Jump to content

కె.సి.పంత్

వికీపీడియా నుండి
(కృష్ణ చంద్ర పంత్ నుండి దారిమార్పు చెందింది)
కృష్ణ చంద్ర పంత్
కె.సి. పంత్ 2004 జనవరి 27న న్యూఢిల్లీలో ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసెస్ (IDSA) నిర్వహించిన "6 ఆసియా భద్రతా సదస్సు" ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న చిత్రం
18వ భారత రక్షణ మంత్రి
In office
1987–1989
23వ డిప్యూటీ ఛైర్మన్, భారత ప్రణాళికా సంఘం[1]
In office
1999–2004
వ్యక్తిగత వివరాలు
జననం(1931-08-10)1931 ఆగస్టు 10
భోవాలి, యునైటెడ్ ప్రావిన్సెస్, బ్రిటిష్ ఇండియా
మరణం2012 నవంబరు 15(2012-11-15) (వయసు 81)
ఢిల్లీ, భారతదేశం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్ & భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామిఇలా పంత్
సంతానం2

కృష్ణ చంద్ర పంత్ (1931ఆగస్టు 10 - 12012 నవంబరు 15) 26 సంవత్సరాలు భారత పార్లమెంటు సభ్యుడుగా పనిచేసాడు. అతను కాశ్మీర్‌పై ప్రధానమంత్రికి సంభాషణకర్త.[2] అతను భారత ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రి, 37 సంవత్సరాల కాలంలో పలు రాజ్యాంగ పదవులను నిర్వహించాడు. పంత్ రక్షణ మంత్రి, హోం శాఖ సహాయ మంత్రి, ఉక్కు, భారీ ఇంజినీరింగ్, ఆర్థిక, అణుశక్తి, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి పదవులను నిర్వహించాడు.[3] అతను అణుశక్తి సలహా సంఘానికి మొదటి అధ్యక్షుడు, 10వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు, భారతదేశ ఆర్థిక ప్రణాళికా సంస్థ ఉపాధ్యక్షుడు పదవులు నిర్వహించాడు. అతని ముందుచూపుపై 2020 డాక్యుమెంట్ ఇండియాస్ డెవలప్‌మెంట్ సినారియో, నెక్స్ట్ డికేడ్ అండ్ బియాండ్ అని ప్రచురించారు.[4]

ప్రారంభ జీవితం, కుటుంబం

[మార్చు]

కృష్ణ చంద్ర పంత్ (కెసి పంత్) ను అనధికారికంగా "రాజా" అని పిలుస్తారు, ఇతను స్వాతంత్ర్య సమరయోధుడు. గోవింద్ బల్లభ్ పంత్ [3] కళావతి పంత్ దంపతులకు 1931 ఆగస్టు 10న న హిమాలయాలలోని భోవాలి - కుమావోన్ (యునైటెడ్ ప్రావిన్సెస్ ప్రస్తుతం ఉత్తరాఖండ్) ప్రాంతంలో జన్మించాడు. అతని ప్రారంభ సంవత్సరాలు నైనిటాల్‌లో గడిచాయి. అతని పాఠశాల విద్య నైనిటాల్‌ లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో సాగింది. స్వాతంత్ర్యానంతరం తన తండ్రి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమితులైనప్పుడు, అతను లక్నో వెళ్లాడు. అతను లక్నో విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్య పూర్తి చేసి తదుపరి చదువుల కోసం జర్మనీ దేశం వెళ్ళాడు. 1957లో నైనిటాల్‌లో ఇలా పంత్‌ను వివాహం చేసుకున్నాడు.

నిర్వహించి పదవులు

[మార్చు]

హోం వ్యవహారాల రాష్ట్ర మంత్రి (1971–1973)

[మార్చు]

1970వ దశకం ప్రారంభంలో, నైనిటాల్ నుండి లోక్‌సభ పార్లమెంటరీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత, అతను హోం వ్యవహారాల శాఖ సహాయమంత్రిగా తన మొదటి మంత్రి పదవిని స్వీకరించాడు.[5] ఆసమయంలో రెండు క్లిష్టమైన సమస్యలను పరిష్కరించాడు.ముందుగా ఆంధ్రా-తెలంగాణ ఒకే రాష్ట్రంగా కొనసాగించాలని చర్చలు జరిపాడు.[6] రెండవది మేఘాలయ రాష్ట్రానికి పూర్తి హోదా కల్పించడం వల్ల, అల్లకల్లోలంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలకు అతను సహాయం చేశాడు.[7]

