Jump to content

సింధునదీ జలాల ఒప్పందం

వికీపీడియా నుండి
The Indus river basin
The Indus river basin

సింధు నదీజలాల ఒప్పందం అన్నది ప్రపంచ బ్యాంకు (అప్పట్లో అంతర్జాతీయ అభివృద్ధి, పునర్నిర్మాణ బ్యాంకు) మధ్యవర్తిత్వంతో భారతదేశంపాకిస్తాన్ ల నడుమ ఏర్పడ్డ నీటి పంపిణీ ఒప్పందం.[1] ఈ ఒప్పందంపై 1960 సెప్టెంబరు 19న అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపాకిస్తాన్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ లు సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం తూర్పు నదులు మూడు - బియాస్, రావిసట్లెజ్ లపై భారతదేశానికి, మూడు పశ్చిమ నదులు - సింధు, చీనాబ్ఝీలంలపై పాకిస్తాన్‌కూ నియంత్రణ ఉంటుంది. జలాలు ఎలా పంచుకోవాలన్న విషయం ఈ సందర్భంలో మరింత  వివాదాస్పదం. పాకిస్తాన్ నదులు భారతదేశంలో మొదట ప్రవహిస్తూండడంతో ఒప్పందం భారతదేశాన్ని నీటిని సాగు, రవాణా, విద్యుత్ ఉత్పత్తి  అవసరాలకు వినియోగించుకోమంటూనే నదులపై భారతీయ నిర్మాణాలు చేయదగ్గవి, చేయరానివేమిటో నిర్ధారించింది. సింధునదీ  పరీవాహక ప్రాంతపు నదుల జన్మస్థానం భారతదేశం కావడంతో  భారతదేశం పాకిస్తాన్‌లో కరువు, కాటకాలు  సృష్టించగలదనీ, ప్రత్యేకించి  యుద్ధ సమయంలో చేస్తుందనీ పాకిస్తాన్‌కు ఉన్న భయాల వల్ల ఈ ఒప్పందం ఏర్పడింది.[2] 1960లో ఒప్పందం అమలులోకి వచ్చిన నాటి నుంచి, భారతదేశం, పాకిస్తాన్లు జలాల గురించి యుద్ధంలోకి వెళ్ళలేదు. అనేక విభేదాలు, వివాదాలు ఒప్పందం పరిధిలోని న్యాయపరమైన పద్ధతుల్లోనే పరిష్కరించుకున్నారు. నిపుణులు కొన్ని సాంకేతిక నిర్దేశాలను నవీకరించి, వాతావరణ మార్పులకు అనుగుణంగా ఒప్పందపు పరిధిని విస్తరించాలనడం ఎలావున్నా, ప్రస్తుతం ప్రపంచంలోనే ఈ ఒప్పందం అత్యంత విజయవంతమైన నీటి పంపకం ఒప్పందంగా పేరొందింది.[3] ఒప్పందపు నిబంధనలకు అనుగుణంగా భారతదేశం మొత్తం సింధు నదీ జలాల్లో 20% మాత్రమే ఉపయోగించుకోగలుగుతుంది.[4][5][6]

చరిత్ర

[మార్చు]

బ్రిటిష్ ఇండియా కాలంలో, పంజాబ్‌లో నదులపై ఆధారపడిన నీటిపారుదల వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది. కానీ విభజన తర్వాత ఈ వ్యవస్థ రెండు దేశాల మధ్య విడిపోయింది. అందుకే, నీటి పంపిణీపై ఒక శాశ్వత ఒప్పందం అవసరమైంది. 1947లో భారతదేశం విడిపోయిన తర్వాత, పాకిస్తాన్‌కు వెళ్లే కొన్ని నదులు భారతదేశంలో నుంచే ప్రారంభమయ్యాయి. అవి రావి, సట్లెజ్, బియాస్ లాంటి తూర్పు నదులు. ఈ నీటి మూలాలు భారత్‌లో ఉండటం వల్ల భారతదేశం ఎప్పుడు కావాలంటే అప్పుడు పాకిస్తాన్‌కు నీటిని ఆపేసే స్థితిలో ఉంది. నిజంగానే 1948లో పాకిస్తాన్‌కు నీటి సరఫరాను భారత్ ఆపేసింది,ఇది పెద్ద సమస్యగా మారడంతో, 1951లో ప్రపంచ బ్యాంకు మద్దతుతో రెండు దేశాలు చర్చలు మొదలుపెట్టాయి. ఈ చర్చలు చాలా సంవత్సరాలు సాగాయి. చివరికి, 1960 సెప్టెంబర్ 19న, భారత్ మరియు పాకిస్తాన్ "సింధు జలాల ఒప్పందం" అనే ఒక ఒప్పందంపై సంతకం చేశాయి.ఈ ఒప్పందం ప్రకారం, సింధు నదీ వ్యవస్థను రెండు దేశాలు పంచుకున్నారు:

