చర్చ:గుర్‌గావ్
Kasyap గారూ, శ్రద్ధ తీసుకుని ఈ పేజీలో భాషా సవరణలు చేసినందుకు ధన్యవాదాలు. నేను మరికొన్ని మార్పులు చేసాను. వాటిని పరిశీలించి ఇంకా ఏమైనా మార్పులు చెయ్యాల్సిన అవసరముందని భావిస్తే చెయ్యగలరు. నేను ఇప్పుడు చేసిన మార్పుల విషయంలో మీకు రెండు వివరణలు ఇవ్వాలి.. చూడండి: 1. "1776-77లో ఝార్సా పరగణా, బేగం సమ్రూ అధీనం లోకి వెళ్ళింది. 1836 లో ఆమె మరణించిన తరువాత ఈ ప్రాంతం బ్రిటిష్ పాలనలోకి వచ్చింది. బేగం సమ్రూ భూభాగాన్ని బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకుని జార్సా వద్ద సివిల్ లైన్లు, సమీపంలోని హియాదత్పూర్ వద్ద అశ్వికదళ కంటోన్మెంటు ఏర్పాటు చేశారు." _ ఈ వాక్యాల్లో చెబుతున్నది ఝార్సా పరగణాకు ఏమైంది అనే సంగతి గురించి. అంచేత ఝార్సా పరగణా పైనే వత్తిడి ఉండాలి ఝార్సా పరగణా ఫలానా వారి వద్ద ఉండేది. ఆ తరువాత మరొకరి హస్తగతమైంది. వాళ్ళు అక్కడ ఫలానా నిర్మాణాలు చేసారు.. ఇదీ టూకీగా ఆ వాక్యాల ద్వారా నేను చెప్పదలచినది. ఆ ప్రకారం చూస్తే మీరు చేసిన సవరణ కంటే అంతకు ముందు ఉన్నదే సరైనది. అంచేత దాన్నే ఉంచాను. 2. "2013 నవంబరు నుండి రాపిడ్ మెట్రో పనిచెయ్యడం మొదలైంది." అని రాసారు మీరు. అది సరికాదు. ఒక పని ఫలానా సమయాన మొదలౌతుంది, అంతేగానీ ఫలానా సమయం "నుండి" మొదలవదు. ఫలానా సమయం నుండి జరుగుతూ ఉంటుంది. నేను 5 గంటలకు నడక మొదలు పెట్టాను అంటాం గానీ, నేను 5 గంటల నుండి నడక మొదలు పెట్టాను అనం గదా. అంచేత "2013 నవంబరు నుండి రాపిడ్ మెట్రో పనిచేస్తోంది." అనైనా రాయాలి లేదా "2013 నవంబరులో రాపిడ్ మెట్రో పనిచెయ్యడం మొదలైంది." అనైనా రాయాలి (తేదీ తెలియదు కాబట్టి). అంచేత మీరు రాసిన దాన్ని సవరించి ముందున్న పాఠ్యాన్నే పెట్టాను.
ముందుముందు కూడా మీరు ఇలాగే భాషా సవరణలు చేస్తూండాలని కోరుతున్నాను. ఒకరు చేసిన పనిని మరొకరు పరిశీలించి సవరణలు చెయ్యడం వికీలో విరివిగా జరగాలని నా కోరిక.__చదువరి (చర్చ • రచనలు) 04:25, 18 నవంబరు 2020 (UTC)
- ఇలాంటి చర్చలు మాబోటి అజ్ఞానులకు చాలా ఉపయోగం. యర్రా రామారావు (చర్చ) 05:37, 18 నవంబరు 2020 (UTC)