విద్యాశాఖ మంత్రి

[మార్చు]

పంత్ 1985లో విద్యాశాఖ మంత్రిగా నియమితులయ్యాడు.అతని పదవీ కాలంలో అంధుల కోసం విద్య, సామూహిక అక్షరాస్యత ప్రచారం, ఉద్యోగాలకు డిగ్రీ ఉండాలనే నిబంధనలు తొలగించడం, అందరికీ విద్య, అన్ని జిల్లాలకు మాదిరి పాఠశాలలు, కొన్నిముఖ్య ఉద్యోగ ఆధారిత కార్యక్రమాలు వంటి కొన్ని ప్రధాన ప్రచారాలతో ముందుకు వెళ్లాడు. ప్రతి ఒక్కరికీ ఉన్నత విద్యను అందించే సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పాటు ప్రతిపాదనను సమర్పించి, ఆమోదించటానికి కృషిచేసాడు.దానికి ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ - ఇగ్నో అని పేరు పెట్టారు.[8]

రక్షణ మంత్రి (1987–1989)

[మార్చు]

పంత్ 1987-89 సంవత్సరాల్లో కేంద్ర రక్షణ మంత్రిగా చేసాడు.రష్యా, యుఎస్, ఇతర దేశాలతో విదేశీ సంబంధాలను మెరుగుపరచడం, రక్షణ పరికరాలు, సేవలను అప్‌గ్రేడ్ చేయడం, వాటిని స్వయంసమృద్ధిగా మార్చడంవంటివాటిని పంత్ చేపట్టిన ప్రధాన కార్యక్రమాలు. అగ్ని, పృథ్వీ క్షిపణి కార్యక్రమాలలో కూడా అతని ప్రధాన పాత్ర ఉంది.[9][10][11]

నిర్వాహక సంఘాలు పదవులు

[మార్చు]

10వ ఆర్థిక సంఘం ఛైర్మన్ (1992–95)

[మార్చు]

10వ ఆర్థిక సంఘం [12] ఛైర్మన్‌గా పంత్‌ను అప్పటి ప్రధానమంత్రి పివి నర్సింహారావు నియమించాడు.యూనియన్, రాష్ట్రాల మధ్య అదనపు ఎక్సైజ్ సుంకాలు మొదలైన వాటిపరంగా నికర ఆదాయానికి సంబంధించిన పంపిణీకి సిఫార్సులు, మార్పులను సూచించడం వంటి ఇతర కార్యకలాపాలతో పాటు రాష్ట్రాలకు వారి ఆదాయాన్ని పెంచడానికి కేటాయించిన గ్రాంట్స్-ఇన్-ఎయిడ్‌కు సంబంధించిన నిబంధనలపై అతను అవసరమైన బాధ్యతలు వహించాడు.

జాతీయ భద్రతామండలి ఏర్పాటుకోసం డిప్యూటీ చైర్మన్ టాస్క్ ఫోర్స్ (1998)

[మార్చు]

జాతీయ భద్రతా మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా, జాతీయ భద్రతా ప్రణాళిక నిర్వహణకు కోసం సమన్వయంతో కూడిన ఇంటెలిజెన్స్ మదింపు, సత్వర నిర్ణయాలు తీసుకోవడం, విధాన అమలు అనుసరణల సమన్వయం కోసం దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రణాళికలు, జాతీయ భద్రత వ్యూహాన్ని రూపొందించడానికి పంత్ బాధ్యత వహించాడు.[13]

నేషనల్ కమిషన్ ఆన్ పాపులేషన్ డిప్యూటీ చైర్మన్ (1999)

[మార్చు]

2000 ఏప్రిల్ 11 న పంత్ హయాంలో జనాభా నియంత్రణ ఉద్దేశంతో, జాతీయ జనాభా విధానం, అమలు చేయబడింది [14]

డిప్యూటీ చైర్మన్, ప్రణాళికా సంఘం (1999–2004)

[మార్చు]

