మొహెంజో-దారో

వికీపీడియా నుండి
(మొహంజో-దారో నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

మొహంజో-దారో (సింధీ:موئن جو دڙو ఉర్దూ: موئن جو دڑو), అనగా చనిపోయినవారి గుట్ట ప్రస్తుత పాకిస్థాన్ లోని సింధ్ ప్రాంతానికి చెందిన చారిత్రకంగా, నాగరికతపరంగా అత్యంత ప్రాముఖ్యత గల ప్రాంతం. క్రీ.పూ 2500 లో నిర్మించబడిన ఈ నగరం సింధు లోయ నాగరికత లో అత్యధిక స్థిరత్వం పొందిన, పురాతన ఈజిప్టు, మెసొపొటేమియా నాగరికత, మినోవా మరియు నార్టే చీకో నాగరికతలకు సమకాలీనమైనది. క్రీ.పూ 19వ శతాబ్దంలో సింధు నాగరికత అంతరించిపోయినపుడు, ఈ నగరం పరిత్యజించబడినది. 1920వ సంవత్సరం వరకూ ఇది గుర్తించబడలేదు. అప్పటి నుండి ఈ ప్రాంతంలో చాలా పరిశోధనాత్మక త్రవ్వకాలు జరుపబడ్డాయి. 1980 లో దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తించారు.[1] ఈ స్థలం రాపిడి ఒరిపిడుల కారణంగాను, సరైన సంరక్షణ లేకపోవడానా శిథిలమౌతూ ఉంది.[2]

ప్రదేశం[మార్చు]

సింధు నదికి పడమర దిశగా సింధ్ కు చెందిన లర్కానా జిల్లా లో మొహంజో-దారో కలదు. ఇది సింధు నదికి, ఘగ్గర్-హక్రా నదికి మధ్యలో ఉన్నది. లర్కానా నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఇది కలదు.[3] నగరం చుట్టూ సింధు నది నుండి వచ్చే వరదనుండి రక్షించటానికి కోటగోడ కట్టబడినది. మొహంజో-దారో నాగరికతను బలహీనపరచిన చివరి వరద ఉధృతి కారణంగా ఈ కోటగోడ దెబ్బ తిన్నది. ఇప్పటికీ సింధు నది దీనికి తూర్పు దిశగా ప్రవహిస్తున్ననూ, పశ్చిమదిశలో ఉన్న ఘగ్గర్-హక్రా నది మాత్రం ఎండిపోయినది.[4]

చారిత్రక నేపథ్యం[మార్చు]

మొహంజో-దారో క్రీ.పూ. 26వ శతాబ్దంలో నిర్మించబడినది.[5] క్రీ.పూ. 3000 నుండి అభివృద్ధి చెందుతూ వచ్చిన ప్రాచీన సింధు లోయ నాగరికత (హరప్పా నాగరికత)లో నిర్మించబడిన అతిపెద్ద నగరాలలో ఇది కూడా ఒకటి.[6]

ఉచ్ఛదశలో ఉన్నపుడు ప్రస్తుత పశ్చిమాన పాకిస్థాన్ నుండి ఇరాన్ సరిహద్దుల వరకు, ఉత్తరాన అఫ్ఘానిస్థాన్ నుండి ఉత్తర భారతదేశము నుండి దక్షిణాన గుజరాత్ వరకు విస్తరించి హరప్పా, మొహంజో-దారో, లోథాల్, కాలిబంగన్, ధోలావీరా మరియు రాఖీఘరీలు ప్రధాన పట్టణాలుగా విలసిల్లింది. అయితే వీటన్నింటిలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకొన్నది మాత్రం మొహంజో-దారోనే. ఇక్కడి నిర్మాణంలో శాస్త్రీయత, ఆవాస ప్రణాళికలు అత్యంత అభివృద్ధి చెందినవి కావటమే ఇందుకు మూలం. సింధు లోయ నాగరికత అంతరించగానే మొహంజో-దారో కళావిహీనం అయినది.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Mohenjo-Daro: An Ancient Indus Valley Metropolis". 
  2. "Mohenjo Daro: Could this ancient city be lost forever?". BBC. 27 June 2012. Retrieved 27 October 2012.
  3. Roach, John. "Lost City of Mohenjo Daro". National Geographic. Retrieved 8 April 2012. 
  4. "Sarasvati: Tracing the death of a river". DNA Pakistan. 12 June 2010. Retrieved 9 June 2012. 
  5. Ancientindia.co.uk. Retrieved 2012-05-02.
  6. Beck, Roger B.; Linda Black; Larry S. Krieger; Phillip C. Naylor; Dahia Ibo Shabaka (1999). World History: Patterns of Interaction. Evanston, IL: McDougal Littell. ISBN 0-395-87274-X.