మొహెంజో-దారో స్నాన ఘట్టం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సింధులోయ నాగరికతకు చెందిన స్నానఘట్టం

స్నాన ఘట్టం ప్రాచీన సింధు లోయ నాగరికతకు చెందిన మొహెంజో దారోలో ప్రసిద్ధి చెందిన కట్టడం.[1][2][3] దీన్ని ఒక దిబ్బపై నిర్మించారు. పురాతత్వ ఆధారాలను బట్టి, సా.పూ 3 వ సహస్రాబ్దిలో ఈ దిబ్బను నిర్మించగానే స్నానఘట్టాన్ని కూడా నిర్మించినట్లు తెలియవస్తోంది.[4]


విశేషాలు

[మార్చు]
స్నానఘట్టపు మరొక దృశ్యం

ఈ స్నాన ఘట్టం ప్రాచీన నాగరికతలకు చెందిన తొట్టతొలి సార్వజనిక నీటి చెరువుగా పేరొందింది.[5] ఇది 11.88 × 7.01 మీ. పొడవు వెడల్పులు, 2.43 మీ. గరిష్ఠ లోతుతో ఉంది. స్నాన ఘట్టం లోకి దిగడానికి ఉత్తర దిశన ఒకటి, దక్షిణాన ఒకటి - మొత్తం రెండు వెడల్పాటి మెట్ల వరుస లున్నాయి.[6] ఈ మెట్ల వరుసల చివర ఒక మీటరు వెడల్పు, 40 సెం.మీ. ఎత్తుతో దిబ్బ లున్నాయి. స్నాన ఘట్టానికి ఒక చివర ఒక రంధ్రం ఉంది. బహుశా, దీని ద్వారా నీటిని వదిలి ఘట్టాన్ని ఖాళీ చేసేందుకు వాడి ఉంటారు.

స్నానఘట్టపు అడుగును నీరు కారకుండా ఇటుకలతోటి, అంచులను మట్టి అడుసుతోనూ కట్టారు. చుట్టూ ఉన్న గోడలను కూడా ఇలాగే కట్టారు. మరింత నీటికట్టడి కోసం చుట్టూ ఉన్న గోడలకు తారు పూసారు. బహుశా ఘట్టపు అడుగున కూడా పూసి ఉండవచ్చు. తూర్పు, ఉత్తర, దక్షిణ అంచుల్లో ఇటుకలతో వసారా నిర్మించారు. శిథిలం కాకుండా మిగిలి ఉన్న స్తంభాలపై గట్లు ఉన్నాయి. బహుశా వీటిపై చెక్క తడికలు గాని, కిటికీ చట్రాలు గానీ అమర్చి ఉండవచ్చు. స్నానఘట్టపు ఆవరణ లోకి ప్రవేశించేందుకు, రెండు పెద్ద ద్వారాలున్నాయి. ఒకటి దక్షిణాన, రెండవది తూర్పు, ఉత్తరాన ఉంది. కట్టడానికి తూర్పున వరసగా గదులున్నాయి. ఒక గదిలో బావి ఉంది. స్నాన ఘట్టంలోకి నీటిని సరఫరా చేసేందుకు ఈ బావిని వాడి ఉండవచ్చు. వర్షపు నీటిని కూడా ఘట్టాన్ని నింపేందుకు వాడి ఉండవచ్చు. కానీ వర్షపు నీటిని స్నాన ఘట్టంలోకి మళ్ళించే ఏర్పాటేదీ కనిపించలేదు. ఇది నీటిని కట్టడి చేసే ఇటుకలతో కట్టిన పొడవాటి స్నానఘట్టం.[7]

మతాచారాల్లో భక్తులను పునీతం చేసి, వారి సుఖశాంతులకై చేసే పూజల కోసం ఈ ఘట్టాన్ని నిర్మించి ఉంటారని పురాతత్వ పండితులు భావిస్తున్నారు.[7]

పూజారుల నిలయం

[మార్చు]

స్నానఘట్టానికి పక్కన ఉన్న వీధికి అవతల, అనేక గదులు, మూడు వరండాలతో కూడిన ఒక పెద్ద భవనం ఉంది. భవనపు పై అంతస్థుకు, పై కప్పు మీదికి వెళ్ళేందుకు మెట్లున్నాయి.భవనం పరిమాణాన్ని, స్నాన ఘట్టానికి సమీపంలో ఉండటాన్ని బట్టి ఇది "పూజారుల నిలయం"గా భావిస్తున్నారు..[4]

కనుగోలు

[మార్చు]

1926 లో జరిపిన పురాతత్వ తవ్వకాల్లో ఈ స్నానఘట్టాన్ని కనుగొన్నారు.

మూలాలు

[మార్చు]
  1. "SD Area". ప్రాచీన భారత దేశం. బ్రిటిష్ మ్యూజియమ్. Archived from the original on 3 July 2018.
  2. "Great Bath | Definition, Description, & Facts | Britannica". www.britannica.com (in ఇంగ్లీష్). Retrieved 2023-01-21.
  3. టిక్కానెన్, అమీ (26 January 2018). "గ్రేట్ బాత్". ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా. Archived from the original on 3 July 2018.
  4. 4.0 4.1 సింగ్, ఉపేందర్ (2008). "ది హరప్పన్ సివిలైజేషన్, c. 2600–1900 సా.పూ.". ఎ హిస్టరీ ఆఫ్ ఏన్షెంట్ అండ్ ఎర్లీ మెడీవల్ ఇండియా: ఫ్రమ్ ది స్టోన్ ఏజ్ టు ది 12త్ సెంచురీ. న్యూ ఢిల్లీ: పియర్సన్ ఎడ్యుకేషన్. pp. 149–150. ISBN 978-81-317-1120-0.
  5. హరప్పా, కామ్. "'గ్రేట్ బాట్ మొహెంజోదారో". జె.ఎం. కెనోయర్ వివరణతో కూడిన స్లైడ్ షో. Harappa.com. Retrieved 2 July 2012.
  6. Great Bath, SD Area, looking north.
  7. 7.0 7.1 హరప్పా, కామ్. "'గ్రేట్ బాట్ మొహెంజోదారో". Harappa.com. Retrieved 2 July 2012.