Jump to content

సహారా ఎడారి

వికీపీడియా నుండి
సహారా ఉపగ్రహ చిత్రము
నైఋతి లిబియాలోని సహజసిద్ధమైన శిలాతోరణము.

సహారా అంటే అరబ్బీ భాషలో అతిపెద్ద ఎడారి అని అర్థం. (అరబ్బీ : الصحراء الكبرى ) (ఆంగ్లం : Sahara), గణాంకాల ప్రకారం అంటార్కిటికా తరువాత ప్రపంచములోనే రెండవ అతి పెద్ద ఎడారి.[1] ఈ ఎడారి వైశాల్యం 9,000,000 చదరపు కి.మీ (3,500,000 చదరపు మైళ్ళు). వైశాల్యంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలంత పెద్దది, ఆస్ట్రేలియా కంటే పెద్దది. ఈ ఎడారి ఉత్తర ఆఫ్రికా ఖండంలో ఎర్ర సముద్రం నుండి మధ్యధరా సముద్రతీర ప్రాంతం వరకు, అట్లాంటిక్ మహాసముద్రం పొలిమేర వరకు విస్తరించి ఉంది.

భౌగోళిక విస్తీర్ణం

[మార్చు]

సహారా ఎడారి ఉత్తర ఆఫ్రికా ఖండమంతటా చాలా దేశాలలో విస్తరించి ఉంది. అల్జీరియా, బర్కినా ఫాసో, చాద్, ఈజిప్టు, లిబియా, మాలీ, మొరాకో, నైగర్, సెనెగల్, సూడాన్, ట్యునీషియా దేశాలలో విస్తరించి ఉంది. ఈ ఎడారిలో వైవిధ్యమైన భౌగోళిక స్వరూపాలున్నవి. ఈ భౌగోళిక స్వరూపములో నైలు, సెనెగల్ వంటి నదులు కూడా ప్రవహిస్తున్నాయి. అయిర్, అహగ్గర్, సహారా అట్లాస్, టిబెట్సి వంటి పర్వతశ్రేణులు ఉన్నాయి. సహారా ఎడారిలోనే మళ్లీ లిబియన్ ఎడారి, టెనిరి, ఈజిప్షియన్ ఇసుకసముద్రం వంటి ఎడారులు ఉన్నాయి. చాద్ వంటి సరస్సులు, బహరియా వంటి ఒయాసిస్సులు కూడా ఉన్నాయి.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Since there is little precipitation in Antarctica as well, except at the coasts, the interior of the continent is technically the largest desert in the world.