Jump to content

సంజయ్ కుమార్ (సైనికుడు)

వికీపీడియా నుండి
Naib Subedar
సంజయ్ కుమార్
PVC
then-Havildar Sanjay Kumar, wearing his PVC medal.
జననం (1976-03-03) 1976 మార్చి 3 (వయసు 48)
కలోల్ బకైన్, బిలాస్పూర్ జిల్లా, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం
రాజభక్తిIndia Republic of India
సేవలు/శాఖ Indian Army
ర్యాంకు Naib Subedar
యూనిట్13 JAK RIF
పోరాటాలు / యుద్ధాలుకార్గిల్ యుద్ధం
పురస్కారాలు పరమ వీర చక్ర

నాయిబ్ సుబేదార్[1][2] సంజయ్ కుమార్, PVC (జ. 3 మార్చి 1976[3]) భారత సైనిక దళం లో సైనికుదు. ఆయన జూనియర్ కామిషన్డ్ ఆఫీసరుగా ఉన్నారు. ఆయన భారతదేశ అత్యున్నత సైనిక పురస్కారం పరమ వీర చక్ర ను అందుకున్నారు.

జీవిత విశేషాలు

[మార్చు]

సంజయ్ కుమార్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని బిలాస్‌పూర్ జిల్లాకు చెందిన కాలోల్ బకైన్ గ్రామంలో జన్మిoచాడు. భారత సైనిక దళంలో చేరక ముందు ఆయన న్యూఢిల్లీ లో టాక్సీ డ్రైవరుగా పనిచేసాడు.[4] ఆయన భారత సైనిక దళంలో చేరక ముందు ఆయన దరఖాస్తు మూడుసార్లు తిరస్కరించబడినది.

జూలై 4, 1999 న ఆయన 13వ బెటాలియన్, జమ్మూ, కాశ్మీర్ రైపిల్స్ లో సభ్యునిగా కార్గిల్ యుద్ధము సమయంలో సమతల ప్రదేశాన్ని పైభాగంలో కనుగొనే దళానికి నాయకత్వం వహించాడు.

కార్గిల్ లడాఖ్ ప్రాంతాన్ని కలిపే భాగం. దీన్ని చేజిక్కించుకుంటే లడాఖ్ ప్రాంతం భారత్ చేజారుతుంది. సియాచిన్ గ్లేసియర్ కి వెళ్లే మార్గాలన్నీ మూసుకుపోతాయి. అప్పుడు ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ భూమి సియాచిన్ లో పాక్ జెండా ఎగురుతుంది. అందుకే పాకిస్తాన్ ఈ ఘాతుకానికి పాల్పడింది.

పాకిస్థాన్ సైనికులు కొండను దూకి మషీన్ గన్ తో 150 మీటర్ల దూరంలోని శత్రు బంకర్ నుండి కాల్పులు జరిపారు. సంజయ్ కుమార్ ఈ సమస్యను గుర్తించాడు. సమతలంగా ఉన్న పై శిఖరం పై ఈ బంకర్ వల్ల వచ్చే హానికర తీవ్రతను గుర్తించి, శిఖరం వైపు పాకుతూ వెళ్ళి శత్రు బంకర్ పై ఆటోమేటిక్ కాల్పులు జరిపాడు. ఈ చర్య ఫలితంగా రెండు బుల్లెట్లు ఆయన ఛాతీలోనికొ ఒక బుల్లెట్ మోచేతి లోనికి పోయింది.

బుల్లెట్ గాయాలనుండి రక్తం స్రవిస్తున్నా, ఆయన బంకర్ పై దాడిని కొనసాగించాడు. సమీప యుద్ధంలో ఆయా ముగ్గురు శత్రు సైనికులను చంపాడు. వెంటనే ఆయన శత్రువు యొక్క మెషీన్ గన్ తీసుకొని రెండవ శత్రు బంకర్ పై దాడి చేసాడు. శత్రు సైనికులు ఈ చర్యకు ఆశ్చర్యానికి గురై ఆయన చేతిలో హతులయ్యారు. ఈ చర్యతో ప్రేరణ పొందిన మిగిలిన సైనిక దళం పోరాడి పై భాగాన గల సమతల తలాన్ని చేజిక్కించుకుంది.

కార్గిల్ యుద్ధం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఎత్తు మీద జరిగిన యుద్ధం. పూర్తిగా మంచు కొండల్లో జరిగిన హిమ యుద్ధం. శత్రువు కొండ మీద పాతుకుపోయి ఉన్నాడు. భారత సైన్యం కింద ఉంది. కింద నుంచి పైకి ఎగబాకి యుద్ధం చేయడం చాలా క్లిష్టమైనది. ఆ యుద్ధంలో మనం భారతదేశం విజయం సాధించింది. అదీ దీని ప్రత్యేకత. నెల రోజుల పోరాటంలో టైగర్ హిల్, టోలోలింగ్ ఇలా కొండ కొనలపై ఉన్న ఒక్కొక్క స్థావరం నుంచి పాకిస్తాన్ ను తరిమి కొట్టారు. 