తూర్పు నదులు – రావి, బియాస్, సట్లెజ్: ఇవి పూర్తిగా భారత్‌కు ఇచ్చారు.

పడమర నదులు – సింధు, జీలం, చీనాబ్: ఇవి పాకిస్తాన్‌కి ఇచ్చారు, భారత్ వాటి ప్రవాహాన్ని అడ్డుకోకూడదని హామీ ఇచ్చింది.

నిబంధనలు

[మార్చు]

సింధు నదీ వ్యవస్థలో మూడు పశ్చిమ నదులు - సింధు, ఝీలం, చీనాబ్, మూడు తూర్పు నదులు సట్లెజ్, బియాస్, రావి ఉన్నాయి. ఒప్పందంలోని 5.1 ఆర్టికల్, సింధు నదిలో తూర్పు ఒడ్డు నుంచి కలిసిపోయే రావి, బియాస్, సట్లెజ్, ఝీలం, చీనాబ్ ల పంపిణీ ఆర్టికల్ 5.1 ప్రకారం, ఈ ఒప్పందం రవి, బియాస్, సుట్లెజ్, జెహ్లం మరియు చెనాబ్ నదుల నీటిని పంచుకునే వ్యవస్థను ప్రతిపాదిస్తుంది. ఈ నదులు పాకిస్తాన్‌లోని ఇండస్ నదికి ఎడమ వైపు (తూర్పు వైపు) కలుసుకుంటాయి. ఈ ఒప్పందం ప్రకారం, తూర్పు నదులుగా పరిగణించబడే రవి, బియాస్ మరియు సుట్లెజ్ నదుల నీటిని పాకిస్తాన్‌లోకి ప్రవేశించే ముందు పూర్తిగా భారత్ వినియోగించుకునే హక్కును కలిగి ఉంటుంది. అయితే, పాకిస్తాన్‌కు జెహ్లం, చెనాబ్ మరియు ఇండస్ నదుల నీటిని వినియోగించుకునే కాలువ వ్యవస్థ నిర్మించుకునేందుకు 10 సంవత్సరాల గడువు ఇవ్వబడింది. ఈ మార్పిడి కాలంలో, భారత్ ఈ తూర్పు నదుల నుండి పాకిస్తాన్‌కు నీటిని సరఫరా చేయాల్సిన బాధ్యత వహించింది. అలాగే, పశ్చిమ నదులైన జెహ్లం, చెనాబ్ మరియు ఇండస్ నదుల నీటిని పూర్తిగా పాకిస్తాన్ వినియోగించుకునే హక్కును పొందింది. తూర్పు నదుల నుండి వచ్చిన నీటి నష్టానికి పాకిస్తాన్ ఒకసారి ఆర్థిక పరిహారం కూడా పొందింది. మార్చి 31, 1970 తర్వాత, ఆ 10 సంవత్సరాల గడువు ముగిసిన తరువాత, భారత్‌కు ఆ మూడు తూర్పు నదుల నీటిని పూర్తిగా వినియోగించే హక్కులు కలిగినవిగా మారాయి .[7][8] ఈ ఒప్పందం నదుల జలాలను పంచుకోవడానికి బదులుగా వాటిని విభజించడానికి దారితీసింది.[9]

మూలాలు

[మార్చు]
  1. "Text of 'Indus Water Treaty', Ministry of water resources, Govt. of India" Archived 2014-06-05 at the Wayback Machine.
  2. War over water The Guardian, Monday 3 June 2002 01.06 BST
  3. Strategic Foresight Group, The Indus Equation Report
  4. C.A. Brebbia (4 September 2013).
  5. Map Workbook[permanent dead link].
  6. Biswaroop Roy Chowdhury.
  7. Garg, Santosh Kumar (1999).
  8. "Indus Waters Treaty 1960" (pdf).
  9. "Water Sharing Conflicts Between Countries, and Approaches to Resolving Them" (PDF).