ప్రణాళికా సంఘానికి అప్పటి ప్రధాని ఎబి వాజ్‌పేయి నేతృత్వం వహించగా, కెసి పంత్‌ను డిప్యూటీ చైర్మన్‌గా నియమించారు.[15] ఆకలి రహిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు అతను తన కమిటీ సభ్యులతో కలిసి వ్యవసాయాభివృద్ధిపై దృష్టి సారించాడు. ఆహార భద్రతను నిర్ధారించడానికి, అతను ఆహార ఉత్పత్తిని రెట్టింపు చేయడానికి, వ్యవసాయ రంగంలో ఉపాధి, ఆదాయాన్ని పెంచడానికి వ్యూహాలను రూపొందించి అమలు చేశాడు. పేదరిక నిర్మూలన పథకాల ద్వారా గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాడు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలకు ఉచిత ఆహార ధాన్యాలు పంపిణీ చేయడం ప్రారంభించాడు.అతని పదవీ కాలంలో ఇతర రంగాలపై కూడా దృష్టి సారించాడు. విద్యా రంగంలో, విద్యలో సామాజిక మౌలిక సదుపాయాల విస్తరణ, మెరుగుదల కోసం ప్రధాని మంత్రి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో పెట్టుబడి పెట్టటానికి కృసిచేసాడు. ఆ తర్వాత దేశంలో ఉపాధిని పెంచేందుకు చర్యలు చేపట్టాడు. పారిశ్రామిక, రైల్వే, టెలికమ్యూనికేషన్ రంగాల పనితనాన్ని, వాటి నిర్వహణ పరిస్థితులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకున్నాడు. 2004 జనవరి 1న పంత్ డిప్యూటీ ఛైర్మన్‌గా, ప్రణాళికా సంఘం తన అధికారిక ప్రకటనలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి 8% వద్ద ఉందని ధ్రువీకరించింది.[16]

మరణం

[మార్చు]

2012 నవంబరు 15న కెసి పంత్ 81 సంవత్సరాల వయస్సులో మరణించాడు.[17][18][19]

ఇది కూడ చూడు

[మార్చు]

ప్రస్తావనలు

[మార్చు]
  1. "List of Deputy Chairman of Planning Commission of India" (PDF). Planning Commission of India. Archived from the original (PDF) on 2014-07-19. Retrieved 2021-11-05.
  2. "The Pant mission". Retrieved 13 September 2017.
  3. 3.0 3.1 "An old school politician: Krishna Chandra Pant". The Economic Times. The Times Group. 15 November 2012. Archived from the original on 16 ఫిబ్రవరి 2016. Retrieved 13 February 2016.
  4. "India's Development Scenario Next Decade and Beyond....(A Set of 2 Volumes) K.C. Pant (Ed.)". ACADEMIC FOUNDATION. Retrieved 7 September 2017.
  5. Sisson, Richard (1990). War and Secession: Pakistan, India and creation of Bangladesh. Oxford: University of California Press. pp. 139. ISBN 0-520-06280-9.
  6. "An old school politician known for negotiating skills". Retrieved 13 September 2017.
  7. "THE AUTONOMOUS STATE OF MEGHALAYA" (PDF). Shodhganga: 23.
  8. "IGNOU to honour K.C. Pant, former V-Cs". The Hindu. 27 September 2010. Retrieved 4 October 2017.
  9. Raj Jai, Janak (2003). Presidents of India, 1950–2003. Astral International (P) Ltd. p. 314. ISBN 9788187498650.
  10. "Many rocket failures shaped the 'Missile Man'". Deccan Herald. 29 July 2015. Retrieved 4 October 2017.
  11. "KALAM'S BLUEPRINT FOR A NEW INDIA". The Pioneer. 30 July 2015. Retrieved 4 October 2017.
  12. "TENTH FINANCE COMMISSION". FincomIndia. Retrieved 13 September 2017.
  13. "National Security Council unlikely to make a mark due to lack of innovation". Retrieved 13 September 2017.
  14. "Population Commission to come under Health Ministry". The Hindu. 13 October 2014. Retrieved 4 October 2017.
  15. "List of Deputy Chairman of Planning Commission of India" (PDF). Planning Commission, Government of India. Archived from the original (PDF) on 19 జూలై 2014. Retrieved 4 October 2017.
  16. "India Vision 2020" (PDF). Planning Commission, Government of India. December 2002. Archived from the original (PDF) on 2012-05-16. Retrieved 2021-11-05.
  17. "Former Defence Minister KC Pant dead". NDTV.com. 15 November 2012. Retrieved 15 November 2012.
  18. "Former defence minister K.C. Pant passes away; PM and Antony offer condolences". India Today. 15 November 2012.
  19. An eulogy for Shri K.C.Pant,

వెలుపలి లంకెలు

[మార్చు]