పర్వతనేని ఉపేంద్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పర్వతనేని ఉపేంద్ర
పర్వతనేని ఉపేంద్ర


నియోజకవర్గము విజయవాడ

వ్యక్తిగత వివరాలు

జననం (1936-09-27) 1936 సెప్టెంబరు 27
పోతునూరు,తూర్పు గోదావరి జిల్లా
మరణం 2009 నవంబరు 17 (2009-11-17)(వయసు 73)
రాజకీయ పార్టీ తెలుగు దేశం
జనతాదళ్
భారత జాతీయ కాంగ్రెసు
ప్రజారాజ్యం
సంతానము ముగ్గురు కుమారులు మరియు ఒక కుమార్తె
నివాసము విజయవాడ
మతం హిందూ మతము

పర్వతనేని ఉపేంద్ర (సెప్టెంబర్ 27, 1936 - నవంబర్ 17, 2009) మాజీ పార్లమెంటు సభ్యులు మరియు మాజీ కేంద్ర మంత్రి.

జననం[మార్చు]

ఇతను తూర్పు గోదావరి జిల్లాలోని పోతునూరు గ్రామంలో జన్మించాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ. పట్టాను పొందాడు. రైల్వే మంత్రిత్వ శాఖలో కలకత్తాలో జాయింట్ డైరెక్టర్ గా పనిచేశాడు. భారతీయ జనతా పార్టీ లోని మధుదండావతే మంత్రివర్గంలో 1977-79లో స్పెషల్ అసిస్టెంట్ గా పేరుపొందాడు.

తెలుగు దేశం పార్టీ స్థాపించిన తొలి రోజుల్లో కార్యదర్శిగా పార్టీ రూపురేఖలు తీర్చి దిద్దడంలో నందమూరి తారక రామారావుకు సహకరించి మంచి పేరు సంపాదించాడు. 1984 నుండి 1990 ల మధ్య రాజ్యసభ సభ్యుడిగా తెలుగు దేశం పార్టీ నాయకులుగా వ్యవహరించాడు. 1989లో జనతా ప్రభుత్వ నేతృత్వంలో విశ్వనాధ ప్రతాప్ సింగ్ మంత్రివర్గంలో ఇతను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖను చేపట్టి (1989 - 1990) సమర్ధవంతంగా నిర్వహించాడు. ఆ కాలంలో ప్రసార భారతి బిల్లు ప్రవేశ పట్టడంలోకీలక పాత్ర వహించాడు. 1990లో తిరిగి రాజ్యసభ సభ్యులయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరి 1996 మరియు 1998లలో విజయవాడ లోకసభ నియోజకవర్గం నుండి 11వ మరియు 12వ లోకసభకు ఎన్నికయ్యాడు. 2009 ఎన్నికల ముందు ఇతను ప్రజా రాజ్యం పార్టీలో చేరాడు. తన రాజకీయ అనుభవాల గురించి ఇతను "గతం స్వగతం" అనే పుస్తకాన్ని రచించాడు.

మరణం[మార్చు]

ఇతను 2009, నవంబర్ 17 తేదీన పరమపదించాడు.[1] ఇతనికి ముగ్గురు కుమారులు మరియు ఒక కుమార్తె. ప్రముఖ రాజకీయ నాయకుడు లగడపాటి రాజగోపాల్ ఇతని అల్లుడు.

మూలాలు[మార్చు]