ఈ యుద్ధంలో ఆయనతో పాటు గ్రెనేడియర్ యోగేంద్ర యాదవ్, మనోజ్ కుమార్ పాండే, కాప్టెన్ విక్రమ్ బాత్రా, కాప్టన్ అనుజ్ నయ్యర్, మేజర్ రాజేష్ అధికారి, మేజర్ శరవణన్, స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహూజాలకు అత్యంత పరాక్రమాన్ని ప్రదర్శించారు. 

పరమ వీర చక్ర మూలం

[మార్చు]

భారత సైనిక దళం వెబ్‌సైటులో ఆయన యొక్క పరమవీర చక్ర పురస్కారం గురించి అధికారికంగా ఈ క్రింది విధంగా చేర్చబడినది.

CITATION
RIFLEMAN SANJAY KUMAR
13 JAMMU AND KASHMIR RIFLES (13760533)

Rifleman Sanjay Kumar volunteered to be the leading scout of the attacking column tasked to capture area Flat Top of Point 4875 in the Mushkoh Valley on 4 July 1999. During the attack when enemy automatic fire from one of the sangars posed stiff opposition and stalled the column, Rifleman Sanjay Kumar realizing the gravity of the situation and with utter disregard to his personal safety, charged at the enemy. In the ensuing hand-to-hand combat, he killed three of the intruders and was himself seriously injured. Despite his injuries, he charged onto the second sangar. Taken totally by surprise, the enemy left behind a Universal Machine Gun and started running.

Rifleman Sanjay Kumar picked up the UMG and killed the fleeing enemy. Although bleeding profusely, he refused to be evacuated. The brave action on his part motivated his comrades and they took no notice of the treacherous terrain and charged onto the enemy and wrested the area Flat Top from the hands of the enemy.

Rifleman Sanjay Kumar displayed most conspicuous gallantry, cool courage and devotion to duty of an exceptionally high order in the face of the enemy.[5]

ప్రసిద్ధ సంస్కృతిలో

[మార్చు]

ఆయన కథను, అదే విధమైన పాత్రవహించిన యితరుల గురించిన సంఘర్షణను "ఎల్.ఒ.సి.కార్గిల్" సినిమా లో చిత్రీకరించారు. దీనిలో సంజయ్ కుమార్ పాత్రలో సునీల్ శెట్టి నటించాడు.

రాంక్ వివాదం

[మార్చు]

2010లో ఆయనను హవిల్దార్ నుండి లాన్స్ నాయక్ ర్యాంకుకు రెండు ర్యాంకులు తగ్గించారు.[6] భారత సైనికదళాధికారులు ఆయన రాంకును తగ్గించడానికి కారణాలను వెల్లడించడానికి నిరాకరించారు. అంతేకాక, ప్రత్రికా ప్రకటలలలో ఆయన యొక్క ర్యాంకును తగ్గించుటను దాచి హవిల్దారుగా పేర్కొంది. పరమ వీర చక్ర పురస్కార గ్రహీతలకు ర్యాంకుతో సంబంధం లేకుండా వందనం చేయాలి. ఈ విషయంలొ సంజయ్ కుమార్ కు సీనియర్ అధికారులకు మధ్య వివాదానికి కారణమైంది.[6] కుమార్ కు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఒక ఉద్యోగాన్ని యిచ్చేందుకు సంకల్పించింది. ఆయన తన 15 సంవత్సరాల సర్వీసు పూర్తిచేసిన తదుపరి ఈ ఉద్యోగానికి చేపట్టడానికి అవకాశం ఉంది.[6]

జూలై 2, 2014 న సంజయ్ కుమార్ ఇండియన్ ఆర్మీలో జూనియర్ కమీషన్డ్ అఫీసరు అయ్యాడు. నాయిబ్ సుబేదారుగ పదోన్నతి పొందాడు. ఆయన 2008లో హవిల్దార్ ర్యాంకు నుండి లాన్స్ నాయక్ కు డిమోషన్ చేయబడినందున ఈ పదోన్నతి వివాదం అయినది. కానీ ఆర్మీలో అత్యున్నత పురస్కారాలు పొందినవారికి నేరుగా పదోన్నతులు ఉండవనీ, అందరు సైనికులలాగే సీనియారిటీపై పదోన్నతులు ఉందాలని తెలియజేయబడినది.[1][2]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "NDTV Video, at 21:37 Sanjay Kumar is shown to be a Naib Subedar". NDTV. 2014. Retrieved 14 August 2014.
  2. 2.0 2.1 Sura, Ajay (2014). "15th anniversary of Kargil War becomes extra special for brave heart Sanjay". Times of India. Retrieved 14 August 2014.
  3. "Param Vir Chakra Winner of Bilaspur (H.P.)". hpbilaspur.gov.in. 2013. Archived from the original on 28 ఫిబ్రవరి 2014. Retrieved 18 February 2014.
  4. "15th anniversary of Kargil War becomes extra special for brave heart Sanjay - Times of India".
  5. The Param Vir Chakra Winners (PVC), Official Website of the Indian Army, retrieved 28 August 2014 "Profile" and "Citation" tabs.
  6. 6.0 6.1 6.2 Dutta, Anshuman G. (27 January 2010). "Double demotion for Kargil hero". Mid Day. Archived from the original on 15 జనవరి 2016. Retrieved 18 February 2014.

ఇతర లింకులు

[మార్చు]