ఎడారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎడారిలో ఇసుక తిన్నెలు
అటకామా ఎడారి

ఎడారి అనగా ఎటువంటి వృక్షసంపదా, నీరు లేకుండా కేవలం ఇసుకతో నిండి ఉన్న విశాలమైన భూభాగం. భూమిపై 1/3 వ వంతు వైశాల్యాన్ని ఎడారులే ఆక్రమించి ఉన్నాయి. కానీ ఎడారుల్లో అక్కడక్కడా కనిపించే ఒయాసిస్సులు మాత్రం సారవంతమై జనావాసాలకు అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ నీరు లభ్యమవడమే కాకుండా భూమి కూడా మంచి సారాన్ని కలిగి ఉంటుంది. కేవలం ఇసుకతోనే కాకుండా మంచుతో నిండి ఉన్న మంచు ఎడారులు కూడా ఉన్నాయి.

అటకామా ఎడారి భూమిమీద అత్యంత తేమ రహిత ప్రదేశం.[1][2][3][4] ఇసుక ఎడారుల్లో అన్నింటికన్నా పెద్దది ఆఫ్రికా ఖండంలోని సహారా ఎడారి. మృత్తికా క్రమక్షయానికి లోనైన ఎడారుల్లోని కొన్ని నిస్సారమైన భూముల్లో ఖనిజ లవణాలు కూడా లభ్యమవుతుంటాయి. దీర్ఘకాలికంగా అత్యధిక మైన పొడి వాతావరణం ఉండటం వలన ఇవి శిలాజాలను అలాగే నిల్వయుంచుకుంటాయి.

జీవజాలం[మార్చు]

ఎడారులు జీవకోటి మనుగడకు అంతగా సహకరించవని పేరుంది. అయితే నిజానికి వీటిలో కూడా మనం చక్కటి జీవ వైవిధ్యాన్ని గమనించవచ్చు. ఇక్కడి జంతువులు పగటి సమయంలో తమ శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన స్థలాల్లో దాక్కుంటాయి. కంగారూ ర్యాట్స్, కొయోట్, జాక్ ర్యాబిట్, వివిధ రకాలైన బల్లులు ఇందులో ముఖ్యమైనవి.

ముఖ్యమైన ఎడారులు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-12-18. Retrieved 2009-06-11.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-04-08. Retrieved 2009-06-11.
  3. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2012-06-06. Retrieved 2009-06-11.
  4. Boehm, Richard G (2006). The World and Its People (2005 ed.). Columbus, Ohio: Glencoe. p. 276. ISBN 0-07-860977-1.
"https://te.wikipedia.org/w/index.php?title=ఎడారి&oldid=4035198" నుండి వెలికితీశారు