లీలా నాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లీలా నాయుడు
Leela Naidu, (1940-2009).jpg
జననం1940[1]
మరణం28 జూలై 2009 (వయస్సు 69)
ముంబై
వృత్తినటి, మోడల్[ఆధారం చూపాలి]
క్రియాశీల సంవత్సరాలు1960–1992
జీవిత భాగస్వామి
 • తిలక్ రాజ్ ఒబెరాయ్
  (m. 1956, divorced)
 • డోమ్ మోరేస్
  (m. 1969, separated)
తల్లిదండ్రులు
పురస్కారాలుఫెమినా మిస్ ఇండియా

లీలా నాయుడు (1940 - జులై 28, 2009) ప్రఖ్యాత నటీమణి, గొప్ప సౌందర్య రాశి. ప్రపంచములో మహా సౌందర్యవతులలో ఒకరిగా ఎన్నుకొనబడింది[2]. పెక్కు హిందీ చలన చిత్రములలో నటించి పేరు సంపాదించుకున్నది. "యే రాస్తే హై ప్యార్ కే" చిత్రములో లీల నటన పలువురి మన్ననలు పొందినది.

బాల్యము[మార్చు]

లీల 1940 సంవత్సరములో జన్మించింది. మదనపల్లె (చిత్తూరు) నకు చెందిన భౌతిక శాస్త్రవేత్త పత్తిపాటి రామయ్య నాయుడు కుమార్తె. రామయ్య పారిస్ లోని UNESCO శాస్త్ర సలహాదారుగా పనిచేయుచున్నపుడు ఫ్రెంచి వనిత మార్తాను వివాహమాడాడు. మార్తా భారతదేశానికి సంబంధించిన విషయములలో పరిశోధకురాలు (Indologist).

జీవనగమనము[మార్చు]

 • 1954లో (పదిహేను సంవత్సరముల వయసు) Femina Miss India గా ఎన్నుకొన బడింది.
 • వోగ్ పత్రిక (Vogue) లీలను మహారాణి గాయత్రీ దేవి సరసన పది మహాసౌందర్యవతులలో ఒకరిగా పరిగణించింది.
 • 1956లో ఓబెరాయ్ హోటళ్ళ స్థాపకుడు మోహన్ ఒబెరాయ్ కుమారుడు తిలక్ రాజ్ ను పెళ్ళాడింది.
 • మాయ, ప్రియ అను కవలకుమార్తెలను కన్నపిదప తిలక్ రాజ్ తో విడిపోయింది.
 • విడాకుల తరువాత జిడ్డు కృష్ణమూర్తి బోధలకు ఆకర్షితురాలయ్యింది.
 • 1969లో గోవాకు చెందిన ప్రఖ్యాత రచయిత డామ్ మొరేస్ ను వివాహమాడింది.

చిత్ర రంగము[మార్చు]

2011లో స్టాంపుపై నాయుడు

1960లో విడుదలైన "అనూరాధ" లీల మొదటి చిత్రము. హృషికేశ్ ముఖర్జీ దర్శకుడు, బలరాజ్ సాహ్ని కథానాయకుడు. జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రముగా పురస్కారము పొందింది. లీలకు పండిత్ రవి శంకర్ పాటలు కూర్చాడు. 1962లో "ఉమ్మీద్" (అశోక్ కుమార్), పిమ్మట మర్చంట్-ఐవరీ వారి "The Householder" (1963), శ్యామ్ బెనెగల్ "త్రికాల్" (1985) లలో నటించింది. కొద్ది చిత్రములలో నటించిననూ లీల వాటిద్వారా చిత్రరంగముపై చెరగని ముద్ర వేసింది. 1992లో నటించిన "Elctric Moon" లీల చివరి చిత్రం.

మరణము[మార్చు]

లీల జులై 28, 2009ముంబాయిలో మరణించింది[3].

మూలాలు[మార్చు]

 1. "Leela Naidu: Miss India of 1954 who went on to forge a career as an". 21 September 2009.
 2. అందానికి మారుపేరు లీల: http://timesofindia.indiatimes.com/NEWS/City/Mumbai/Leela-Naidu-personified-grace-and-beauty/articleshow/4831749.cms
 3. అపురూప సౌందర్యరాశి మరణం: http://www.indianexpress.com/news/One-of-world-s--most-beautiful-women--dies/495313