
---|---|
తారాగణం | చిత్తూరు నాగయ్య, జమున, జి.వరలక్ష్మి |
సంగీతం | విశ్వనాథన్ - రామమూర్తి |
నిర్మాణ సంస్థ | విక్రమ్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
విక్రమ్ ప్రొడక్షన్స్ ను స్థాపించి ఛాయాగ్రాహకుడు బి.ఎస్.రంగా దర్శకత్వం వహించి నిర్మించిన తొలిచిత్రం మా గోపి.ఈ సినిమా 1954, సెప్టెంబరు 24న విడుదలయ్యింది. ఈ సినిమాను జయగోపి అన్న పేరుతో డబ్బింగు చేసి తమిళంలో విడుదల చేశారు. ఇదే చిత్రాన్ని 1981లో ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ కన్నడ భాషలో భాగ్యవంత అనే పేరుతో పునర్నిర్మించాడు.
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకుడు: బి.ఎస్.రంగా
- ఛాయాగ్రహణం:బి.ఎస్.రంగా
- మాటలు:కొవ్వలి
- పాటలు: అనిశెట్టి
- సంగీతం: విశ్వనాథన్ - రామమూర్తి
నటవర్గం
[మార్చు]- నాగయ్య
- జి.వరలక్ష్మి
- జమున
- నరసింహారావు
- మాస్టర్ వెంకటేశ్వర్
- ప్రభావతి
సంక్షిప్తకథ
[మార్చు]పుట్టగానే తల్లిదండ్రులను కోల్పోయిన గోపీ అనే పిల్లవాణ్ణి అతని పెద్దమ్మ, పెద్దనాన్న చేరదీసి పెంచుతుంటారు. అందరూ గోపీని అరిష్టకారకుడని నిందిస్తూ, దూరంగా తరిమివేస్తున్నా పెద్దనాన్న ఒక్కడే అతడిని ప్రేమతో సాకుతూ వుంటాడు. గోపీ అన్న బలరాం కూడా గోపీని అసహ్యించుకుంటూ వుంటాడు. కానీ కొత్తగా పెళ్ళయి కాపురానికి వచ్చిన అతని భార్య సుశీల గోపీపై ఎనలేని ప్రేమ కురిపిస్తూ తల్లివలె సాకుతుంది. అనేక కష్టాలు పడిన తర్వాత గోపీ అరిష్ట జాతకుడు కాడని అదృష్టదాయకుడని అందరూ గ్రహించి పశ్చాత్తాప పడతారు[1].
పాటలు
[మార్చు]- ఊగవె ఉయ్యాల ఉల్లాసాల వేళ - జిక్కి బృందం
- లేదయ్యో ముక్తి లేదయ్యో తన భార్య చేత - పిఠాపురం
- యువతీ యువకుల మనమంతా - బృంద గీతం
- దేశ దేశముల యశము గాంచుమా దివ్యమూర్తి - పి. లీల
- ఓ మద్దుపాప నా ముద్దు గోపి - ఆర్. బాలసరస్వతి దేవి
- మా వదిన మా వదిన నా పేరున ఒక - కె.రాణి, జిక్కి బృందం
- జాలి జాలిగ ఏడవకయ్యా తూలిపోకుమయ్యా - మాధవపెద్ది
- అందాల గోపి నా చేతులారా నిను ,
- అమ్మా కృష్ణమ్మా ఆదరించు తల్లి ,
- చిరునగవుల సొగసుల చిన్నారినోయీ,
- సానుభూతియే లేదా జగతిన్ జాలి _నాగయ్య
మూలాలు
[మార్చు]- ↑ సంపాదకుడు (3 October 1954). "సినిమా: మాగోపి". ఆంధ్రపత్రిక దినపత్రిక. Retrieved 11 November 2018.[permanent dead link]
2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.