మేజర్ సోమ్‌నాథ్ శర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మేజర్
సోమ్‌నాథ్ శర్మ
పరమ వీర చక్ర
2003 లో భారత ప్రభుత్వం విడుదల చేసిన స్టాంపు
జననం(1923-01-31)1923 జనవరి 31
దాధ్, కాంగ్రా జిల్లా, హిమాచల్ ప్రదేశ్
మరణం1947 నవంబరు 3(1947-11-03) (వయసు 24)
బుద్గాం, జమ్మూ కాశ్మీరు, భారత దేశము
రాజభక్తి
  • బ్రిటిష్ భారతదేశం
  • భారతదేశం
సేవలు/శాఖ
సేవా కాలం1942–1947
ర్యాంకుమేజర్
సర్వీసు సంఖ్యIC-521[1]
యూనిట్కుమాఁవ్ రెజిమెంట్
పోరాటాలు / యుద్ధాలు
పురస్కారాలు
  • పరమ వీర చక్ర
  • ఉల్లేఖనలు
సంబంధీకులువిశ్వనాథ శర్మ (తమ్ముడు)

మేజర్ సోమ్‌నాథ్ శర్మ (1923 జనవరి 31 – 1947 నవంబరు 3) పరమ వీర చక్ర పతకం పొందిన తొలి వ్యక్తి. ఈయన భారత సైన్యంలో అధికారి. ఆయనకు పరమవీర చక్ర మరణానంతరం ఇవ్వబడింది.

బాల్యం-విద్యాభ్యాసం

[మార్చు]

శర్మ 31 జనవరి 1923న హిమాచల్ ప్రదేశ్ (అప్పటి బ్రిటిష్ పాలనలోని పంజాబ్) దాధ్, కాంగ్డా జిల్లాలో జన్మించాడు. అతని తండ్రి అమర్నాథ్ శర్మ కూడ సైన్యాధికారిగా పనిచేసాడు. అతను డెహ్రాడూన్లోని ప్రిన్స్ అఫ్ వేల్స్ రాయల్ మిలిటరీ కాలేజీలో చేరాక ముందు శెరువుడ్ కాలేజీలో తన పూర్తి చేసాడు. తరువాత రాయల్ మిలిటరీ కాలేజీలో తన విద్యాబ్యాసాని పూర్తిచేసాడు. తన చిన్నతనంలో వాలా తాత చేపిన భగవత్గీతలోని కృష్ణార్జునల ఉపదేశాలకు బాగా లోబడి ఉన్నాడు.

సైనిక ఉద్యోగం

[మార్చు]

రాయల్ మిలిటరీ కాలేజ్లో తన విద్యాబ్యాసం అనంతరం 22 ఫిబ్రవరి 1942లో 8వ బెటాలియన్ లోని 19వ హైదరాబాద్ రెజిమెంట్ లోని బ్రిటిష్ ఇండియన్ సైనికదళంలో చేరాడు.2వ ప్రపంచ యుద్ధ సమయంలో కల్నల్ తిమ్మయ్య (భారత సైన్యాధిపతి) నేపద్యంలో పని చేసాడు.అరకన్ కాంపెయిన్ యుద్ధ సమయంలో శర్మ మంచి గుర్తిపుపొందాడు. శర్మ తన మామయ్య అయినా కెప్టెన్ వాసుదేవ ధైర్య సాహసాలు బాగా స్ఫూర్తినిచ్చాయి.వాసుదేవ కూడా 8వ బెటాలియన్లో ఒకరు.

బద్గామ్ యుధం

[మార్చు]

22వ అక్టోబర్ 1947లో పాకిస్థాన్ సైనిక దళాలు ఇండియలో ఒకటి ఐన కాశ్మీర్ లోకి రావటం గమనించి 27వ అక్టోబర్ 1947 కొంత మంది ఇండియన్ సైనిక దళాలను పంపించారు. 31వ అక్టోబర్ ది కంపెనీ యొక్క 4వ బెటాలియన్ అయిన కుమాన్ రెడిమెంట్, శర్మ ఆధ్వర్యంలో శ్రీనగర్ పంపించారు.

మరణాంతరం

[మార్చు]
త్యాగ చక్ర పై మేజర్ సోమనాథ్ శర్మ పేరు

1980వ దశకంలో, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారత ప్రభుత్వ సంస్థ అయిన షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్సిఐ) తమ ముడి చమురు ట్యాంకర్లలో పదిహేనుంటికి పరమవీర చక్ర గ్రహీతల గౌరవార్థం నామకరణం చేసింది. ఎంటి మేజర్ సోమనాథ్ శర్మ, పివిసి అనే ముడి చమురు ట్యాంకర్ 1984 జూన్ 11 న ఎస్సిఐకి డెలివరీ చేయబడింది. 25 ఏళ్ల సర్వీసు తర్వాత ట్యాంకర్ను దశలవారీగా తొలగించారు.[2]

మూలాలు

[మార్చు]
  1. Chakravorty 1995, pp. 75–76.
  2. "Ship MAJOR SOMNATH SHARMA PVC (Crude Oil Tanker) Registered in - Vessel details, Current position and Voyage information - IMO 8224107, MMSI -8224107, Call Sign". MarineTraffic.com (in ఇంగ్లీష్). Retrieved 2023-09-16.